ఇస్కి (ISCII) అనేది భారతీయ భాషల లిపిలను కంప్యూటర్ లో సూచించడానికి వాడే కోడింగ్ స్కీమ్. ఇస్కిని వాడి తెలుగు, బెంగాలీ, గుజరాతీ, మరాఠి, తమిళ్, దేవనాగరి, కన్నడ, గురుముఖి, మలయాళం ఇంకా అస్సామీస్ లిపిలను సూచించవచ్చు. ఇది ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలలో వాడబడింది. ఐతే యూనికోడ్ అనే మరో కోడింగ్ స్కీమ్ ప్రపంచ వ్యాప్తంగా స్వీకరించబడడం వల్ల ప్రస్తుతం ఇస్కి వాడుకలో లేదు. యూనికోడ్ లో ప్రతి భారతీయ లిపికి ఒక ప్రత్యేక బ్లాక్ (సంకేతాల క్రమం) ఉంటుంది. యూనికోడ్ ఇంకా ఇస్కిలో ఉన్న అక్షర క్రమాలు సుమారుగా ఒకే లాగ ఉంటాయి.

పరిచయం

మార్చు

కంప్యూటర్ లో ఏ భాషలో ఉన్న అక్షరాన్నైనా ఒక కోడ్ ద్వారా సూచిస్తారు. ఈ కోడ్ అనేది సున్నా (0) ఇంకా ఒకటి  (1) అంకెలతో సూచించబడుతుంది. ఈ అంకెని  బైనరి బిట్, లేదా బిట్ అని అంటారు. ఎనిమిది (8) బిట్లు కలిస్తే ఒక బైట్ అవుతుంది. ఒక బిట్ వాడి రెండు కోడ్లు (0, 1),  రెండు బిట్లు వాడి నాలుగు కోడ్లు (00, 01, 10, 11),  అలాగే  ‘n’ బిట్లు వాడి 2n కోడ్లు ఉత్పత్తి చెయ్యచ్చు. ఈ బిట్లనుండి ఉత్పత్తి చెయ్యబడిన ప్రతి కోడ్ ని ఒక అక్షరానికి గుర్తుగా సూచించవచ్చు. కేవలం అక్షరాలే కాకుండా, వీటితో ఇతర ముద్రణ కాని (అంటే ప్రింట్ కాని) కోడ్లు కూడా ఉత్పత్తి చేయవచ్చు. కంప్యూటర్ లో వాడే ప్రతి అక్షరానికి నిర్ధిశ్టమైన ఒక ప్రత్యేక కొడ్ ఉంటుంది. ఉదాహరణకు, 10011000 కోడ్ ని 'a' కి అలాగే 11010010 కోడ్ ని 'b' కి గుర్తుగా సూచించవచ్చు. వివిధ కంప్యూటర్లలో ఒకే అక్షరాన్ని సూచించడానికి వివిధ కోడ్లు వాడితే, ఒక కంప్యూటర్ నుంచి బదిలీ చెయ్యబడిన గ్రంథము మరో కంప్యూటర్ లో చదవడానికి వీలు కాదు. ఈ సమస్యని నివారించడానికి, ఒక ప్రామాణిక ఎన్కోడింగ్ అవసరమైంది. ఆస్కి (ASCII) అనేది ప్రపంచవ్యాప్తంగా స్వీకరించబడిన ప్రామాణిక ఎన్కోడింగ్. ఇందులో ఒక అక్షరాన్ని ఒక బైట్, అంటే 8 బిట్లతో సూచిస్తారు. ఆస్కిలో 105 లాటిన్ అక్షరాలు (ఆంగ్ల అక్షరాలు) సూచింపబడ్డాయి.

ఐతే ఇందులో భారతీయ భాషల అక్షరాలు సూచింపబడలేదు. ఇస్కి అనేది భారతీయ భాషల అక్షరాలను కంప్యూటర్ లో సూచించడానికి అభివృద్ధి చేసిన ఎన్కోడింగ్. ఇస్కీలో లాటిన్ తో పాటు అస్సామీస్, బెంగాలి, ఒడియా, దెవనాగరి, గుజరాతి, గురుముఖి, మలయాళం, తమిళ్, తెలుగు, ఇంకా రొమన్ అక్షరాలను సూచించవచ్చు. ఇస్కి కూడా ఆస్కి లాగానే ప్రతి అక్షరాన్ని 8 బిట్లతో సూచిస్తుంది. 8 బిట్లతో 256 విభిన్న అక్షరాలను సూచించవచ్చు. ఇందులో మొదటి 128 కోడ్లు ఆస్కి  సూచించిన అక్షరాలనే సూచిస్తాయి, మిగిలిన 128 కోడ్లు ప్రత్యేకించి ఇస్కీకి మాత్రమే సంబంధించినవి.

వివిధ భారతీయ భాషలలో ఒకే శబ్దం కలిగిన అక్షరాలను ఇస్కి ఒకే కోడ్ ద్వారా సూచిస్తుంది. ఉదాహరణకు 0xB3 0xDB అనే కోడ్ తెలుగులో 'కి' ని, దేవనాగరిలో 'कि' ని సూచిస్తుంది. ఇందువలన భారతీయ భాషల లిప్యంతరీకరణ సులభంగా చెయ్యబడుతుంది.

ఇస్కియొక్క కోడింగ్ వ్యవస్థ

మార్చు

ఈ పట్టిక https://en.wikipedia.org/wiki/Indian_Script_Code_for_Information_Interchange దేవనాగరి అక్షరాలను ఇంకా వాటి కోడ్లను వివరిస్తుంది. ఈ పట్టికలో ప్రతి అక్షరం దాని దశాంశ, యూనికోడ్ సమానంతో చూపించబడింది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఇస్కి&oldid=3904494" నుండి వెలికితీశారు