ఇల్లరికం
(ఇల్లరికము నుండి దారిమార్పు చెందింది)
ఇల్లరికం అనగా వివాహం అయిన పిదప పెళ్ళి కుమారుడు అత్తవారింటిలో పూర్తిగా ఉండిపోవు సాంప్రదాయం.
విశేషాలు
మార్చుహిందూ మత సంప్రదాయంలో వివాహమైన పిదప వధువును వెంటనే అత్త వారింటికి పంపుతారు. ఇది పితృ స్వామ్య వవస్థ రీతి. అలా కాకుండా వరుడే ఆత్త వారింటికి వెళ్లటమే ఇల్లరికం. ఈ విషయ మై వివాహానికి ముందే వధువు మరియూ వరుడి తల్లి తండ్రులు ఒక అంగీకారానికి వస్తారు. ఇల్లరికం అంటే కూతుర్ని అత్తవారింటికి పంపించకుండా, అల్లున్ని తన ఇంటికి తెచ్చుకోవడం. ఇదొక ఆంధ్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అన్ని చోట్లా ఉంది. ఈ సాంప్రదాయం ఈ క్రింది కారణాల వలన కొనసాగుతుంది.
కారణాలు
మార్చు- ఒకే కూతురు ఉన్నవారు అల్లుని ఇల్లరికం తెచ్చుకొంటారు.
- అధికంగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవారు
- అల్లుని వైపు ఎవరూ లేక ఒంటరిగా ఉన్నపుడు
- అల్లుని ఉద్యోగం ఉన్న ఊరిలో అత్తవారు నివసించుచున్నపుడు.
ఇల్లరికంలో కష్టాలు సుఖాలు
మార్చు- ఇల్లరికంలో అల్లుని చిన్న బుచ్చడం వలన సంసారాలు దెబ్బతినదం సాధారణంగా జరుగుతుంటుంది.
సినిమాలు
మార్చుఇల్లరికంపై పలు సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని
- ఇల్లరికం (అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా ఈ సినిమా తెరకెక్కింది.)
పాటలు
మార్చు- భలేఛాన్సులే..భలేఛాన్సులే..లలలాం లలలాం లక్కీ ఛాన్సులే...ఇల్లరికంలో ఉన్నమజా[1]