చంద్రబోస్ (రచయిత)

చంద్రబోస్ తెలుగు సినిమా పాటల రచయిత. తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.[1] ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా ఈయన చిన్నప్పటి నుండి పాటల మీద మక్కువ పెంచుకొని సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈయన పాటల రచయితనే కాక నేపథ్యగాయకుడు కూడా.

చంద్రబోస్
Chandrabose at KL University in February 2015.JPG
చంద్రబోస్
జననం
చంద్రబోస్

వృత్తిసినీ గీత రచయిత
నేపథ్యగాయకుడు
జీవిత భాగస్వామిసుచిత్రా చంద్రబోస్‌
తల్లిదండ్రులు
 • నర్సయ్య (తండ్రి)
 • మదనమ్మ (తల్లి)

బాల్యంసవరించు

చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే కుగ్రామం. తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు. తల్లి మదనమ్మ గృహిణి. వారికి మొత్తం నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ ఆఖరి వాడు.[2] తల్లి మదనమ్మ 2019 మే 20 న మరణించింది.[3]

వారి గ్రామంలో అప్పుడప్పుడూ ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు వేసేవారు. తల్లితో కలిసి వాటిని చూసి చంద్రబోస్ పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంటి పక్కనే ఉన్న గుడిలో జరిగే భజనల్లో పాటలు పాడేవాడు. తరువాత ఆ ఊర్లోకి సినిమా హాలు రావడంతో సినిమాలు వీక్షించడం అలవాటైంది.

విద్యసవరించు

చంద్రబోస్ ముందు డిప్లోమా, ఆ తరువాత ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తయ్యే సమయంలో పాటలపై ఆసక్తి కలిగింది. ఒక స్నేహితుని సాయంతో సినీ ప్రముఖుల దగ్గరికి వెళ్ళేవాడు.

సినీ ప్రస్థానంసవరించు

దర్శకుడు ముప్పలనేని శివ చంద్రబోస్ పాటలను నిర్మాత రామానాయుడుకి చూపించడంతో తాజ్‌మహల్ సినిమాలో మంచుకొండల్లోన చంద్రమా అనే పాట రాయడానికి అవకాశం వచ్చింది. ఆ పాట బాగా ప్రజాదరణ పొందింది. అదే సమయానికి ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. ఉద్యోగమా, సినీరంగంలో రెండో దాన్నే ఎంచుకుని తల్లిదండ్రులను కూడా అందుకు ఒప్పించాడు. ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ సినిమా సంగీత పరంగా కూడా విజయం సాధించడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 800 సినిమాల్లో 3300 పాటల్లో పాటలు రాశాడు.

పాటల రకాలుసవరించు

 • స్ఫూర్తిదాయక పాటలు: బడ్జెట్ పద్మనాభం చిత్రంలోని 'ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన' అనే పాట మొదటి స్ఫూర్తిదాయక పాట. ఓమారియా ఓమారియా (చూడాలనివుంది), కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి (ఠాగూర్), నవ్వేవాళ్లు నవ్వని ఏడ్చేవాళ్లు ఏడ్వనీ (చెన్నకేశవరెడ్డి), లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ (డాడీ), చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని (నేనున్నాను), ఇంతే ఇంతింతే, లేలేలే ఇవ్వాళే లే (గుడుంబా శంకర్), అభిమాని లేనిదే హీరోలు లేరులే,
 • స్నేహం గురించిన పాటలు: ట్రెండు మారినా ఫ్రెండ్ మారడు (ఉన్నది ఒకటే జిందగీ), ఎగిరే ఎగిరే (కొచెం ఇష్టం కొచెం కష్టం)
 • తల్లిదండ్రులపై పాటలు: పెదవే పలికిన మాటల్లోనే (నాని), లాలి లాలి జోలాలి (ఢమరుకం), కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా (మనం), చీరలోని గోప్పదనం (పల్లకిలో పెళ్ళికూతురు)
 • అన్నాచెల్లెలి పాటలు: మరుమల్లి జాబిల్లి (లక్ష్మీనరసింహా), అన్నయ్య అన్నాంటే (అన్నవరం)
 • ప్రేమపాటలు: నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి (ఆది), కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని (నువ్వొస్తావని), నువు చూడూ చూడకపో (ఒకటో నెంబర్ కుర్రాడు), నువ్వే నా శ్వాస (ఒకరికొకరు), పోయే పోయే లవ్వే పోయే (ఆర్య2), పంచదార బొమ్మాబొమ్మా (మగధీర)
 • కళాశాల పాటలు: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి (స్టూడెంట్ నెంబర్ వన్)
 • దేవుని పాటలు: జైజై గణేషా (జై చిరంజీవా)
 • తెలుగు భాషపై పాటలు: తెలుగంటే గోంగూర (సుబ్రమణ్యం ఫర్ సేల్),
 • ఇతర పాటలు: బ్రాండ్ల పేరుతో 'చీరలోని గొప్పదనం' (పల్లకిలో పెళ్ళికూతురు), షాప్ బోర్డు పేర్లతో 'గంగా ఏసి వాటర్' (సై), టెలిఫోన్ డైరెక్టరీతో 'ఎక్కడున్నావమ్మా' (ఒకరికొకరు), సెల్ ఫోన్ నెంబర్లతో 'నీది 98490 నాది 98480' (ఒకటో నెంబర్ కుర్రాడు), డబ్బుల గురించి 'రెలుబండిని నడిపేది' (నువ్వొస్తావని), నవ్వు గురించి 'ఒకచిన్ని నవ్వేనవ్వి యుద్ధాలేన్నో ఆపొచ్చు' (అశోక్), అమ్మాయి పేర్లతో 'నాపేరు చెప్పుకోండి' (పల్లకిలో పెళ్ళికూతురు), దేవున్నే పిలిచావంటే రాడురాడు ఎంతో బిజీ (లక్ష్మీనరసింహా), జ్ఞాపకాలపై 'గుర్తుకొస్తున్నాయి' (నా ఆటోగ్రాఫ్), భార్యపై 'సమయానికి తగు సేవలు' (సీతయ్య)

వివాహంసవరించు

పెళ్ళిపీటలు సినిమాకు పనిచేస్తుండగా నృత్య దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్‌ పరిచయమైంది. అది ప్రేమగా మారి ఇద్దరూ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.

పురస్కారాలుసవరించు

నంది పురస్కారంసవరించు

 • ఉత్తమ గీత రచయిత - నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి - ఆది

ఇతర వివరాలుసవరించు

 • నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కు సాంస్కృతిక రాయబారిగా (6సంవత్సరాలుగా) ఉన్నారు.

పాటల సంకలనంసవరించు

పురస్కారాలుసవరించు

బయటి లింకులుసవరించు

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. E, Madhukar. "Chandrabose: Reading literature, friends encouragement my forte". thehansindia.com. The Hans India. Retrieved 16 November 2017.
 2. ఈనాడు డిసెంబరు 8, ఆదివారం వసుంధర
 3. "గేయ రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం". ఈనాడు. 20 May 2019. Archived from the original on 20 May 2019.
 4. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.