ఇచ్ఛాపురపు జగన్నాథరావు

ఇచ్ఛాపురపు జగన్నాథరావు విశాఖపట్నంలో 1931, అక్టోబరు 19వ తేదీన జన్మించాడు[1]. ఇతడు 1955లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (ఆర్థిక శాస్త్రం)లో ఎంఏ బంగారు పతకం సాధించాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగంలో చేరాడు. విద్యార్థి దశ నుంచే కథలు రాయడం ప్రారంభించాడు. జగన్నాథరావు రచించిన కథానికలు, నవలలు, నాటికలు మొత్తం 13 సంపుటాలుగా వెలువడినాయి. ఆంధ్రజ్యోత్తి, ఆంధ్రభూమి పత్రికల్లో వీక్లీ కాలమ్స్‌ వ్రాశాడు. కొన్ని తెలుగు కథలను హిందీలోకి అనువదించాడు. సాహిత్య అకాడమీ ముద్రించిన ‘కథాసాగర్‌’ (హిందీ), ‘60 ఏళ్ల కథానికలు’లో ఇతని రచనలు ప్రచురితమయ్యాయి. ఎగువ మధ్య తరగతి కుటుంబాల జీవన చిత్రాలను కథీకరించడంలో అందె వేసిన చెయ్యిగా ఇతడు పేరు సంపాదించాడు. కస్టమ్స్‌, అబ్కారీ శాఖ కలెక్టర్‌గా, కేంద్ర స్థాయి హోదాలోనూ పలు బాధ్యతలు చేపట్టిన జగన్నాథరావు 1991లో ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఇతనికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారాన్ని అందుకున్నాడు. జగన్నాథరావు రాసిన కొన్ని కథలతో ‘వానజల్లు’ అనే కథా సంపుటి వెలువడింది.

మరణంసవరించు

ఇతడు తన 86వ యేట హైదరాబాదు బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో డిసెంబరు 13, 2017 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు[2].

రచనలుసవరించు

కథా సంపుటాలుసవరించు

  1. ఆకులురాలేకాలం
  2. ఎదురద్దాలు
  3. చేదుకూడా ఒక రుచే
  4. ప్రేమించిన మనిషి
  5. వానజల్లు

మూలాలుసవరించు

  1. కథానిలయం జాలస్థలిలో రచయిత వివరాలు[permanent dead link]
  2. విలేఖరి (15 December 2017). "ప్రముఖ కథా రచయిత ఇచ్ఛాపురపు జగన్నాథరావు మృతి". ఆంధ్రజ్యోతి. Retrieved 15 December 2017.