ఇరూసిక్ ఆమ్లం
ఇరూసిక్ ఆమ్లం (యూరిసిక్ ఆమ్లం) ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం. ఇది ఒక ద్విబంధాన్ని కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. ఇరూసిక్ ఆమ్లం 22 కార్బనులను కలిగి వున్న, ఒకే ద్విబంధమున్న అసంతృప్త ఆమ్లం. ఈ ఆమ్లాన్ని ఏక ద్విబంధయుత కొవ్వు ఆమ్లం (monounsaturated fatty acid) అంటారు . ఈ కొవ్వు ఆమ్లం క్రూసిఫెరె (cruciferae) కుటుంబానికి చెందిన మొక్కల గింజలలో అధికంగా లభ్యమవుతుంది.[1] ఆవాలు (mustard, rapeseed) నూనెలో, వాల్‌ప్లవరు గింజల నూనెలలో ఇరూసిక్ ఆమ్లం ఎక్కువ శాతంలో కన్పిస్తుంది.
పేర్లు | |
---|---|
IUPAC నామము
(Z)-Docos-13-enoic acid
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [112-86-7] |
పబ్ కెమ్ | 5281116 |
కెగ్ | C08316 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:28792 |
SMILES | O=C(O)CCCCCCCCCCC\C=C/CCCCCCCC |
| |
ధర్మములు | |
C22H42O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 338.58 g·mol−1 |
స్వరూపం | White waxy solid |
సాంద్రత | 0.860 g/cm3 |
ద్రవీభవన స్థానం | 33.8 °C (92.8 °F; 306.9 K) |
బాష్పీభవన స్థానం | 381.5 °C (decomposes) |
Insoluble | |
ద్రావణీయత in methanol and ethanol | Soluble |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
ఉనికి-చరిత్ర
మార్చుఅవాలనూనెలో ఇరూసిక్ ఆమ్లాన్ని అధికంగా వున్నట్లు గుర్తించారు. సంస్కృత గ్రంథాలలో వ్రాసినదానినిబట్టి క్రీ.పూ.200-1550 సం.నాటికే ఆవాలపంటను సాగుచేసి, ఆవాలనూనెను వంట చెయ్యుటకు, కాగడాలను వెలిగించుటకు ఉపయోగించేవారని తెలుస్తున్నది. గ్రీకు, రోమను, చైనా భాషలలో లభ్యమైన లిఖిత సమాచారం ప్రకారం క్రీ.పూ.500-200 సం. మధ్య ఔషధాలలోకూడా వాడేవారని తెలుస్తున్నది [2]
ఆమ్ల సౌష్టవ నిర్మాణం భౌతిక రసాయనిక ధర్మాలు
మార్చుఇరూసిక్ ఆమ్లం ఒక మోనో కార్బోక్సిల్ ఆమ్లం.కొవ్వుఆమ్లం యొక్క హైడ్రోకార్బను గొలుసు చివర ఒక కార్బోక్సిల్ (COOH) సమూహాన్ని కల్గివుంటుంది. ఒకద్విబంధాన్ని 13 వకార్బను వద్ద కలిగివున్నది (COOH వైపునుండి లెక్కించినప్పుడు). ఇరూసిక్ కొవ్వు ఆమ్లం ద్విబంధం వద్ద సిస్ అమరికను కలిగివుండును. దీనికి ఒమేగా (ω) -9 కొవ్వు ఆమ్లమనికూడా పిలుస్తారు. ఇవన్ని ఇరూసిక్ ఆమ్లం యొక్క సాధారణ పేర్లు. ఇరూసిక్ ఆమ్లంయొక్క శాస్త్రీయమైన పేరు సిస్, 13-డొకోసెనోయిక్ ఆమ్లం (cis-13-Docosenoic acid).దీని యొక్క అణుఫార్ములా: C21H41COOH
ఇరూసిక్ నిర్మాణ రసాయనిక ఫార్ములా
భౌతిక, రసాయనక ధర్మాల పట్టిక [3]
గుణము | విలువల మితి |
భౌతిక స్థితి | తెల్లని, మైనం వంటి గనరూపం |
అణు ఫార్ములా | CH3 (CH2) 7CH=CH (CH2) 11COOH |
అణుభారం | 338.57 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 34-35 °C |
బాష్పీభవన ఉష్ణోగ్రత | 359 °C |
విశిష్ట గురుత్వం | 0.853 |
ఆమ్ల విలువ | 160-170 (మి.గ్రాం.KOH/గ్రాం) |
అయోడిన్ విలువ | 70-79 |
- ఇరూసిక్ ఆమ్లం ఇథనాల్,, మిథనాల్ సారాయి లలో కరుగుతుంది.
రసాయనిక చర్యలు
మార్చుక్షారాలతో చర్య
మార్చు- క్షార మూలకాలతో, వాటియొక్క హైడ్రాక్సైడు, ఆక్సైడు, కార్బోనేటులతో చర్య జరుపును.
ఆల్కహాల్ లతో చర్య/ఆల్కహాలిసిస్
మార్చు- మిథైల్.ఇథైల్ ఆల్కహాల్ లతో చర్య జరుపును.ఫలితంగా ఇరూసిక్ ఆమ్లం యొక్క ఆల్కహాల్ ఎస్టరులు ఏర్పడును.
ఇరూసిక్ ఆమ్లం మిథైల్ ఆల్కహాల్ (మిథనాల్) లో చర్య జరుపుట వలన ఇరూసిక్ ఆమ్లం యొక్క మిథైల్ ఎస్టరు (methyl ester) ఏర్పడును.ఇది సాధారణ వ్యవహారికపేరు. ఇరూసిక్ ఆమ్లం, మిథైల్ ఎస్టరు యొక్క శాస్త్రీయ పేరు మిథైల్ -13- డోకోస్‌ఇనోయేట్ ( Methyl (13Z) -13-docosenoate). 13- డోకోస్‌ఇనోయేట్, మిథైల్ ఎస్టరు (13-Docosenoic acid methyl ester) అనేది మరొక శాస్త్రీయ పేరు.
ఉదజనీకరణ
మార్చు- సరియైన ఉత్ప్రేరకం సమక్షంలో ఇరూసిక్ ఆమ్లాన్ని ఉదజనీకరణ కావించవచ్చును.
ఉపయోగాలు
మార్చు- ఇరూసిక్ ఆమ్లం నుండి ట్రైగ్లిజరాయిడులు, ఇరూక్ ఆమైడులు (amides), ఇరూక్ ఆమైనులు (amines), బెహేనిక్ ఆమ్లం, బెహేనైల్ ఆల్కహాల్, ఇరూసైల్ ఆల్కహాల్ వంటివి తయారు చేయుదురు.[3]
- ఇరూసిక్ ఆమ్లాన్ని, ఒలిక్ ఆమ్లాన్ని కలిపి లోరెంజో నూనె ( Lorenzo's oil) తయారు చేయుదురు. ఈ నూనెను అడ్రినల్ ల్యూకో డిస్ట్రోపి ( adrenoleukodystrophy (ALD) ) అనే వ్యాధి నివారణకై ఉపయోగిస్తారు. ఈ ALD వ్యాధివలన అడ్రినల్ గ్రంథి పనిచెయ్యదు, మెదడుకణాలు దెబ్బతిని మరణం సంభవించే వీలున్నది[4]
- కందెనలు (Lubricants) తయారు చేయుదురు.
ఇవికూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు-ఆధారాలు
మార్చు- ↑ "erucic acid". medical-dictionary.thefreedictionary.com/. Retrieved 2013-11-24.
- ↑ "History". oilseedrape.org.uk. Archived from the original on 2013-03-27. Retrieved 2013-11-23.
- ↑ 3.0 3.1 "ERUCIC ACID". chemicalland21.com/. Retrieved 2013-11-23.
- ↑ "What Is Erucic Acid?". wisegeek.com/. Retrieved 2013-11-23.