ఈ కథలో పాత్రలు కల్పితం
ఈ కథలో పాత్రలు కల్పితం 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజేష్ నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి అభిరామ్ ఎమ్ దర్శకుడు. ఈ సినిమాలో కొణిదెల పవన్ తేజ్, మేఘన, పృథ్వీ, రఘుబాబు, నవీన్, అభయ్ సింగ్, నోయెల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 మార్చి 26న విడుదలైంది.[1] ఈ సినిమా ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయింది.
ఈ కథలో పాత్రలు కల్పితం | |
---|---|
దర్శకత్వం | అభిరామ్ ఎమ్ |
రచన | అభిరామ్ ఎమ్ |
కథ | అభిరామ్ ఎమ్ |
నిర్మాత | రాజేష్ నాయుడు |
తారాగణం | పవన్‌తేజ్, మేఘన, పృథ్వీ, రఘుబాబు,అభయ్ బేతిగంటి, అభయ్ సింగ్, నోయెల్ |
ఛాయాగ్రహణం | సునీల్ కుమార్.ఎన్ |
కూర్పు | శ్రీకాంత్ పట్నాయక్. ఆర్- తిరు |
సంగీతం | కార్తీక్ కొడకండ్ల |
నిర్మాణ సంస్థ | ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీs | 26 మార్చి, 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకృష్ణ (పవన్ తేజ్) హీరోగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అతనికి ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శృతి (మేఘన కుమార్) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. వీరి ప్రేమాయణం సాఫీగా సాగుతున్న క్రమంలో కృష్ణకు ఓ సినిమాలో హీరోగా అవకాశం వస్తుంది. ఆ మూవీని ఓ పాపులర్ మోడల్ యదార్థ కథ నేపథ్యంలో రూపొందిస్తుంటారు. ఇంతకీ ఆ మెడల్ ఎవరు? ఆమె వెనకున్న కథేంటీ?. `పెళ్లి` ఫేమ్ పృథ్వీ ఏసీపీ పాత్రలో ఆమె కోసం ఎందుకు అన్వేషిస్తున్నారు?.. ఆ హత్యకు ఈ షూటింగ్ కి మధ్య సంబంధమేంటి? అనేది సినిమా కథ.
నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు
మార్చు- పవన్ తేజ్ - కృష్ణ
- మేఘన కుమార్ - శృతి
- రఘుబాబు - రత్నం
- అభయ్ బేతిగంటి
సినిమాలోని పాటలు
మార్చుఈ చిత్రానికి సంగీతం కార్తీక్ కొడకండ్ల అందించాడు. చంద్రబోస్ పాటలు రాశాడు.
సం. | పాట | పాట రచయిత | గాయని \ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కన్నయ్యే కళ్ళు" | చంద్రబోస్ | కార్తీక్ కొడకండ్ల, నూతన మోహన్ | 02:43 |
2. | "ఏమిటో ఏమిటో" | చంద్రబోస్ | దీపు జాను, నూతన మోహన్ | 03:33 |
3. | "ప్రయం కోరేది" | చంద్రబోస్ | శృతి నందూరి, కార్తీక్ కొడకండ్ల | 03:53 |
4. | "ఈ కథలో పాత్రలు కల్పితం" | చంద్రబోస్ | వినాయక్ | 02:14 |
సాంకేతిక నిపుణులు
మార్చు- సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్.ఎన్
- సంగీతం: కార్తీక్ కొడకండ్ల
- ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్. ఆర్- తిరు
- ఫైట్స్: షావోలిన్ మల్లేష్
- ఆర్ట్: నరేష్ బాబు తిమ్మిరి
- డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్ సయ్యద్
- కాస్ట్యూమ్ డిజైనర్: సియ డిజైనర్స్
- విఎఫ్ఎక్స్: విజువల్స్ ఫ్యాక్టరీ (తిరు)
- పబ్లిసిటీ డిజైనర్: ఎజె ఆర్ట్స్, (అజయ్ కుమార్)
- నిర్మాత: రాజేష్ నాయుడు[2]
- కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్
మూలాలు
మార్చు- ↑ Sakshi (28 March 2021). "'ఈ కథలో పాత్రలు కల్పితం' మూవీ రివ్యూ". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
- ↑ Andhrajyothi. "'ఈ కథలో పాత్రలు కల్పితం' హిట్.. తేల్చేసిన నిర్మాత". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.