గమనిక: ఈ వ్యాసం తొలగింపు గురించిన చర్చల కొఱకు చర్చా పేజీ చూడండి.

No mosque
ఇస్లామోఫోబియా

ఇస్లామోఫోబియా (Islamophobia) అనే పదం ఇస్లాం మతం పట్ల, ముస్లింల పట్ల కొంత మంది చూపుతున్న వివక్షతను, వ్యతిరేకతను సూచించే ఒక నూతన ఆంగ్ల పదం (neologism)గా వాడబడుతున్నది.[1] ఆంగ్లంలో ఈ పదం 1980 దశకం చివరలో మొదలయ్యినాగాని [2] 2001 సెప్టెంబరు 11న జరిగిన ఘటనల తరువాత ఈ పదం వాడకం పెరిగింది.[3] 1997లో ఇంగ్లండుకు చెందిన "రున్నీమేడ్ ట్రస్ట్" ఈ పదాన్ని ఇలా నిర్వచించారు - "ఇస్లాం, ముస్లింల పట్ల తీవ్రమైన వ్యతిరేకత, అభద్రత, భయాందోళనా భావం" (dread or hatred of Islam and therefore, to the fear and dislike of all Muslims). ఇంకా ముస్లిముల పట్ల కనబరచే సామాజిక, ఆర్థిక వివక్షత కూడా ఈ పదంతో సూచింపబడుతున్నాయని వారు పేర్కొన్నారు. పాశ్చాత్య సమాజాలలో ఇస్లాంపట్ల నెలకొని ఉన్న చిన్నచూపు, ఆ మతంతో హింస ముడివడి ఉన్నదన్న భావం కూడా ఈ పదంలో సూచింపబడుతున్నాయి. ఇది మతపరమైన భావం కంటే సామాజిక, రాజకీయ భావం అధికంగా ఉన్న పదం అని వారు వ్యాఖ్యానించారు.[4] Xenophobia, Antisemitism వంటి పదాలలాగానే Islamophobia అనే పదాన్ని కూడా ఒక వివక్షతాసూచకమైన పదంగా పరిగణిస్తారని "Stockholm International Forum on Combating Intolerance",లో ప్రొఫెసర్ యాన్న్ సోఫీ రోల్డ్ (Anne Sophie Roald) వ్రాసింది.[5]

2001 సెప్టెంబరు ఘటన తరువాత పాశ్చాత్య ధేశాలలో "ఇస్లామోఫోబియా" అనే పదం వాడకం అధికం అయ్యిందని తెలుస్తున్నది.[6][7] 2002 మే నెలలో "European Monitoring Centre on Racism and Xenophobia" (EUMC), అనే ఐరోపా సమాఖ్య విభాగం "Summary report on Islamophobia in the EU after 11 September 2001" అనే రిపోర్టును విడుదల చేసింది.[8] ఈ పదం వాడుకం పెరిగినా గాని దీని ఔచిత్యం గురించి అనేక వివాదాలున్నాయి.[9]

అసలు ఇలాంటి పదాన్ని వాడడమే అనుచితమనీ, దీనికి ఏ విధమైన తార్కికత లేదనీ (is fallacious) విమర్శకులు వాదిస్తున్నారు. వార్తలలోని కొన్ని హింసాత్మక సంఘటనల ద్వారా "ఇస్లామోఫోబుయా" అనే పదానికి కలిపించబడిన ప్రచారానికి అర్దం లేదని వారి వాదన.[10]

ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు. లెబనాన్కు చెందిన హిజ్బుల్లాహ్ తరహాలో ఆత్మ రక్షణ పోరాటం (Defensive Jihad)ను మాత్రమే కొందరు ముస్లిములు సమర్థిస్తారు. ఒసామా బిన్ లాడెన్ లాంటివాళ్ళవల్ల కూడా ఈ ఫోబియా కలిగింది.

1980కి ముందు ఫ్రెంచ్ మార్క్సిస్ట్ చరిత్రకారుడు మాక్సిమ్ రోడిన్సన్ ఇరాన్ లో అయాతొల్లాహ్ ఖొమెయినీ నాయకత్వంలో ఏర్పడిన మత ఛాందసవాద పాలనని విమర్శించడానికి ఇస్లామోఫాసిజం అనే పదజాలాన్ని ఉపయోగించాడు. 1990 తరువాతి కాలంలో "ఇస్లామో ఫోబియా" అనే పదం వాడకం కొన్ని చోట్ల జరుగుతున్నది.

మూలాలు

  1. * Sandra Fredman, Discrimination and Human Rights, Oxford University Press, ISBN 0-19-924603-3, p.121.
    • Yvonne Yazbeck Haddad, Muslims in the West: From Sojourners to Citizens, Oxford University Press, ISBN 0-19-514806-1, p.19
    • Islamophobia: A Challenge for Us All, Runnymede Trust, 1997, p. 1, cited in Quraishi, Muzammil. Muslims and Crime: A Comparative Study, Ashgate Publishing Ltd., 2005, p. 60. ISBN 0-7546-4233-X. Early in 1997, the Commission on British Muslims and Islamophobia, at that time part of the Runnymede Trust, issued a consultative document on Islamophobia under the chairmanship of Professor Gordon Conway, Vice-Chancellor of the University of Sussex. The final report, Islamophobia: A Challenge for Us All, was launched in November 1997 by Home Secretary Jack Straw
  2. Islamophobia: A Challenge for Us All, Runnymede Trust, 1997, p. 1, cited in Quraishi, Muzammil. Muslims and Crime: A Comparative Study, Ashgate Publishing Ltd., 2005, p. 60; Annan, Kofi. "Secretary-General, addressing headquarters seminar on confronting Islamophobia", United Nations press release, December 7, 2004.
    • Casciani, Dominic. "Islamophobia pervades UK - report", BBC News, June 2, 2004.
    • Rima Berns McGowan writes in Muslims in the Diaspora (University of Toronto Press, 1991, p. 268) that the term "Islamophobia" was first used in an unnamed American periodical in 1991.
  3. Runnymede 1997, p. 5, cited in Quraishi 2005, p. 60.
  4. Roald, Anne Sophie (2004). New Muslims in the European Context: The Experience of Scandinavian Converts. Brill. pp. 53.
  5. Benn, Jawad (2004) p. 111
  6. Steven Vertovec, "Islamophobia and Muslim Recognition in Britain"; in Haddad (2002) pp. 32-33
  7. See:
    • Greaves (2004) p. 133
    • Allen, Chris; Nielsen, Jorgen S.; Summary report on Islamophobia in the EU after 11 September 2001 (May 2002), EUMC.
  8. Encyclopedia of Race and Ethnic studies p. 218, Routledge 2003. Routledge. 2003. p. 218. The Runnymede Trust has been successful in that the term Islamophobia is now widely recognized and used, though many right-wing commentators either reject its existence or argue that it is justified.
  9. http://www.danielpipes.org/comments/27486

బయటి లింకులు