2003
2003 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 2000 2001 2002 - 2003 - 2004 2005 2006 |
దశాబ్దాలు: | 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- 2003: అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
- ఫిబ్రవరి 20: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది.
- డిసెంబరు 9: తెలుగు వికీపీడియా ఆవిర్భవించింది.
జననాలు
మార్చుమరణాలు
మార్చు- జనవరి 18: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)
- ఫిబ్రవరి 1: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962)
- ఫిబ్రవరి 24: ముకురాల రామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1929)
- మార్చి 3: కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1922)
- ఆగష్టు 3: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (జ.1921)
- ఏప్రిల్ 29: వావిలాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు.
- జూలై 27: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (జ.1917)
- సెప్టెంబర్ 9: గులాబ్రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు. (జ.1927)
- అక్టోబరు 25: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు. (జ.2003)
- అక్టోబరు 31: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914)
- నవంబర్ 25: ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (జ.1928)