ఇఫ్తికార్ అహ్మద్

పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు

ఇఫ్తీకర్ అహ్మద్ (జననం 1990, సెప్టెంబరు 3) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తరపున టీ20, వన్డే ఫార్మాట్‌లో ప్లే-ఎలెవన్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో, గతంలో కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడాడు. ఇప్పుడు క్వెట్టా గ్లాడియేటర్స్‌లో ఉన్నాడు. 2015 నవంబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కొరకు అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[2]

ఇఫ్తీకర్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1990-09-03) 1990 సెప్టెంబరు 3 (వయసు 34)
పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
మారుపేరుఇఫ్తీ చాచా
ఎత్తు5 అ. 10 అం. (178 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రమిడిల్ ఆర్డర్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 221)2016 ఆగస్టు 11 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2022 4 మార్చ్ - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 207)2015 13 నవంబర్ - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2023 10 సెప్టెంబర్ - ఇండియా తో
తొలి T20I (క్యాప్ 69)2016 4 మార్చ్ - శ్రీలంక తో
చివరి T20I2023 ఏప్రిల్ 17 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–2015పెషావర్ పాంథర్స్
2011–2018వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ క్రికెట్ టీమ్
2016; 2019–2020కరాచీ కింగ్స్ (స్క్వాడ్ నం. 95)
2017పెషావర్ జల్మీ
2018, 2021ఇస్లామాబాద్ యునైటెడ్ (స్క్వాడ్ నం. 95)
2019–2023ఖైబర్ పఖ్తుంక్వా క్రికెట్ జట్టు
2022-presentక్వెట్టా గ్లాడియేటర్స్ (స్క్వాడ్ నం. 95)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20
మ్యాచ్‌లు 4 18 47
చేసిన పరుగులు 61 477 778
బ్యాటింగు సగటు 12.20 47.2 27.78
100s/50s 0/0 1/1 0/4
అత్యధిక స్కోరు 27 109* 62*
వేసిన బంతులు 206 396 211
వికెట్లు 1 8 4
బౌలింగు సగటు 161.00 44.75 62.5
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/1 5/40 1/7
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 14/– 15/–
మూలం: Cricinfo, 7 May 2023

తొలి జీవితం

మార్చు

ఇతను పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పష్టూన్ కుటుంబంలో జన్మించాడు. తన స్వగ్రామంలో క్రికెట్ స్టేడియం నిర్మించాడు.[3]

దేశీయ క్రికెట్

మార్చు

2017–18 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీలో సూయ్ నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్స్ లిమిటెడ్ తరపున పదకొండు మ్యాచ్‌లలో 735 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[4]

2017 జనవరి 27న, 2016–17 ప్రాంతీయ వన్డే కప్ ఫైనల్‌లో 131 నాటౌట్, 12 పరుగులకు 3 వికెట్లు తీశాడు. గౌహర్ అలీతో కలిసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[5][6] 2017 పాకిస్తాన్ కప్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా తరపున నాలుగు మ్యాచ్‌లలో 244 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[7]

2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[8][9] టోర్నమెంట్ సింధు ప్రారంభ మ్యాచ్‌లో, బలూచిస్తాన్‌పై 116 పరుగులు చేశాడు, సింధు 12 పరుగుల తేడాతో గెలిచినందున మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[10] నాలుగు మ్యాచ్‌ల్లో 230 పరుగులతో టోర్నమెంట్‌లో సింధు తరఫున అత్యధిక పరుగులు చేశాడు.[11]

2018-19 క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌లలో 660 పరుగులతో సుయ్ నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్స్ లిమిటెడ్ తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[12] 2019 మార్చిలో, 2019 పాకిస్థాన్ కప్ కోసం పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[13][14]

2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ టోర్నమెంట్‌కు ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[15][16] 2021 అక్టోబరులో, 2021–22 నేషనల్ టీ20 కప్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా విజయవంతమైన టైటిల్ డిఫెన్స్‌కు నాయకత్వం వహించాడు.[17] ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.[18]

టీ20 ఫ్రాంచైజీ కెరీర్

మార్చు

2018 సెప్టెంబరులో, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మొదటి ఎడిషన్‌లో కాందహార్ జట్టులో ఎంపికయ్యాడు.[19]

2023 జనవరిలో, 2022–23 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చ్యూన్ బరిషల్ తరపున ఆడుతున్నప్పుడు, తన తొలి టీ20 సెంచరీని కొట్టాడు.[20]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

2015 అక్టోబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు-రోజుల మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎ తరపున అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.[21] అదే పర్యటనలో 2015, నవంబరు 13న వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[22] 2016, ఆగస్టు 11న ఇంగ్లాడ్‌పై తన టెస్టు అరంగేట్రం చేశాడు.[23]

మొదట 2016 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. అయితే పేలవమైన ఫామ్ కారణంగా తర్వాత తొలగించబడ్డాడు.[24] అయినప్పటికీ, 2016 మార్చి 4న 2016 ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[25]

2019 సెప్టెంబరులో, శ్రీలంకతో జరిగిన పాకిస్తాన్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టులో చేర్చబడ్డాడు. జట్టులోకి తిరిగి పిలిచిన ముగ్గురు ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[26] 2020 మేలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 2020–21 సీజన్‌కు ముందు సెంట్రల్ కాంట్రాక్ట్‌ని అందజేసింది.[27][28]

2020 జూన్ లో, కరోనా-19 మహమ్మారి సమయంలో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం 29 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[29][30] 2020 నవంబరు 1న జింబాబ్వేతో జరిగినరెండో మ్యాచ్‌లో, ఇఫ్తికార్ వన్డే క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్లు సాధించాడు.[31]

మూలాలు

మార్చు
  1. Iftikhar Ahmed’s profile on Sportskeeda
  2. "Iftikhar Ahmed". ESPN Cricinfo. Retrieved 6 October 2015.
  3. Mehboob, Atika (20 November 2022). "Iftikhar Ahmed's untold story narrated by his family member". CricWick.
  4. "Quaid-e-Azam Trophy, 2017/18: Sui Northern Gas Pipelines Limited Batting and bowlingaverages". ESPN Cricinfo. Retrieved 8 April 2018.
  5. "Regional One Day Cup, Final: Karachi Whites v Peshawar at Karachi, Jan 27, 2017". ESPN Cricinfo. Retrieved 27 January 2017.
  6. "Gauhar, Iftikhar tons lead Peshawar to title". ESPN Cricinfo. Retrieved 27 January 2017.
  7. "Pakistan Cup, 2017 Khyber Pakhtunkhwa: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 19 April 2018.
  8. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  9. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  10. "Umar, Iftikhar blast centuries as Sindh edge Balochistan". The News International. Retrieved 28 April 2018.
  11. "Pakistan Cup 2018, Sindh: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 4 May 2018.
  12. "Quaid-e-Azam Trophy, 2018/19 - Sui Northern Gas Pipelines Limited: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 December 2018.
  13. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. Retrieved 25 March 2019.
  14. "Pakistan Cup one-day cricket from April 2". The International News. Retrieved 25 March 2019.
  15. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  16. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
  17. "National T20 Cup: Sensational Iftikhar Ahmed leads Khyber Pakhtunkhwa to second successive title". ESPN Cricinfo. Retrieved 13 October 2021.
  18. "Iftikhar Ahmed's all-round heroics see Khyber Pakhtunkhwa to successful National T20 title defence". Pakistan Cricket Board. Retrieved 13 October 2021.
  19. "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. 10 September 2018. Retrieved 10 September 2018.
  20. "Iftikhar Ahmed creates T20 history in BPL 2023". Geo Super. 19 January 2023. It is worth mentioning here that it was Iftikhar's maiden T20 hundred.
  21. "England tour of United Arab Emirates, Tour Match: England XI v Pakistan A at Sharjah, Oct 5-6, 2015". ESPN Cricinfo. Retrieved 6 October 2015.
  22. "England tour of United Arab Emirates, 2nd ODI: England v Pakistan at Abu Dhabi, Nov 13, 2015". ESPN Cricinfo. Retrieved 13 November 2015.
  23. "Pakistan tour of England and Ireland, 4th Investec Test: England v Pakistan at The Oval, Aug 11-15, 2016". ESPN Cricinfo. Retrieved 11 August 2016.
  24. "Pakistan pick Manzoor, Raees for WT20". ESPN Cricinfo. Retrieved 10 February 2016.
  25. "Asia Cup, 10th Match: Pakistan v Sri Lanka at Dhaka, Mar 4, 2016". ESPN Cricinfo. Retrieved 4 March 2016.
  26. "Iftikhar Ahmed, Mohammad Rizwan and Mohammad Nawaz return to Pakistan's ODI squad". ESPN Cricinfo. Retrieved 22 September 2019.
  27. "Naseem Shah earns PCB central contract; Hasan Ali, Wahab Riaz, Mohammad Amir left out". ESPN Cricinfo. Retrieved 13 May 2020.
  28. "Naseem Shah named in men's central contract list for 2020-21". Pakistan Cricket Board. Retrieved 13 May 2020.
  29. "Haider Ali the new face as Pakistan name 29-man touring party for England". ESPN Cricinfo. Retrieved 12 June 2020.
  30. "Haider Ali named in 29-player squad for England tour". Pakistan Cricket Board. Retrieved 12 June 2020.
  31. "Five-wicket Iftikhar helps Pakistan bowl Zimbabwe for 206". France24. November 2020. Retrieved 1 November 2020.

బాహ్య లింకులు

మార్చు