ఇదీలోకం 1946లో కొండముది గోపాలరాయశర్మ రాసిన మూడంకముల సాంఘీక నాటకం. పెట్టబడిదారుల అరాచకాలు, పేదవారి ఆకలి చావులు వంటి సాంఘిక సమస్యల నేపథ్యంలో ఈ నాటకంలో రాయబడింది.[1][2]

ఇదీలోకం
కృతికర్త: కొండముది గోపాలరాయశర్మ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: రామా అండ్ కో (పట్టాభి ప్రెస్), ఏలూరు
విడుదల: ఆగస్టు, 1946
పేజీలు: 101

కథానేపథ్యం

మార్చు

అగ్రవర్ణాల వారితో ఎదురెళ్ళి తిరిగివచ్చిన తక్కువ కులాలవారిని, జీవచ్ఛవంలో కడుపుకక్కుర్తి కొద్ది మానాభిమానాలను చంపుకొని, పొట్టకూటికై ఎంతటి నైచ్యానికైనా సిద్ధపడే అభాగ్యులను, లక్ష్మీనరసయ్య వంటి కరుడుగట్టిన పెట్టుబడిదారులను చూపించబడింది.

పాత్రలు

మార్చు
  1. పుల్లడు - మాలవాడు
  2. పెద్దోడు - పుల్లడి కొడుకు
  3. బుడ్డోడు - పుల్లడి కొడుకు
  4. లక్ష్మీనరసయ్య - మిల్లుల యజమాని
  5. వెంకయ్య - అతడి అన్న
  6. తాత - బిచ్చగాడు
  7. శాస్త్రీ - కవి, జ్యోతిష్యుడు
  8. లచ్చి - పుల్లడి భార్య

ఇతర వివరాలు

మార్చు

పద్యాలతో, పదిహేనంకాలతో, పౌరాణిక ఇతివృత్తాలతో నాటకాలు ప్రదర్శితమవుతున్న రోజుల్లో ప్రయోగాత్మకంగా కొద్ది అంకాలతో, పద్యాలు లేకుండా పూర్తివచనంలో ఈ నాటకం రాయబడింది. ఆ క్రమంలో రాయబడిన రెండవ నాటకం ఇది.

మూలాలు

మార్చు
  1. సమాజ దర్పణం ఎదురీత, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 3 జూలై 2017, పుట.14
  2. ప్రజాశక్తి, ఫీచర్స్ (8 May 2019). "తొలినుంచి ప్ర‌జా ప‌క్ష‌మే!". www.prajasakti.com. వల్లూరి శివప్రసాద్‌. Archived from the original on 19 ఆగస్టు 2019. Retrieved 19 August 2019.

ఇతర లంకెలు

మార్చు