ఇల్కర్ ఐసీ

(ఇల్కర్‌ ఐసీ నుండి దారిమార్పు చెందింది)

ఇల్కర్‌ ఐసీ(ఆంగ్లం: Ilker Ayci) టాటా స‌న్స్ చేతికి ఎయిర్ ఇండియా వచ్చాక ఆ విమానయాన సంస్థకు కొత్త సీఈవో కం మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా నియమితులయ్యారు. 2022 ఏప్రిల్ 1 నుండి బాధ్యతలు చేపట్టుతారు. గతంలో ఇల్కర్‌ ఐసీ టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌ గా వ్యవహరించారు. ఇల్కర్‌ ఐసీ టర్కిష్, ఇంగ్లీష్, రష్యన్ భాషలు అనర్గళంగా మాట్లాడగలడు.[1]

మెహ్మెట్ ఇల్కర్ ఐసి
జననం1971 (age 52–53)
జాతీయతటర్కిష్
వృత్తిఎయిర్ ఇండియా CEO cum MD

1971లో ఇస్తాంబుల్‌లో ఇల్కర్‌ ఐసీ జన్మించారు. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌గా, అంతకముందు ఆ సంస్థ బోర్డు సభ్యుడుగా కూడా ఉన్నారు. 1994లో బిల్కెంట్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ లలో డిగ్రీ పట్టాపొందారు. యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో రీసెర్చర్‌గా పనిచేశారు. మర్మారా యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపైనా మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు.[2]

మూలాలు

మార్చు
  1. "THY Yönetim Kurulu Başkanı İlker Aycı istifa ediyor". Habertürk. 26 January 2022. Archived from the original on 26 January 2022. Retrieved 18 January 2022.
  2. "Airindia New CEO: ఎయిరిండియా కొత్త సీఈవోగా ఇల్కర్‌". EENADU. Retrieved 2022-02-14.