ఇర్బియం(III)క్లోరైడ్
ఇర్బియం(III)క్లోరైడ్ ఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్ధం.హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఇర్బియం లవణమే ఇర్బియం (III)క్లోరైడ్.నిర్జల ఇర్బియం క్లోరైడ్ యొక్క రసాయన ఫార్ములా ErCl3 .ఇది ఊదా వర్ణపు ఘన రసాయన పదార్ధం.ఈ రసాయన సంయోగ పదార్ధం నుండి ఇర్బియం లోహాన్ని ఉత్పత్తి చేయుదురు.ఈ సంయోగ పదార్ధం నిర్జల,జలయుత(hydrated)రూపాలలో లభిస్తుంది
పేర్లు | |
---|---|
IUPAC నామము
ఇర్బియం(III)క్లోరైడ్
| |
ఇతర పేర్లు
ఇర్బియం ట్రైక్లోరైడ్
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10138-41-7] |
పబ్ కెమ్ | 66277 |
SMILES | Cl[Er](Cl)Cl |
| |
ధర్మములు | |
ErCl3 (anhydrous) ErCl3·6H2O (hexahydrate) | |
మోలార్ ద్రవ్యరాశి | 273.62 g/mol (నిర్జల) 381.71 g/mol (hexahydrate) |
స్వరూపం | ఊదారంగు(ఆర్ద్రతాకర్షక) monoclinic crystals (నిర్జల) పింకు (ఆర్ద్రతాకర్షక) crystals (ఆర్ద్ర,ఆరు జలబిందుయుత ) |
సాంద్రత | 4.1 g/cm3 (anhydrous) |
ద్రవీభవన స్థానం | 776 °C (1,429 °F; 1,049 K) (anhydrous) decomposes (hexahydrate) |
బాష్పీభవన స్థానం | 1,500 °C (2,730 °F; 1,770 K) |
soluble in water (anhydrous) slightly soluble in ethanol (hexahydrate)[1] | |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Holmium(III) chloride, Thulium(III) chloride |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక ధర్మాలు
మార్చుభౌతిక స్థితి
మార్చుఇర్బియం (III)క్లోరైడ్ ఘన రూప సంయోగ రసాయన పదార్ధం.నిర్జల సంయోగ పదార్ధంఊదా రంగులో ఉండి,జలాకర్షణ కలిగి,మొనోక్లినిక్ అణు నిర్మాణమున్న స్పటికాకృతి కల్గి ఉండును.ఆరు జల బిందువులున్న ఆర్ద్ర రసాయన సంయోగ పదార్ధం పింకురంగులో ఉంది,జలాకర్షణ/ఆర్ద్రతాకర్షణ కల్గిన స్పటికాలుగా ఉండును.
అణుభారం
మార్చునిర్జల ఇర్బియం (III)క్లోరైడ్ యొక్క అణు భారం 273.62 గ్రాములు/మోల్[2]., ఆరు జలబిందువులున్న రసాయన పదార్ధం అణుభారం 381.71 గ్రాములు/మోల్[3]
సాంద్రత
మార్చుసాధారణ ఉష్ణోగ్రత(25 °C), పీడనం వద్ద నిర్జల ఇర్బియం(III) క్లోరైడ్ సాంద్రత 4.1గ్రాములు /సెం.మీ3.[4]
ద్రవీభవన ఉష్ణోగ్రత
మార్చునిర్జల ఇర్బియం(III)క్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం 776 °C (1,429 °F; 1,049 K).ఆర్ద్ర రసాయన సంయోగ పదార్థాన్ని ఈఉష్ణోగ్రత వరకు వేడి చేసిన వియోగం చెందును.
బాష్పీభవన/మరుగు ఉష్ణోగ్రత
మార్చుఇర్బియం(III)క్లోరైడ్ యొక్క బాష్పీభవన స్థానం 1,500 °C (2,730 °F; 1,770 K)
ద్రావణీయత
మార్చునిర్జల ఇర్బియం(III)క్లోరైడ్ నీటిలో కరుగును. ఆరు జలబిందువులున్న సంయోగ పదార్ధం స్వల్ప ప్రమాణంలో ఇథనాల్ లో కరుగును.పింకురంగులో ఉండు ఆరు జలబిందువులున్న ఇర్బియం(III)క్లోరైడ్ యొక్క CAS సంఖ్య [10025-75-9].ఈరసాయన పదార్ధం యొక్క పింకు రంగు ఫ్లోరోసెంట్ కాంతిలో మరింత ప్రకాశవంతంగా,మెరుస్తూ కన్పించును
అణు సౌష్టవం
మార్చుఇర్బియం క్లోరైడ్ అణు నిర్మాణం అల్యూమినియం క్లోరైడ్ వలే మొనోక్లినిక్ సౌష్టవాన్ని పొందివున్నది.
ఉత్పత్తి
మార్చుఆరు జలబిందువులున్న ఇర్బియం(III)క్లోరైడ్ రసాయన సంయోగ పదార్థాన్ని క్లోరిన్ వాయువు లేదా హైడ్రోజన్ క్లోరైడ్ వాయుయుత పరిసరాలలో వేడిచేసిన నిర్జల ఇర్బియం (III)క్లోరైడ్ ఏర్పడును. అలా కాకుండా ఆర్ద్ర ఇర్బియం(III)క్లోరైడ్ ను నేరుగా వేడి చేసిన ఇర్బియం ఆక్సైడ్ క్లోరైడ్(ErOCl,)ఏర్పడును.మరొక పద్ధతిలో ఇర్బియం డయాక్సైడ్(Er2O3)ను ఆధికప్రమాణ అమ్మోనియం క్లోరైడ్(NH4Cl)తో రసాయన చర్య వలన మధ్యంతర స్థితి అమ్మోనియా ఇర్బియం క్లోరైడ్[(NH4)3ErCl6] లవణం,అమ్మోనియా,నీరు ఏర్పడును. ఈ మధ్యంతర లవణాన్ని పీడన రహిత స్థితి(వాక్యుం)లో వియోగం చెందించిన అమ్మోనియా మటియు హైడ్రో క్లోరైడ్ ను వాయు రూపంలో కోల్పోవడం ద్వారా నిర్జల ఇర్బియం(III)క్లోరైడ్ ఎర్పడును.
రసాయనచర్యలు
మార్చుఇర్బియం క్లోరైడ్ క్షారాలతో రసాయనచర్య వలన హైడ్రాక్సైడ్ లు ఏర్పడును
- ErCl3 + 3 XOH → Er(OH)3 + 3 XCl
ఉపయోగాలు
మార్చుఆల్కహాల్, పినాల్ లను అసైలెసన్(acylation )చేయుటలో ఉత్ప్రేరకంగా పనిచేయును(acylationఅనగా సంయోగ పదార్థాలకు అసైల్(acyl)సమూహన్ని చేర్చుచర్య).ఇలా ఉత్ప్రేరకంగా వాడిన రసాయన పదార్థాన్ని పునరుత్పత్తి(recycle)కావించి మరల ఉపయోగించ వచ్చును.[5]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ Lide, David R. (1998). Handbook of Chemistry and Physics (87 ed.). Boca Raton, FL: CRC Press. pp. 4–57. ISBN 0-8493-0594-2.
- ↑ "Erbium(III) chloride". sigmaaldrich.com. Retrieved 2017-03-29.
- ↑ "Erbium(III) chloride hexahydrate". sigmaaldrich.com. Retrieved 2017-03-29.
- ↑ "Erbium(III) chloride". sigmaaldrich.com. Retrieved 2017-03-29.
- ↑ "Erbium(III) chloride". revolvy.com. Retrieved 2017-03-29.