ఈటీవీ బాలభారత్
ఈటీవీ నెట్వర్క్ చిన్నారుల కోసం 'బాలభారత్' పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో, 12 ఛానళ్లను ఏప్రిల్ 27న రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈ 12 ఛానళ్లను రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రారంభించాడు. తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో బాలభారత్ ప్రసారమవుతుంది.[1][2][3][4]
Type | చిన్నారుల |
---|---|
దేశం | భారతదేశం |
కేంద్రకార్యాలయం | హైదరాబాద్ |
ప్రసారాంశాలు | |
భాష(లు) | తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్ |
చిత్రం ఆకృతి | 480i (16:9 SDTV) 1080i (HDTV) |
యాజమాన్యం | |
యజమాని | రామోజీ సంస్థ |
మాతృసంస్థ | ఈటీవీ నెట్వర్క్ |
చరిత్ర | |
ప్రారంభం | ఏప్రిల్ 27, 2021 |
స్థాపకుడు | రామోజీరావు |
లభ్యత | |
కార్యక్రమాలు
మార్చుప్రపంచవ్యాప్తంగా పిల్లల మనుసులను గెలుచుకున్న గ్లోబల్ షోలతో పాటు దేశీయ వినోదాన్ని బాలభారత్ ఛానళ్లు అందిస్తాయని సంస్థ తెలిపింది. చిన్నారులను ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన కంటెంట్‌ను స్థానిక భాషలో అందిస్తూ, కార్యక్రమాల విషయంలో ఆయా స్థానిక ప్రాంతాలు, భాష, అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ వీక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తామని తెలిపింది.పిల్లలలో జిజ్ఞాసను, ఉత్తేజాన్ని కలిగించేటువంటి అంశాలతో వాళ్ళ మనసును చూరగొనేలా బాలభారత్ కార్యక్రమాలకు రూపకూల్పన చేశామని, కేవలం వినోదాన్ని అందివ్వడమే కాకుండా చిన్నారులల్లో సంస్కారం, విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు.
యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, థ్రిల్లర్, ఫాంటసీ వంటి వివిధ విభాగాలతో బాలభారత్ లో అద్భుతమైన యానిమేషన్ సిరీస్ అభిమన్యు, రోజుకో పిల్లల సినిమా, వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొంచామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.[5][6]
మూలాలు
మార్చు- ↑ Eenadu. "పిల్లల కోసం రంగుల హరివిల్లు". www.eenadu.net. Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
- ↑ Adgully.com (27 April 2021). "ETV Network all set to venture into kids genre with ETV Bal Bharat". Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
- ↑ AnimationXpress (22 April 2021). "Exclusive: ETV gears up to launch its kids' channel 'Bal Bharat' in 12 Indian languages on 27 April". Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
- ↑ APHerald [Andhra Pradesh Herald] (27 April 2021). "Shocking: Ramoji Rao to launch 12 channels in one go" (in ఇంగ్లీష్). Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
- ↑ "Ramoji Rao gearing up to launch ETV Bharat in 13 languages". Business Today. 26 October 2017. Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
- ↑ ETV Bharat News (27 April 2021). "ఈటీవీ బాల భారత్ ఛానల్ ప్రారంభోత్సవ దృశ్యమాలిక" (in ఇంగ్లీష్). Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.