ఇక్థియోసిస్ వల్గారిస్
ఇక్థియోసిస్ వల్గారిస్ (Ichthyosis vulgaris) అనునది వంశ పారంపర్యంగా సంక్రమించు చర్మ సంబంధ అసాధారణ స్థితి. ఈ వ్యాధి ఉన్నవారి చర్మం పొడిబారి, పొలుసులుగా విడిపోతుంది. ప్రతి 250 మందిలో ఒక్కరు దీని బారిన పడతారు. తల్లిదండ్రులలో ఎవరి ద్వారా నైనా ఒక అసాధారణ జన్యువు సంక్రమించటంతో ఈ వ్యాధి సోకుతుంది.
ఇక్థియోసిస్ వల్గారిస్ | |
---|---|
Ichthyosis vulgaris #1 (top-left) | |
ప్రత్యేకత | Medical genetics |
ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. చాలా తక్కువగా దురద ఉండటం, శరీరం కనిపించే లాగా బట్టలు వేసుకోలేకపోవటం తప్పితే వేరే ఎటువంటి హాని ఉండదు.
స్వేదం ఈ వ్యాధి తీవ్రతని తగ్గించటం మూలాన, తేమ వాతావరణం ఉన్న ప్రదేశాలు వ్యాధిగ్రస్తులకి క్షేమం. ఎయిర్-కండిషన్, మద్యం దీని తీవ్రతని పెంచవచ్చును.
తీసుకొనవలసిన జాగ్రత్తలు
మార్చు- మాయిశ్చరైజింగ్ క్రీములు, లోషన్ లు, స్నోలు వాడాలి
- మరీ వేడినీటితో కాకుండా, గోరువెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలి (చలికాలంలో కూడా).
- స్నానం చేసి, తువ్వాలుతో తుడుచుకొన్న వెంటనే, ఆ తడి ఆరక ముందే, క్రీము రాయాలి.
- ప్యారాఫిన్ మైనం గల క్రీములు శ్రేయస్కరం. (ఉదా: వ్యాజ్లిన్). వీటివల్ల జిడ్డు ఎక్కువగా ఉంటే ఎమోలియంట్, హ్యూమెక్టెంట్, కెరటాలిటిక్ క్రీములు వాడాలి. (ఉదా: మాయిశ్చరెక్స్, కోటరిల్)
మూలాలు
మార్చు1. http://www.nlm.nih.gov/medlineplus/ency/article/001451.htm