ఇప్పుడు కాక ఇంకెప్పుడు

(ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు నుండి దారిమార్పు చెందింది)

ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా.శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.హెచ్‌ గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వై. యుగంధర్‌ దర్శకత్వం వహించాడు. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, క్యాథ‌లిన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 6న విడుదలైంది.[1]

ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు
దర్శకత్వంవై. యుగంధర్‌
నిర్మాతసి.హెచ్‌ గోపాలకృష్ణారెడ్డి
తారాగణంహశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, క్యాథలిన్ గౌడ
కూర్పుశ్రీకాంత్ పట్నాయక్
సంగీతంసాహిత్య సాగర్
నిర్మాణ
సంస్థ
శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
2021 ఆగస్టు 6 (2021-08-06)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ యే ఈ సినిమా క‌థ‌.

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్
 • నిర్మాత: సి.హెచ్‌ గోపాలకృష్ణారెడ్డి
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వై. యుగంధర్‌
 • సంగీతం: సాహిత్య సాగర్
 • సినిమాటోగ్రఫీ: జెమిన్ జామ్
 • ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్
 • కోరియోగ్రఫీ : శ్రీ క్రిష్
 • పాటలు: సాహిత్య సాగర్, సురేష్ బానిసెట్టి

వివాదాలు మార్చు

‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ ట్రైలర్‌ లో శ్రీవేంకటేశ్వరస్తామిని పవిత్రంగా కీర్తించే ‘భజగోవిందం’ కీర్తనతో బెడ్‌ రూమ్‌ సన్నివేశాలను అసభ్యంగా చిత్రీకరించి, శ్రీ కృష్ణ పరమాత్మను, తులసీ మాతను కించపరిచేలా సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయనీ, అవి హిందువుల విశ్వాసాలను గాయపరుస్తున్నాయని విహెచ్‌పి , బీజేపీ పార్టీకి సంబందించిన వారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.[2][3]

మూలాలు మార్చు

 1. Sakshi (2 August 2021). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
 2. NTV (3 August 2021). "'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్ర యూనిట్‌పై కేసు". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
 3. TV9 Telugu (4 August 2021). "విడుదలకు ముందే చిత్రయూనిట్‏కు షాక్.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు." Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)