ఈటి విజయలక్ష్మి

ఈటి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1989లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

ఈటి విజయలక్ష్మి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
ముందు అబ్దుల్ రెహ్మాన్ షేకు
తరువాత గ్రంధి మాధవి
నియోజకవర్గం విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 2002 ఆగష్టు 5
హైదరాబాద్‌
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం ఒక కుమార్తె, ఒక కుమారుడు
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం మార్చు

ఈటివిజయలక్ష్మి 1987లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ 1వ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1] ఆమెకు 1994లో జరిగిన ఎన్నికల్లో పరవడా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది, 1999లో ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కలేదు. ఆమె 2001లో మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది.

మరణం మార్చు

ఈటి విజయలక్ష్మి కాలేయానికి సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2002 ఆగష్టు 5న మరణించింది.[2]

మూలాలు మార్చు

  1. Result nUiversity (2022). "Visakhapatnam-i Assembly Constituency Election Result". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  2. Telugu One (6 August 2002). "మాజీ ఎమ్మెల్యేవిజయలక్ష్మి మృతి". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.