ఈరంకి వెంకటరమణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిత్రలేఖనోపధ్యాయుడు. ఈయన ప్రస్తుతం పదవీవిరమణ చేశారు. శ్రీకాకుళం పట్టణంలో గుడివీధి నివాసము . భార్య శేషమ్మ . ఈయన చిత్రలేఖనంలో ఎన్నో అద్భుతాలు సృస్టించారు .

చిత్ర రచనా విశేషాలు

మార్చు

సమాజాన్ని ఆలోచింపజేసే కళల్లో చిత్రలేఖనం ఒకటి, ఇది దేవతా విద్యలైన 64 కళలలో ఒకటి .. ఆ విద్యలో రాణించడం ఓ విలక్షణ, విశిస్టత . అంకితభావముతో పనిచేస్తే అద్భుతాలు సృస్టించవచ్చు . వెంకటరమణ 2002లో పదవీ విరమణ పొదిననాటి నుండి అదే పనిగా ఎన్నో చిత్రాలు వేస్తున్నారు . చిత్రలేఖనానికి, శిల్పాల తయారీకి తన ఇంట్లో ప్రత్యేక గదులు ఏర్పరిచేరు . ఆసక్తి గల విద్యార్థులకు చిత్రలేఖనంలో మెలకువలు నేర్పిస్తూ ఉన్నారు . ఉత్తం ఉపాధ్యాయునిగా, అక్షరక్రాంతి, జన్మభూమి ప్రోత్సాహకునిగా, చిత్రలేఖన శిక్షకునిగా ఆయన సేవలు శ్లాఘనీయము, శ్రీకాకుళం జిల్లాలలో నేటికి చిత్ర, కళా, నాటక రంగానికి అలుపెరగని యోధునిగా అవిశ్రాంతముగా సేవలు అందిస్తూ అతి సామాన్య జీవితం గడుపుతున్నారు .

అవార్డులు

మార్చు
  • రాస్ట్ర ఉత్తమ చిత్రలేఖన ఉపాధ్యాయునిగా 2002 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రవీంద్రభారతిలో అవార్డునందుకున్నారు .
  • 2001 - 2002 ఉత్తమ ఉపాధ్యాయునిగాజిల్లా అవార్డు ఎంపికై కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి చేతులు మీధుగా సన్మానము, ప్రశంసాపత్రము పొందినారు .
  • శ్రీకాకుళం జిల్లా సాక్షరతా సమితి ' అక్షర క్రాంతి ' సంపాదకీయునిగా ఉత్తం సేవలందించిన సందర్భముగా కలెక్టర్ పునీఠా ద్వారా సత్కారము .
  • ఉత్తం కళాకారునిగా సాహితీ మిత్ర మండలి నుంచి 2003 లో పురస్కారం,
  • ఘంటసాల చిత్రాన్ని పోస్టల్ స్టాంపుగా డిజైన్‌ రూపొందించినందుకు 2003 లో రాస్ట్ర తపలాశాఖ వారి నుంచి ప్రశంసాప్రత్రము, నగదు బహుమతి పొందినారు .

మూలము

మార్చు