ఇన్‌స్క్రిప్టు (Inscript) అనే పదం ఆంగ్లంలోని ఇండియన్ స్క్రిప్టు (Indian Script) నుండి వచ్చింది. ఈ కీబోర్డు అమరికను భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్సు విభాగం (Department of Electronics) 1986లో తయారు చేసింది.[1] ఈ కీబోర్డు అమరికలో, భారతదేశంలోని అన్ని భాషల అక్షరాలు అమర్చి ఉంటాయి. అయితే ఈ అక్షరాలనన్నిటినీ ఐఐఎస్‌సిఐ (IISCI) అనే ఒక ప్రామాణికంలో నిర్వచించారు. అంతేకాదు భారతీయ భాషలలో అతిత్వరగా టైపు చేయగలిగేటట్లు ఈ అమరికను తయారు చేసారు. భారతీయ అక్షరాలలో ఉన్న స్వారూప్యత వలన ఒక్క భారతీయ భాషలో టైపు చేయడం నేర్చుకుంటే మిగతా భాషలలో కూడా టైపు చేయడం సులువుగా ఉంటుంది.

QWERTY కీ బోర్డుతో దీనిని వాడవచ్చు. ఎడమవైపున ఇంగ్లీషు అక్షరాలు కుడివైపున ఇన్‌స్క్రిప్టు అక్షరాలు గల ఓవర్ లే వాడాలి.

విండోస్ 7లో, ఉబుంటు లలో సాధారణంగా Left ALT+Shift ని QWERTY నుండి ఇన్‌స్క్రిప్టు లోకి మారటానికి Toggle కీగా వాడతారు. తాత్కాలికముగా ఒక ఇన్‌స్క్రిప్టుఅక్షరము టైపు చేయటానికి ALT+SPACE (IBM enhanced keyboard) లేక SYS-REQ (PC-AT 88 key keyboard) వాడతారు.

అన్ని భారతీయ భాషలని విశ్లేషించి, ఒకేలా వుండేలా ప్రామాణీకరించారు. దీనిలో ఎడమవైపు అచ్చులు కుడివైపు హల్లులు ఉన్నాయి. అచ్చులకీ లలో గుణింతాలు మామూలుగాను, షిఫ్ట్ తో అచ్చులుగాను వస్తాయి. హ్రస్వ అచ్చులు ప్రధాన వరుసలో, దీర్ఘ అచ్చులు పై వరుసలో ఉన్నాయి. 'd' కు మామూలుగా హలాంత్ (్ : న కార పొల్లు) వస్తుంది. దీనిని సంయుక్త అక్షరాలకు వాడతారు.

చాల హల్లులకి హలాంత్ చేర్చినపుడు, లేకహల్లులకి గుణింతాలు రాసేటప్పుడు, ఎడమచేతి వేళ్ళు, తరువాత కుడిచేతి వేళ్ళు వాడాల్సి రావటంతో త్వరగా టైపు చేయటం కుదురుతుంది.

హల్లుల కీలలో 5 వర్గాల మొదటి అక్షరాలు ప్రధాన వరుసలో ఉన్నాయి. షిఫ్ట్ తో వాటి రెండవ అక్షరాలు వస్తాయి. ముక్కుతో పలకని హల్లులను అ వర్గానికి దగ్గరకీ లలో ఇచ్చారు. ముక్కుతో పలికే హల్లులను ఎడమవైపు చివరి వరుసలో ఇచ్చారు. మిగతావి కుడివైపు ఇచ్చారు. పై వరుసలో ఎక్కువగా వాడే సంయుక్త అక్షరాలని ఇచ్చారు. ఇవి నొక్కినపుడు, వాటి మూల అక్షరాల సమూహము వస్తుంది.

కీబోర్డుపై తెలుగు అక్షరాల అమరిక సవరించు

 

 
విండోస్ లో తెలుగు కీబోర్డు ఇన్స్క్రిప్ట్ తెరపట్టు (Circa 2005)

విండోస్ రూపంలో తెలుగులో మృగ్యమైన లు కు ఇతర రూపాలకు (ఌ , ౡ) కూడా స్థానం కల్పించారు.:

టైపింగ్ ఉదాహరణలు సవరించు

సాధారణ అక్షరాలు, పదాలు సవరించు

  • D=అ, E= ఆ, F= ఇ, ... Q=ఔ
  • h=ప, he=పా, hf= పి...hx=పం
  • hd=ప్, hdj=ప్ర, hdje=ప్రా, ... hdjx= ప్రాం
  • hd/s=ప్యే, h-=పృ
  • లక్ష్మి = nkd<dcf

పారిభాషిక పదాలు సవరించు

పారిభాషిక పదాలను తెలుగులిపిలో రాసేటప్పుడు ప్రత్యేక అక్షరాలు వాడితే చదవటానికి సులభంగా వుంటుంది.

  • మామూలుగా కలిసి వచ్చే వాటిని విడదీయాలంటే (క్షను క్ ష్ గా) శూన్యవెడల్పుకలుపు (Zero Width Joiner (ZWJ) (U+200D) వాడాలి.
  • ఒక హల్లుకి చాలా వత్తులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత శూన్యవెడల్పువిరుపు (Zero Width Non Joiner (ZWNJ) (U+200C) వాడి రాయాలి. ఉదా:సాఫ్ట్వేర్ ని సాఫ్ట్‌వేర్ గా. ఇది సాధారణంగా పారిభాషిక పదాలు హలాంతంలో వుండి వాటికి విభక్తులు చేర్చాల్సినప్పుడు ZWNJ వాడవచ్చు. ఉదా:ఫైర్ఫాక్స్లోని ఫైర్ఫాక్స్ లో

దీనికొరకు వివిధ నిర్వహణ వ్యవస్థలలో కోడ్ వివరాలు క్రింద ఇవ్వబడినవి.

విండోస్

ZWJ=<Ctrl+Shift+1>, ZWNJ=<Ctrl+Shift+2>

లినక్స్ (ibus, scim m17n-tables వాడేటప్పుడు)

ZWJ=Not available, ZWNJ=<shift+b>,

పై కోడ్లు మీకు తెలియకపోతే టైపు చేసేటపుడు ZWJ కొరకు హెచ్ టి ఎమ్ ఎల్ కోడ్ & z w j ; (మధ్యలో ఖాళీ లేకుండా), ZWNJ కొరకు & z w n j ; (మధ్యలో ఖాళీ లేకుండా) నేరుగా టైపు చేసిన సరిపోతుంది.
ఉదాహరణ (ZWJ, ZWNJ వాడకపోతే కనబడేవిధము) క్రింది దానిలో మీ కంప్యూటర్ వ్యవస్థకి సరిపోలిన మీటలను <ZWJ>, <ZWNJ>కు బదులుగా నొక్కినపుడు కనబడేవిధము.
kd<=క్ష kd<<ZWJ>=క్ ష (మధ్యలో ఖాళీ వాడి చూపడం జరిగింది. మీరు సరియైన కోడ్ చేరిస్తే ఖాళీ లేకుండా వస్తుంది)
hwjdHekdmdna=పైర్ఫాక్స్లో hwjdHekdm d<ZWNJ>na=ఫైర్ఫాక్స్ లో (మధ్యలో ఖాళీ వాడి చూపడం జరిగింది. మీరు సరియైన కోడ్ చేరిస్తే ఖాళీ లేకుండా వ స్తుంది)
meHd'bsjd=సాఫ్ట్వేర్ meHd'<ZWNJ> bsjd= సాఫ్ట్ వేర్ ( (మధ్యలో ఖాళీ వాడి చూపడం జరిగింది. మీరు సరియైన కోడ్ చేరిస్తే ఖాళీ లేకుండా వ స్తుంది)

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. భారతదేశంలో భాషల సాంకేతికతను అభివృద్ది కోసం తయారు చేసిన ప్రభుత్వ వెబ్‌సైటులో ఇన్‌స్క్రిప్టుపై ఒక వ్యాసం Archived 2011-07-16 at the Wayback Machine. సేకరించిన తేదీ: జూలై 13, 2007

బయటి లింకులు సవరించు