ఇరుపు జలపాతం కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వత శ్రేణిలో కూర్గు ప్రాంతానికి దక్షిణాన ఉంది.[1]

ఇరుపు జలపాతం
Irupu Falls before monsoon
ప్రదేశంకొడగు జిల్లా, కర్ణాటక, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు11°58′2.22″N 75°59′1.56″E / 11.9672833°N 75.9837667°E / 11.9672833; 75.9837667
మొత్తం ఎత్తు170 ft
బిందువుల సంఖ్య2
నీటి ప్రవాహంలక్ష్మణ తీర్థ నది

చరిత్ర

మార్చు

పురాణాల ప్రకారం రాముడు, లక్ష్మణుడు సీత కోసం అడవిలో వెతుకుతున్నపుడు బ్రహ్మగిరి శ్రేణి నుంచి వెళ్లారని, అదేసమయంలో రాముడు తనకు తాగునీరు తీసుకురావాలని లక్ష్మణుడిని కోరినప్పుడు, లక్ష్మణుడు బ్రహ్మగిరి కొండల్లోకి బాణం వేసి లక్ష్మణ తీర్థ నదిగా తీసుకువచ్చాడు. ఈ పురాణం కారణంగా, ఈ జలపాతం పాపాలను శుభ్రపరిచే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు, శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు దీనిని సందర్శిస్తారు.[2]

మరిన్ని విశేషాలు

మార్చు

ఈ జలపాతం మంచినీటి జలపాతం. ఈ జలపాతాన్ని లక్ష్మణ తీర్థ జలపాతం అని కూడా పిలుస్తారు, ఈ జలపాతం నుండి ప్రారంభమయ్యే కావేరి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది ఇక్కడినుండే ప్రవహిస్తుంది. అందుకే ఈ జలపాతాన్ని లక్ష్మణ తీర్థ జలపాతం అని పిలుస్తారు. ఈ జలపాతం నుంచి నడక మార్గాన దక్షిణ కొడగు మీదుగా వెళ్లితే బ్రహ్మగిరి శిఖరానికి చేరుకోవచ్చు. ఈ జలపాతం పర్యాటక ఆకర్షణే కాకుండా ఇక్కడ పురాతన శివాలయం అయినటువంటి రామేశ్వర ఆలయం లక్ష్మణ తీర్థ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో శివరాత్రి పండుగ రోజు ఉత్సవాలు జరుగుతాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

జోగ్ జలపాతం

మూలాలు

మార్చు
  1. High Falls Holiday
  2. "Coorg Hill Station". Archived from the original on 2019-11-18. Retrieved 2019-10-07.

3. Elegant holiday homes