ఈమని విజయ లక్ష్మి

భారతీయ మహిళా ఉద్యమకారులు(1957-2009)

ఈమని విజయలక్ష్మి (14 మే 1957 - 15 జనవరి 2009) భారతీయ అమెరికన్ సామాజిక కార్యకర్త. అమెరికాలో గృహహింసకు వ్యతిరేకంగా పోరాడింది. ఈమని విజయలక్ష్మి కి మరణానంతరం 2011లో ప్రెసిడెన్షియల్ సిటిజన్స్ మెడల్ అమెరికా రెండవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది [1] [2]

ఈమని విజయలక్ష్మి
జననం1957 మే 14
కర్నూలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
మరణం2009 జనవరి 15
న్యూయార్క్ అమెరికా
వృత్తిసామాజిక కార్యకర్త

బాల్యం మార్చు

ఈమని విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఇందురాణి జి.వెంకటరమణారెడ్డి దంపతులకు జన్మించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 1986లో అమెరికా వెళ్లింది. విజయలక్ష్మి అమెరికాలో ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకుంది. [1]

సామాజిక కార్యకర్తగా మార్చు

ఆమె అమెరికాలో భారతీయుల కోసం పలు సంస్థలను నెలకొల్పింది. అమెరికాలో భారతీయ-అమెరికన్‌లు మధ్య సఖ్యత నెలకొల్పడానికి ఈమె కృషి చేసింది . అమెరికాలో గృహహింస కేసులు ఎక్కువ కావడం విజయలక్ష్మి గమనించింది. దీంతో గృహహింస ను ఆపాలని అమెరికాలో ఉద్యమం చేసింది. 2002 - 2006 మధ్య జరిగిన ఈమె ఉద్యమం అమెరికా ను కదిలించింది. ఈ ఉద్యమంలో పలువురు అమెరికన్లు కూడా పాల్గొన్నారు. ఉద్యమం చేపట్టినందుకుగాను ఈమని విజయలక్ష్మి అమెరికా రెండవ అత్యున్నత పురస్కారం అందుకుంది.

మరణం మార్చు

ఈమని విజయలక్ష్మి 2009లో 51 సంవత్సరాల వయస్సులో న్యూయార్క్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. [1] 2011 అక్టోబరు 20 న, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెకు మరణానంతరం ప్రెసిడెన్షియల్ సిటిజన్స్ మెడల్‌ను ప్రధానం చేశారు. అమెరికా అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి భారతీయురాలుగా రికార్డ్ సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా మాట్లాడుతూ ఈమని విజయలక్ష్మి "గృహ వేధింపుల బాధితులకు రోల్ మోడల్" అని ప్రశంసించాడు. ఈ అవార్డును వైట్‌హౌస్‌లోని ఈస్ట్‌రూమ్‌లో ఈమని విజయలక్ష్మి ఇద్దరు కూతుళ్లు సుజాత, నిర్మల అందుకున్నారు. [1] [3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 Staff Reporter (2011-10-21). "Obama honours Indian-American activist Vijaya Emani". The Hindu. Retrieved 18 February 2012.
  2. "India-born achievers shine in White House honours list". The Times of India. 22 October 2011. Archived from the original on 8 July 2012.
  3. "Vijaya Emani Gets U.S. Presidential Citizens Medal". SiliconIndia. Retrieved 18 February 2012.