ఈశ్వర సేవకులు కొత్త సత్యనారాయణ చౌదరి రచించిన గ్రంథం. దీని మూలగ్రంథాన్ని మహదేవ్ దేశాయి రచించారు. దీనిని భాషాపోషక మండలి 1936 సంవత్సరంలో ప్రచురించింది.

గ్రంథ సారాంశం

మార్చు

ఖుదాయీ బిద్మత్‌గార్ అంటే ఈశ్వర సేవకులని అర్థం. ఈ పదాన్ని సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరులను ఉద్దేశించి భారత జాతీయవాదులు ఉపయోగించేవారు. ఈ గ్రంథంలో ఖాన్ సోదరులుగా పేరొందిన కాంగ్రెస్ వాదులు, జాతీయోద్యమ కారులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, డాక్టర్ ఖాన్ సాహెబ్ జీవిత చరిత్రలు రచించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బ్రిటీష్ ఇండియాలోని పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సరిహద్దు రాష్ట్రానికి చెందినవారు. ఆ ప్రాంతం హింసాయుతమైన పోరాటాలకు, అలజడులకు పేరుపొందింది కాగా గఫార్ ఖాన్ అటువంటి రాష్ట్రంలో గాంధీజీ బోధించిన అహింసా సిద్ధాంతాన్ని వ్యాపింపజేయడం జాతీయవాదుల్లోనే కాక బ్రిటీష్ అధికారులు, సరిహద్దు రాష్ట్ర నాయకుల్లో కూడా ఆశ్చర్యం కలిగించింది. గఫార్ ఖాన్ భారతదేశం మతప్రాతిపదికన విడిపోవడం, పాకిస్తాన్ ఏర్పడడం అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనీయరాదని ప్రయత్నించారు. మొదటి నుంచీ దేశ సమైక్యత గురించి పట్టుదలతో ఉంటున్న కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరే జారిపోవడం, పాకిస్తాన్ ఏర్పాటుకావడం వంటి పరిణామాలతో గఫార్ ఖాన్, ఖాన్ సాహేబ్‌లు హతాశులయ్యారు. ఎన్నో ఏళ్ళుగా భుజం భుజం కలిపి స్వాతంత్ర్యం కోసం కృషిచేసిన భారత దేశానికి చెందిన జాతీయోద్యమ సహచరుల గురించి ఖాన్ బాధతో మీరు మమ్మల్ని తోడేళ్ళ ముందుకు విసిరేసి వెళ్ళిపోయారు అన్నారు. ఏదేమైనా అనంతర కాలంలో ఏర్పరిచిన అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్న విదేశీ పౌరునిగా (అప్పటికి పాకిస్తాన్ పౌరసత్వం ఉండేది) ఆయన ప్రసిద్ధిచెందారు. ఈ మహనీయుల జీవితాలను గాంధీజీ సూచన మేరకు దేశాయ్ రచించారు.

విషయసూచిక

మార్చు
  1. సరిహద్దు రాష్ట్రము
  2. జననము - జననీ జనకులు
  3. తొలిరోజులు
  4. మతధోరణి
  5. ఖుదాయీఖిద్‌మత్ దారులు
  6. దోషారోపణము - సత్యము
  7. ఆంగ్లేయులు ఎరుంగవలసినది
  8. ఇంటెల్లపాది జైలులో
  9. అన్నదమ్ముల విశిష్టగుణములు
  10. మరల అసలు ఇంటిలో

మూలాలు

మార్చు