ఈ డీ ఎస్
టెక్సాస్ లోని ప్లేనో కేంద్రంగా పని చేసే ఎలక్ట్రానిక్ డాటా సిస్టంస్ ఒక బహుళా జాతీయ ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఎక్విప్ మెంట్, సేవల సంస్థ.
స్థాపన | June 27, 1962 ఎలక్ట్రానిక్ డాటా సిస్టంస్ |
---|---|
స్థాపకుడు | రోస్ పేరోట్ |
ప్రధాన కార్యాలయం | ప్లేనో , టెక్సాస్ , |
ఉత్పత్తులు | ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఎక్విప్ మెంట్ |
రెవెన్యూ | US$22.1 billion (2007) |
ఉద్యోగుల సంఖ్య | 136,000 |
మాతృ సంస్థ | జెనరల్ మోటార్స్ 1984–1996 హెల్వెట్-పాకర్డ్ 2008–2015 హెల్వెట్-పాకర్డ్ ఎంటర్ప్రైస్ 2015-2017 డి ఎక్స్ సి టెక్నాలజీస్ 2017–present |
చరిత్ర
మార్చు1962 లో హెచ్. రాస్ పెరాట్ చే స్థాపించబడ్డ ఈ డీ ఎస్ స్వల్పకాలిక కాంట్రాక్టులు రాజ్యమేలుతున్న సమయంలో పెద్ద సంస్థలకు దీర్ఘకాలిక కాంట్రాక్టు పద్ధతి ద్వారా ఆధునిక ఎలెక్ట్రానిక్ డాటా ప్రాసెసింగ్ మేనేజ్ మెంట్ కొరకు మానవ వనరులను, కంప్యూటర్ హార్డ్వేర్ ను సమకూర్చే ఉద్దేశంతో నెలకొల్పబడింది.[1]
2008 నాటికి ఈ డీ ఏస్ లో 1,39,000 ఉద్యోగులతో 64 దేశాలలో ముఖ్యంగా అమెరికా, భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్ లలో తన ఉనికి కలిగి ఉండేది.
సేవలు
మార్చుఈడిఎస్ తన సేవలను మూడు సర్వీస్ పోర్ట్ ఫోలియోలుగా విభజించింది; ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సేవల్లో నెట్ వర్క్ లు, మెయిన్ ఫ్రేమ్ లు, "మిడ్ రేంజ్" వెబ్ సర్వర్లు, డెస్క్ టాప్ లు అలాగే ల్యాప్ టాప్ లు , ప్రింటర్లు వంటి క్లయింట్ కంప్యూటర్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల భాగం లేదా అన్నింటి ఆపరేషన్ నిర్వహించడం చేర్చబడుతుంది. అప్లికేషన్ ల సేవల్లో క్లయింట్ ల కొరకు అప్లికేషన్ ల సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేయడం, ఇంటిగ్రేట్ చేయడం లేదా మెయింటైన్ చేయడం జరుగుతుంది. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లో పేరోల్, కాల్ సెంటర్ లు, ఇన్స్యూరెన్స్ క్లెయింల ప్రాసెసింగ్ మొదలైన క్లయింట్ కొరకు బిజినెస్ ఫంక్షన్ నిర్వహించడం ఉంటుంది.
మూలాలు
మార్చు- ↑ Making IT Work: A History of the Computer Services Industry. Cambridge, Massachusetts: The MIT Press. 2017. ISBN 978-0-262-03672-6.