ఇక్రమ్ అలీఖిల్
ఇక్రమ్ అలీఖిల్ ( జననం 2000 సెప్టెంబరు 29) ఆఫ్ఘన్ క్రికెటరు. [1] అతను 2019 మార్చిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ | 2000 సెప్టెంబరు 29|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ batter | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 13) | 2019 మార్చి 15 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 45) | 2019 మార్చి 2 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 ఆగస్టు 22 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 21 September 2022 |
దేశీయ, U19 కెరీర్
మార్చుఅతను 2017 సెప్టెంబరు 14న 2017 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ కోసం తన ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు. [3] దానికి ముందు అతను, 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఆడాడు. [4] అతను 2017 ACC అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో అజేయ శతకాన్ని సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు వారి తొలి ACC అండర్-19 కప్ టైటిల్‌ను గెలుచుకోవడంలో సహాయం చేశాడు. [5]
2017 డిసెంబరులో అతను, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [6]
అతను 2018 మార్చి 1న 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో స్పీన్ ఘర్ రీజియన్‌కు తన తొలి ఫస్ట్-క్లాస్ ఆడాడు.[7] అతను 2018 జూలై 10న 2018 ఘాజీ అమానుల్లా ఖాన్ ప్రాంతీయ వన్డే టోర్నమెంట్‌లో స్పీన్ ఘర్ రీజియన్‌కు తన తొలి లిస్ట్ A మ్యాచ్ ఆడాడు. [8]
2018 సెప్టెంబరులో, అతను ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో బాల్ఖ్ జట్టుకు ఎంపికయ్యాడు. [9]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2018 డిసెంబరులో అతను, 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. [10]
2019 ఫిబ్రవరిలో భారతదేశంలో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెస్టు, వన్ డే ఇంటర్నేషనల్ స్క్వాడ్‌లలోకి ఇక్రమ్‌ను తీసుకున్నారు.[11] [12] అతను 2019 మార్చి 2న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్‌డేల్లోకి ప్రవేశించాడు.[13] 2019 మార్చి 15న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు [14]
2019 జూన్ 6న, ఇక్రమ్‌ను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో తీసుకున్నారు. మోకాలి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగిన మహ్మద్ షాజాద్ స్థానంలో అతను చేరాడు. [15]
మూలాలు
మార్చు- ↑ "Who is Ikram Ali Khil?". International Cricket Council. Retrieved 8 June 2019.
- ↑ "Ikram Ali Khil". ESPN Cricinfo. Retrieved 14 September 2017.
- ↑ "7th Match, Shpageeza Cricket League at Kabul, Sep 14 2017". ESPN Cricinfo. Retrieved 14 September 2017.
- ↑ "All 16 squads confirmed for ICC U19 Cricket World Cup 2016". International Cricket Council. Retrieved 23 May 2017.
- ↑ "Faizi ton, Mujeeb five-for hand Afghanistan maiden U-19 Asia Cup title". ESPN Cricinfo. Retrieved 24 November 2017.
- ↑ "Mujeeb Zadran in Afghanistan squad for Under-19 World Cup". ESPN Cricinfo. Retrieved 7 December 2017.
- ↑ "1st Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Amanullah, Mar 1-4 2018". ESPN Cricinfo. Retrieved 4 March 2018.
- ↑ "Group B, Ghazi Amanullah Khan Regional One Day Tournament at Khost, Jul 10 2018". ESPN Cricinfo. Retrieved 10 July 2018.
- ↑ "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. Retrieved 10 September 2018.
- ↑ "Afghanistan Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 3 December 2018.
- ↑ "Mujeeb left out for Ireland Test, Shahzad out of T20Is". ESPN Cricinfo. Retrieved 7 February 2019.
- ↑ "No Mujeeb in Tests as Afghanistan announce squads for Ireland series". International Cricket Council. Retrieved 7 February 2019.
- ↑ "2nd ODI (D/N), Ireland tour of India at Dehra Dun, Mar 2 2019". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
- ↑ "Only Test, Ireland tour of India at Dehra Dun, Mar 15-19 2019". ESPN Cricinfo. Retrieved 15 March 2019.
- ↑ "Mohammad Shahzad out of CWC19, Ikram Ali Khil called up". International Cricket Council. Retrieved 7 June 2019.