ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద గుర్తింపబడిన పొదుపు మార్గాలలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఇ.ఎల్.ఎస్.ఎస్.) కూడా ఒకటి. ప్రధానంగా ఇందులో పొదుపు మొత్తాన్ని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల రాబడిపై ఎటువంటి కచ్చితత్వం ఉండదు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీంలో పెట్టిన పెట్టుబడిపై గరిష్ఠంగా రూ. 1,00,000/- వరకు ఆదాయంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కలదు.[1] ఇ.ఎల్.ఎస్.ఎస్.లో పెట్టిన పెట్టుబడిపై 3సంవత్సరముల లాకిన్ పీరియడ్ ఉంది. అనగా పెట్టుబడి పెట్టినతరువాత 3 సంవత్సరముల వరకు ఉపసంహరించుకోవటం కుదరదు. టాక్స్ సేవింగ్ పథకాలన్నిటిలో అతి తక్కువ లాకిన్ పీరియడ్ కలిగిన పథకం ఇదే. పెట్టిన పెట్టుబడి ద్వారా వచ్చే డివిడెండ్ మీద ఎటువంటి పన్ను ఉండదు, పెట్టుబడి ఉపసంహరణ మొత్తానికి (మెచ్యూర్డ్ అమౌంట్) మూలధన లాభాల పన్ను (కాపిటల్ గెయిన్స్ టాక్స్) వర్తించదు.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు