రామోజీరావు
చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
చెరుకూరి రామోజీరావు | |
---|---|
![]() ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడు అధిపతి రామోజీరావు | |
జననం | చెరుకూరి రామోజీరావు 1936 నవంబరు 16
సంవత్సరాలు)గుడివాడ,కృష్ణా జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | రామోజీ |
వృత్తి | పత్రికా సంపాదకుడు ప్రచురణకర్త చిత్ర నిర్మాత వ్యాపారవేత్త ఈటీవీ అధినేత |
ప్రసిద్ధి | పత్రికాధిపతి |
మతం | హిందూ |
భార్య / భర్త | రమాదేవి[1] |
పిల్లలు | కిరణ్, సుమన్ |
జీవితంసవరించు
రామోజీరావు, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16 న ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. ఇతని ముత్తాత పామర్రు మండలం పెరిశేపల్లి గ్రామంనుండి వలస వెళ్ళాడు. రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూములు ముఖ్యమైనవి.[2][3]
వ్యాపారాలలో ఒడిదుడుకులుసవరించు
రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బిఐ నిబంధనలు ఉల్లంఘించిందని అనే ఆరోపణలు ఎదుర్కొంది. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని బయటపడింది.[4]
వ్యాపారాలుసవరించు
మీడియాసవరించు
- ఈనాడు, న్యూస్ టైమ్ (కొంతకాలం)
- వసుంధర పబ్లికేషన్స్: సితార, చతుర, విపుల, అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం
- ఈ టీవి, ఈటివి 2, ఈ టివి కన్నడ, మరాఠి, ఉర్దు, బెంగాలి, ఒరియా, గుజరాతీ, బీహార్
- రామోజీ ఫిల్మ్ సిటీ
- ఉషా కిరణ్ మూవీస్
ఆర్థిక సేవలుసవరించు
ఇతరాలుసవరించు
- కళాంజలి - సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి (విజయవాడ, హైదరాబాద్)
- బ్రిసా - ఆధునిక వస్త్రాలు
- ప్రియా ఫుడ్స్ - పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
- డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం, హైదరాబాద్)
- కొలోరమ ప్రింటర్స్
- ప్రియా పచ్చళ్లు
నిర్మించిన సినిమాలుసవరించు
- శ్రీవారికి ప్రేమలేఖ (1984)
- మయూరి (1985)
- మౌన పోరాటం (1989)
- ప్రతిఘటన (1987)
- పీపుల్స్ ఎన్కౌంటర్ (1991)
- అశ్వని (1991)
- చిత్రం (2000)
- మెకానిక్ మామయ్య
- ఇష్టం (2001)
- నువ్వే కావాలి (2000)
- ఆనందం (2001)
- ఆకాశ వీధిలో (2001)
- మూడుముక్కలాట
- నిన్ను చూడాలని (2001)
- తుఝె మేరీ కసమ్
- వీధి (2005)
- నచ్చావులే (2008)
- నిన్ను కలిసాక (2009)
- సవారి (కన్నద గమ్యమ్) (2009)
పురస్కారాలు/గౌరవాలుసవరించు
రామోజీరావు పనికి, సేవలకు పలు పురస్కారాలు అందుకున్నాడు.
- ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
- శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
- శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
- యుధవీర్ అవార్దు
- కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదురి (రాజస్తాన్) అవార్డు
- బి. డి. గోయెంకా అవార్డు
- పద్మవిభూషణ్ (2016 సాహిత్యం, విద్య విభాగాలలో)
బయటి లింకులుసవరించు
మూలాలుసవరించు
- ↑ వెబ్ సైట్ లో జీవిత చరిత్ర జూన్ 18, 2008న సేకరించబడినది.
- ↑ "తెలుగుకి వెలుగు రామోజీరావు". తెలుగువెలుగు. 2016-03-01. Retrieved 2020-07-05.
- ↑ Praveen Donthi (2014-12-01). "Chairman Rao, How Ramoji Rao of Eenadu wrested control of power and politics in Andhra Pradesh". Archived from the original on 2014-12-31.
- ↑ "Dangerous intolerance". The Hindu. 2006-12-23.