అమెరికా సంయుక్త రాష్ట్రాలు
అమెరికా సంయుక్త రాష్ట్రాలు (English: United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA యు.ఎస్.ఏ), సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలతో భూసరిహద్దు, అలాస్కా వద్ద రష్యాతో సముద్ర సరిహద్దు ఉంది. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డి.సి.. ఉత్తర దిశలో కెనడా, తూర్పు దిశలో అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ దిశలో మెక్సికో, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున అలాస్కా రాష్ట్రం ఉంది దీనికి పడమరలో బేరింగ్ జలసంధి ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ ద్వీపసమాహారం పసిఫిక్ సముద్రం మధ్యలో ఉంది. అమెరికా ఆధీనంలో పసిఫిక్, కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు (9.83 మిలియన్ చ.కి.మీ) వైశాల్యం, 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం, జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకోవడమే కాక, అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము (చైనా వైశాల్యాన్ని లెక్కపెట్టడంలో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచములో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.
United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం In God We Trust (official) E Pluribus Unum (From Many, One; Latin, traditional) |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని | వాషింగ్టన్ డి.సి 38°53′N 77°02′W / 38.883°N 77.033°W | |||||
అతి పెద్ద నగరం | న్యూయార్క్ | |||||
జాతీయ భాష | కేంద్ర స్థాయిలో అధికారిక భాష ఏదీ లేదు (28 రాష్ట్రాలలో ఆంగ్లం అధికారిక భాష) | |||||
ప్రజానామము | అమెరికన్ | |||||
ప్రభుత్వం | కేంద్రీకృత అధ్యక్ష తరహా రాజ్యాంగబద్ధ సమాఖ్య | |||||
- | అమెరికా అధ్యక్షుడు | జో బైడెన్ (డెమోక్రాట్) | ||||
- | అమెరికా ఉపాధ్యక్షుడు | కమల హారిస్ (డెమోక్రాట్) | ||||
- | స్పీకరు | మిట్చ్ మెక్కొనెల్ (రిపబ్లికన్) | ||||
- | ప్రధాన న్యాయమూర్తి | జాన్ రాబర్ట్స్ | ||||
స్వాతంత్ర్యం (గ్రేట్ బ్రిటన్ నుండి) | ||||||
- | ప్రకటన | 1776 జులై 4 | ||||
- | గుర్తింపు | 1783 సెప్టెంబరు 3 | ||||
- | జలాలు (%) | 6.76 | ||||
జనాభా | ||||||
- | 2000 జన గణన | 281,421,906[1] | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $14.046 trillion[2] (1st) | ||||
- | తలసరి | $45,968 (4th) | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $14.306 trillion[2] (1st) | ||||
- | తలసరి | $46,820 (12th) | ||||
జినీ? (2006) | 47.0[3] | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) | 0.951 (high[4]) (12th) | |||||
కరెన్సీ | United States dollar ($) (USD "$" ) |
|||||
కాలాంశం | (UTC-5 to -10) | |||||
- | వేసవి (DST) | (UTC-4 to -10) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .us .gov .mil .edu | |||||
కాలింగ్ కోడ్ | +1 |
- "అమెరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి.
ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పాలియో ఇండియన్లు, ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. అప్పటి నుండి స్థానిక అమెరికన్ సంతతి జనాభా క్షీణిస్తూ వచ్చింది. యురేపియన్ల వలసలు కొనసాగుతున్న సమయంలో యురేపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రబలిన అంటు వ్యాధులు ఈ క్షీణతకు ఒక కారణం. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. 1776 జూలై 4 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం, సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్ర్యోద్యమం పేరిట బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వాతంత్ర్య యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1787 సెప్టెంబరు 17 న రూపు దిద్దుకుంది. తరువాతి సంవత్సరం బలమైన కేంద్రప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తరువత 1791 న ప్రాథమిక పౌర హక్కులు, స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది.
19వ శతాబ్దంలో ఉత్తర అమెరికా విస్తరణ చేపడుతూ బలమైన కార్యచరణ మొదలు పెట్టింది. ఫ్రాన్స్ నుండి లూసియానా ప్రాంతం, స్పెయిన్ నుండి ఫ్లోరిడా ప్రాంతం కోరుతూ స్థానిక జాతులను వేరు ప్రదేశాలకు తరలించింది. యుద్ధం ద్వారా సగం మెక్సికోను స్వాధీనం చేసుకుని 1845లో రిపబ్లిక్ ఆఫ్ టెక్సాసును తనతో ఐక్యం చేసుకుంది. 1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసింది. ఆరంభకాల సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణప్రాంతపు వ్యవసాయ బానిసలు- ఉత్తర ప్రాంతపు ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫ్రీ సాయిల్ పారిశ్రామికుల ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదాలు అమెరికన్ ప్రజోద్యమానికి దారితీసాయి. ఉత్త్ర ప్రాంతీయుల విజయంతో యూనియన్ తిరిగి స్థాపించబడి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యంగ సవరణలో 13వ దిద్దుబాటుకు దారితీసాయి. పీఠభూమి ఇండియన్ల యుద్ధం మిగిలిన స్థానిక జాతులను తిరిగి పరిమిత ప్రదేశాలకు తీసుకు వచ్చింది. తరువాత కాంగ్రషన్ నిర్ణయంతో హవాయి రిపబ్లిక్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఐక్యం అయింది. స్పానిష్ అమెరికన్ యుద్ధానంతరం జరిగిన ఒప్పందం ప్యూర్టో రికో, గ్యూం ఒదులు కోవడంతీఓ ముగిసింది. 19వ శతాబ్ధపు చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ఆదాయం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది.
స్పానిష్ అమెరికన్ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం దేశ ఆర్థిక శక్తి, అంతర్జాతీయంగా సైనిక శక్తిని వెలుగులోకి తీసుకు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవతరించాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుశక్తిని కలిగి ఉన్న మొదటి దేశంగా గుర్తింపును పొందింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించడానికి సోవియట్ యూనియన్తో జరిగిన అస్పష్టమైన యుద్ధంలో చివరకు సోవియట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఏకైక శక్తివంతమైన దేశంగా అంగీకరిస్తూ పోటీ నుండి వైదొలగింది. సుమారు $15.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల జిడిపి అభివృద్ధితోతో యు.ఎస్ ఆర్థిక సంపద ప్రపంచంలో బృహత్తర జాతీయ సంపదగా గుర్తింపు పొందింది. దేశం అంతర్జాతీయ జిడిపి, కొనుగోలు శక్తిలో 19% కలిగి ఉంది. తలసరి ఆదాయంలో అంతర్జాతీయంగా 6% స్థానంలో ఉంది. దేశాదాయంలో 41% తన అంతర్జాతీయ సైనిక ఖర్చు పెడుతుంది. అమెరికన్ సైనిక శక్తి ఆర్థికపరంగా, రాజకీయంగాపరంగా, సంస్కృతిక్ పరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉంది.
19వ, 20వ శతాబ్దములలో అమెరికా యొక్క సైనిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ ప్రాభవము క్రమక్రమముగా పెరిగింది. ప్రచ్ఛన్న యుద్ధం చివర సోవియట్ సమాఖ్య పతనముతో అమెరికా నేటి ప్రపంచములో ఏకైక అగ్రరాజ్యముగా అవతరించింది. నేడు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
నామకరణంసవరించు
క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది. తరువాత జర్మన్ కార్టోగ్రాఫర్ మార్ట్ వాల్డ్‍సీ ముల్లర్ తన భౌగోళిక చిత్ర పటంలో దీనికి అమెరికా అనే పేరును ప్రతిపాదిస్తూ ప్రపంచపటాన్ని అందించాడు. 1776 జూలై 4న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే పేరు 1777 నవంబరు 15 నుండి అమల్లోకి వచ్చింది. దైనందిన వ్యవహారాల్లో ఈ దేశాన్ని యు. ఎస్. ఎ., యు. ఎస్., అమెరికా, స్టేట్స్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. జూలై నాలుగు వివరణలో 13 రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటనలో ఈ పేరును యుక్తమైన రీతిగా యునైటెడ్ స్టేట్స్ గా ప్రకటించబడింది. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది (ప్రస్తుతం ఈ పేరుతో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు)
1777, నవంబరు 15, జరిగిన రెండవ ఖండాతంత కాంగ్రెస్ మహాసభ కాన్ఫెడరేషన్ యొక్క వ్యాసాల నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్న పదాన్ని దత్తత తీసుకుంది. 1778 న ఫ్రాంకో-అమెరికన్ ఒప్పందం ఈ దేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికా గా పేర్కొన్నది. 1778 జూలై 11 నుండి పరస్పర చెల్లింపు రసీదులలో యునటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (అమెరికా సంయుక్త రాష్ట్రం)గా పేర్కొనబడింది. సాధారణంగా పిలవబడే దీని లఘునామం యునటెడ్ స్టేట్స్. యు.ఎస్, యు.ఎస్.ఎ, అమెరికా అనేవి ఇతర లఘు నామాలు. 1700 ల నుండి సామాన్యులు యు ఎస్ ఆఫ్ ఎ అని అంతర్జాతీయంగా స్టేట్స్ అని అంటారు. కొలంబియా అని సాహిత్యంలో, పద్యాలలో పాటల్లో వాడుతుంటారు. ఇది క్రిస్టోబర్ కొంలంబస్ నుండి వచ్చింది. ఈ పేరు కొలంబియా జిల్లాకు పెట్టబడింది.
అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రజలను స్థిరంగా అమెరికన్ అంటారు. అధికారంగా సంయుక్తరాష్ట్రాలు (యునైటెడ్ స్టేట్స్) అంటున్నా అమెరికా, యు.ఎస్ అని సాధారణంగా అంటుంటారు (యు.ఎస్ ఫోర్స్, అంరికన్ విలువలు ). ఆంగ్లంలో యునైటెడ్ లేకుండా అమెరికా అని అరుదుగా అంటూ ఉంటారు.
1865 నుండి యునైటెడ్ స్టేట్స్ 13వ రాజ్యాంగ సవరణ తరువాత యునైటెడ్ స్టేట్స్ అనే పదాన్ని సంయుక్తరాష్ట్రాలు అనేవి అని బహువచనంగా వాడుతుంటారు. ప్రజోద్యమం తరువాత నుండి ఇప్పటి వరకు వీటిని ఏక వచన రూపంలో వ్యవహరిస్తున్నారు.
చరిత్రసవరించు
స్థానిక అమెరికనులు, ఐరోపా వలసదారులుసవరించు
హిమ యుగం ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతం అసియా ఖండంలోని సైబీరియాతో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెనగా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. హిమ యుగాంతాన (దాదాపు 11,000 సంవత్సరాల క్రితం) బేరింగ్ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1493, నవంబరు 19న పసిఫిక్ మహా సముద్రంలోని ప్యూర్టో రికో దీవిలో అడుగు పెట్టే వరకూ వీరినీ, వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికినీ మిగతా ప్రపంచం మర్చిపోయింది. ఈ కొత్త ప్రపంచానికి క్రమంగా అమెరికా ఖండం అనే పేరు స్థిర పడింది. అనాదిగా అక్కడ స్థిర పడిన ఆసియా సంతతి తెగల వారిని దేశీయ అమెరికన్లు (నేటివ్ అమెరికన్స్) గా పిలవనారంభించారు. ఐరోపావాసుల రాక మొదలయిన కొద్ది కాలానికే వారితో పాటు అమెరికాలో ప్రవేశించిన అంటువ్యాధుల తాకిడికి దేశీయ అమెరికన్లలో చాలా శాతం అంతరించిపోయారు.
యు.ఎస్ మూలవాసులని 4000 వేల సంవత్సరాలు, 12 వేల సంవత్సరాల మధ్యకాలంలో ఆసియా నుండి వలస వెళ్ళిన అలాస్కా వాసులని విశ్వసించబడుతున్నారు. కొలంబియన్ ముందు మిసిసిపి సంస్కృతిగా చెప్పబడుతున్న వీరు నాణ్యమైన వ్యవసాయం, గొప్ప నిర్మాణాలు, చిన్న చిన్న సమాజాలు అభివృద్ధి చేసారు. తరువాత యురేపియన్ వలసల కారణంగా దిగుమతి అయిన చిన్న అమ్మవారు వంటి అంటు వ్యాధులు ప్రబలిన కారణంగా మిలియన్ల కొలది యు.ఎస్ మూలవాసులు మరణించారు. ప్రస్తుతం యు.ఎస్ ప్రధాన భూమిగా వ్యవహరిస్తున్న ప్రదేశం ఒకప్పుడు యు.ఎస్ మూలవాసుల భూమిగా ఉండేది.
1492 లో స్పెయిన్ సామ్రాజ్య ఒప్పందంతో క్రిస్టోఫర్ కొలంబస్ పలు కరేబియన్ ద్వీపాలను కనుగొని ఈ యు.ఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1513 ఏప్రిల్ 2, తారీఖున స్పానిష్ వీరుడైన జువాన్ ఫోన్స్ డే లియోన్ తాను లా ఫ్లోరిడా గా పేర్కొన్న ఈ ప్రాంతంలో ఒప్పంద పత్రాల ఆధారంతో ప్రస్తుత యు.ఎస్ ప్రధాన భూమిలో అడుగు పెట్టిన మొదటి యురేపియన్ అయ్యాడు. తరువాత ప్రస్తుత సంయుక్త రాష్ట్రాల నైరుతి భాగంలో స్పెయిన్ ఒప్పందాల పరంపర ఆరంభం అయింది. ఫ్రెంచి ఉన్ని వ్యాపారులు న్యూ ఫ్రాన్స్ పెద్ద పెద్ద సరసుల చుట్టూ స్థావరాలను ఏర్పరచుకున్నారు. చివరకు ఫ్రెంచ్ మెక్సికన్ అఖాతం దిగువ భాగం లోని ఉత్తర అమెరికాలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1607లో మొదటి ఆంగ్లేయ ఒప్పంద స్థావరాలు ప్రస్తుత జేమ్స్‌టన్లో ఉన్న వర్జీనియా కాలనీ పేరుతో ఆవిర్భవించాయి. తరువాత 1620 పిలిగ్రింస్, ప్లే మౌత్ కాలనూలు స్థాపించారు. ఈ వలసల ప్రవాహ ఫలితంగా 1628 లో మసాచుసెట్స్ బే కాలనీ ఓడను అద్దెకు తీసుకున్నారు. 1610 తరువాత అమెరికన్ ఉద్యమ సమయంలో 50,000 మంది దోషులు బ్రిటన్ అమెరికన్ కాలనీలకు తరలించబడ్డారు. 1614 లో హడ్‍సన్ నదీ ప్రాంతాలలో న్యూ అమ్‍స్టర్‍డాం, మాన్ హట్టన్ తో చేర్చి డచ్ వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.
1674 డచ్ వారి అమెరికన్ భూములను ఆంగ్లేయులకు వదిలారు. న్యూనెదర్లాండ్ రాష్ట్ర భాగానికి న్యూయార్క్ అని నామకరణం చేసారు. కొత్తగా వచ్చి చేరిన వలసదారులలో మూడింట రెండు వంతుల వారు 1630-1680 మధ్య కాలంలో ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతమైన వర్జీనియాకు వచ్చి చేరిన ఒప్పంద కూలీలే. 18వ శతాబ్దానికి పలు ప్రాంతాలలో ఆఫ్రికన్ బానిసలు ఒప్పంద కూలీలకు ప్రధానవనరు అయ్యారు. 1729 నాటికి కరోలినా విభాగాలు, 1732 నాటికి జార్జియా కాననీలు 13 బ్రిటిష్ కాలనీలు కలసి అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా స్థాపించబడింది. పురాతన ఆంగ్లేయుల హక్కుల పట్ల వృద్ధి చెందుతున్న భక్తి, స్వతంత్ర ప్రభుత్వ లక్ష్యంతో అన్ని ప్రాటీయ ప్రభుత్వాలు స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహించి రిపబ్లికన్ పార్టీని ఉతేజకరంగా బలపరచాయి. ఆఫ్రికన్ బానిస వ్యాపారం అంతా చట్టబద్ధం చేయబడింది. జననాల శాతం అధికమై మరణాల శాతం క్షీణిస్తూ వలసలను క్రమబద్ధం చేస్తూ దేశంలోని జనసంఖ్య విపరీతంగా వృద్ధి చెందింది. 1730-1740 మధ్య కాలంలో తలెత్తిన క్రైస్తవ మత పునరుద్ధణోద్యమం ప్రజలలోని మతతత్వానికి, మత స్వాత్యంత్రాన్ని నిద్రలేపింది. ఫ్రెంచ్, ఇండియన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలు ఫ్రెంచ్ నుండి కెనడాను కైవశం చేసుకుంది. అయినప్పటికీ ఫ్రాంకోఫోన్ జనం రాజకీయంగా దక్షిణ కాలనీలకు అతీతంగా ఏకాంతంగా నిలిచింది. 13 బ్రిటిష్ కాలనీల నుండి వెలుపలకు పంపబడిన స్థానిక అమెరికన్లను మినహాయించి 13 బ్రిటిష్ కాలనీల జనసంఖ్య 1770 నాటికి 2.6 మిలియన్లకు చేరుకుంది. అమెరికన్లలో బ్రిటిష్ వారు మూడింట ఒక వంతులు, బానిసలుగా తీసుకురాబడిన ఆఫ్రికన్ అమెరికన్లు ఐదింట ఒక వంతు ఉన్నారు. బ్రిటీష్ పన్ను విధానాలను అనుసరించి అమెరికన్ కాలనీ వాసులకు గ్రేట్ బ్రిటన్ రాజ్యాంగంలో పాల్గొనే హక్కు ఉండదు.
స్వాతంత్ర్యం, విస్తరణసవరించు
1760-1770 మధ్య అమెరికా కాలనీలు, బ్రిటిష్ మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికా తిరుగుబాటు యుద్ధానికి దారి తీసి 1775 నుండి 1781 వరకు యుద్ధం కొనసాగింది. 1775 జూన్ 14 న ది కాంటినెంటల్ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలో సమావేశం అయి జార్జి వాషింగ్టన్ అదేశంతో కాంటినెంటల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని స్థాపించారు. 1776 లో ప్రతి మనిషీ సమానంగా రూపొందించబడ్డాడు అలాగే రద్దు చేయలేని ప్రత్యేకమైన హక్కులతో అనే థామస్ జెఫర్సన్ నినాదంతో అమెరికా కాంగ్రెస్ స్వాతంత్రాన్ని ప్రకటించింది. ఆ రోజును ప్రస్తుతం అమెరికా స్వాతంత్ర దినంగా కొనియాడుతుంది. 1777 నుండి ఆర్టికల్స్ ఆఫ్ కాంఫిడరేషన్ చేత స్థాపించబడిన బలహీన మైన కాంఫిడరల్ ప్రభుత్వం 1789 వరకు కొనసాగింది.
ఫ్రెంచ్, స్పెయిన్ సహాయంతో అమెరికా సైనికులు బ్రిటిష్ ను ఓడించిన తరువాత గ్రేట్ బ్రిటన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్రం, మిసిసిపి నది పడమట దిశ వరకు ఉన్న అమెరికన్ స్వయం ప్రతిపత్తిని గుర్తించింది. 1787 లో రాజ్యాంగ సమావేశాలు జరిపి పన్నులను విధించగలిగిన బలమైన ఫెడరల్ ప్రభుత్వ స్థాపన చేయాలని కోరుకున్నారు. తరువాత 1788 లో సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ఏర్పడి అలాగే 1789లో రిపబ్లికన్ మొదటి సెనేటర్, ప్రతినిధుల భవనం, ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ కార్యాలయం రూపుదిద్దుకుంది. 1791లో హక్కుల చట్టం, అసహ్యకరమైన వ్యక్తి స్వతంత్ర నిషేధం, చట్ట బద్ధమైన రక్షణ హామీ వంటివి స్వీకరించబడ్డాయి.
బానిసత్వం పత్ల విధానాలలో మార్పు వచ్చింది. రాజ్యాంగంలోని ఒక చట్టం అట్లాంటిక్ బానిస చట్టానికి 1808 వరకు మాత్రమే రక్షణ కలిగించింది. 1780-1804 ల మధ్య కాలంలో ఉత్తర రాష్ట్రాలు దక్షిణ ప్రాంతాన్ని విచిత్ర విధానాల రక్షకులుగా విడిచి పెట్టి బానిస వ్యాపారాన్ని రద్దు చేసింది. 1800 లలో ఆరంభమైన రెండవ చైతన్యం బానిసత్వ వ్యాపార రద్దు, తేదీ వారీగా భూముల కొనుగోలు వంటి వివిధ సాంఘిక సంస్కరణలకు దారితీసింది.
పడమటి దిశగా రాజ్య విస్తరణలో అమెరికన్లు వెలిబుచ్చిన ఆత్రత పలు ఇండియన్ యుద్ధాల పరంపరకు దారి తీసింది. 1803 లో ప్రెసిడెంట జెఫర్సన్ నాయకత్వంలో ఫ్రెంచ్ అక్రమిత భూమి అయిన ల్యూసియానా కొనుగోలు చేయడంతో దేశ విస్తీర్ణం రెండితలుగా పెరిగింది. 1812 లో అనేక ఫిర్యాదులు బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించడం యు.ఎస్ జాతీయతను బలపరిచింది. యు.ఎస్ సైన్యం ఫ్లోరిడా మీద జరిపిన వరుస దాడిల కారణంగా 1819లో స్పెయిన్, ఇతర అఖాతం అక్రమిత ప్రదేశాల స్వంతదారులు సముద్రతీర ప్రాంతాలను వదిలి వెళ్ళేలా చేసాయి. 1845 లో టెక్సాస్ సంయుక్తరాష్ట్రాలతో ఐక్యం అయింది. 1846 లో బ్రిటన్ తో జరిగిన ఒరెగాన్ ఒప్పందం ప్రస్తుత వాయవ్య అమెరికా యు.ఎస్ ఆధీనంలోకి రావడానికి దారి తీసింది. మెక్సికన్ అమెరికన్ యుద్ధంలో యు.ఎస్ విజయం 1848లో కాలిఫోర్నియా, ప్రస్తుత మరింత వాయవ్య అమెరికా యు.ఎస్ ఆధీనంలోకి రావడానికి కారణం అయింది. 1848-1849 మధ్య జరిగిన కలిఫోర్నియా గోల్డ్ రష్ (కలిఫోర్నియా బంగారు అంవేషణ) మరింత పడమర దిశ వలసలకు ప్రోత్సాహం అందించింది. కొత్త రైల్వే మార్గాలు స్థిరనివాసుల పునరావాసం, స్థానిక అమెరికన్లతో సంఘర్షణలకు దారి తీసింది. 50 సంవత్సరాల కాలం 40 మిలియన్లకు పైగా అమెరికన్ బర్రెలు లేక దున్న పోతులు తోలు, మాంసం కొరకు వధించబడిన తరువాత రైలు మార్గాల విస్తరణ సులువు చేసింది. స్థానిక ఇండియన్ల ప్రధాన వనరు అయిన బర్రెల మందలు కోల్పోవడంతో ఇండియన్ల అస్థిత్వానికి, అనేక స్థానిక సంస్కృతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
అంతర్యుద్ధం, పారిశ్రామికీకరణసవరించు
స్వతంత్ర రాష్ట్రాలు, బానిసల మధ్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వం మధ్య సంబంధాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవీ స్వీకరం చేసే లోపల ఏడు బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమానను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం అలాగే కాంఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేసాయి. ఫోర్ట్ సంటర్ మీద కాంఫిడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతే కాక మరి నాలుగు రాష్ట్రాలు కాంఫిడరసీతో చేతులు కలిపాయి. 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి బానిసలుగా ఉన్న సుమారు నాలుగు మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం, దాని స్పష్టత ఫెడరల్ ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 620,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మమైన సంఘర్షణగా మిగిలి పోయింది.
యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైక్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అధ్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు జిం క్రో లాస్ పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారి తీసింది. తూర్పున ఉన్న ఐరోపా దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల (ఇంఫ్రాస్టక్చర్) అభివృద్ధికి దారి తీసింది. 1867 లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890 లో జరిగిన ది వూండెడ్ నీ మాస్‍క్రీ నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893 లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998 లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను (ఆర్చియోపిలాగో) ను తమతో ఐక్యం చేసుకుంది. స్పానిష్ -అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వాం, ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తరువాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వాం మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలి పోయింది.
మొదటి ప్రపంచ యుద్ధం, మహా మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధంసవరించు
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత సంయుక్తరాష్ట్రాలు తటస్థంగా మిగిలి పోయింది. బ్రిటిషు, ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేసారు. అయినప్పటికీ మధ్యలో తలదూర్చడాన్ని అనేక మంది వ్యతిరేకించారు. 1917 నాటికి సంయుక్తరాష్ట్రాలు కూడా యుద్ధంలో పాల్గొంది. అమెరికన్ విదేశీ సైన్యాలు కేంద్ర శక్తికి వ్యతిరేకంగా తిరగడానికి సహకరించాయి. యుద్ధానంతరం సెనేట్ ఐక్య రాజ్య సమితిని స్థాపించిన వెర్సైల్లెస్ ఒడంబడికని ధ్రువీకరించ లేదు. దేశం ఏకపక్ష విధానాలను, ఒంటరి పరిమితులను అనుసరించారు. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప వత్తిడికి కారణమైనరోరింగ్ ట్వెంటీస్ గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది. 1932లో ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ ప్రెసిడెంట్‍గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్థిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మధ్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు.
1939 సెప్టెంబరులో జర్మనీ పోలెండ్ మీద దండెత్తే వరకు సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్తంగానే ఉండి పోయింది. తరువాత 1941 నుండి సహాయ దేశాలకు కావలసిన వస్తువులను ఋణంగాను- అద్దెకు ఇచ్చే ప్రణాళిక ద్వారా అందిస్తూ యుద్ధకార్యంలో పాలు పంచుకుంది. 1941 డిసెంబరు 7 న జపాన్ సామ్రాజ్యం పీర్ల్ హార్బర్ వద్ద హటాత్తుగా దాడి చేసిన తరువాత సంయుక్తరాష్ట్రాలు సహాయ దేశాలతో అలీన దేశాలకు వ్యతిరేకంగా చేతులు కలిపి అలాగే వేలకొలది జపానీ అమెరికన్లను ఖైదు చేసింది. యుద్ధంలో పాలగొనడం పెట్టుబడులను, పారిశ్రామిక శక్తికి ప్రోత్సాహం అందించింది. ప్రధాన యోధుల మధ్య సంయుక్తరాష్ట్రాలు మాత్రమే సంపన్న దేశం అయింది. నిజంగా యుద్ధ కారణంగా పేదరికంలో మునిగిపోయినన మిగిలిన దేశాల మధ్య సంయుక్తరాష్ట్రాలు అందుకోలేనంత సంపన్న దేశమైంది. బ్రెట్టన్ వుడ్స్, యాల్టా వద్ద జరిగిన సహాయదేశాల సమావేశాలు అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వ్యవహారాలకు సంయుక్తరాష్ట్రాలు, సోవియట్ యూనియన్ దేశాలను కేంద్రంగా చేసి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాయి. ఐరోపా విజయం తరువాత 1945 శాన్ ఫ్రాంసిస్కోలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో సంయుక్తరాష్ట్రాలు సమర్పించిన శాసనపత్రం యుద్ధానంతరం కార్యరూపం దాల్చింది. యుద్ధంలో జపాన్ దేశ నగరాలైన హిరోషిమా, నాగసాకీల మీద అణుబాంబు ప్రయోగం చేసిన తరువాత సంయుక్తరాష్ట్రాలు మొదటి అణుబాంబులను అభివృద్ధిన దేశంగా వెలుగులోకి వచ్చింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ సెప్టెంబరు 2వ తారీఖున జపాన్ లొంగి పోయింది.
ప్రచ్ఛన్న యుద్ధం, అసమ్మతి రాజకీయాలుసవరించు
రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ యూనియన్‌లు ఆధిక్యత కోసం పోటీ పడుతూ పరుగులు తీసాయి. సోవియట్ యూనియన్ నాటో ద్వారా ఐరోపా సైనిక చర్య, వార్సా సంఘటన ఆధిక్యత చూపింది. యుద్ధాలకు ప్రతినిధిత్వం వహిస్తూ అలాగే శక్తివంతమైన అణు బాంబులను అభివృద్ధి చేస్తూ పోటీ పడ్డాయి. అయినప్పటికీ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడాన్ని నివారిస్తూ వచ్చాయి. యు.ఎస్ తరచుగా సోవియట్ యూనియన్ పోషిస్తూ ఉందని భావించిన వామపక్ష ఉద్యమాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. 1950–53 లలో జరిగిన కొరియన్ యుద్ధంలో అమెరికన్ సైన్యాలు కమ్యూనిస్ట్ చైనా, ఉత్తర కొరియాలతో పోరాడాయి. సెనేటర్ నామమాత్ర కమ్యునిస్ట్ వ్యతిరేక ద్యమనాయకుడుగా ఉన్న కాలంలో ఐక్యరాజ్య సమితి- అమెరికన్ ఏక్టివిటీస్ కమిటీ వామపక్ష విధానాల మీద వరుసగా పరిశోధనలను నిర్వహించారు.
1961లో సోవియట్ మొదటి మానవ చోదిత వ్యోమనౌకను రోదసీకి పంపిన తరువాత అధ్యక్షుడు ఫె.ఎఫ్. కెనడీ పిలుపుతో ప్రేరింపబడిన సంయుక్త రాష్ట్రాలు 1969 నాటికి మానవుడిని మొట్టమొదటి సారిగా చంద్రమండలం మీద నిలబెట్టారు. క్యూబాలో సోవియట్ సైన్యాల మీద అణుబాంబు విషయంలో కెనడీ కూడా వత్తిడిని ఎదుర్కొన్నాడు. రోసా పార్క్, మార్టిన్ లూథర్ కింగ్, ఆఫ్రికన్ అమెరికన్ల పౌర హక్కుల కొరకు చేపట్టిన అహింసా యుద్ధం వృద్ధి చెందింది. తరువాత 1963లో కెనడీ కాల్చి చంపబడ్డాడు. అలాగే 1964 లో పౌర హక్కుల చట్టం, 1965లో ఓటు హక్కు ప్రెసిడెంట్ లిండన్.బి. జాన్‍సన్ ఆధ్వర్యంలో జారీచేయబడ్డాయి. వైద్యరక్షణ, వైద్యసహాయం చట్టం మీద కూడా ఆయన సంతకం చేసాడు. జాన్‍సన్ ఆయన తరుత అధ్యక్షుడైన నిక్సన్ ఆగ్నేయాసియా లోని విజయవంతం కాని వియత్నాం యుద్ధానికి ప్రాతినిధ్యం వహించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సాంస్కృతిక వ్యతిరేక కారులు, నల్ల జాతీయులు, స్త్రీ విమోచనోద్యమ కారుల సహకారంతో చెలరేగిన ఉద్యమం తీవ్ర రూపందాల్చింది. రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులను కోరుతూ బెట్టీ ఫ్రైడెన్, గ్లోరియా స్టెనెం, ఇతరుల నాయకత్వంలో స్త్రీ విమోచనోద్యమం కొనసాగింది.
వాటర్ గేట్ కుంభ కోణం ఫలితంగా మహాభియోగంలో భాగం కావడం న్యానిర్ణేతల న్యాయనిర్ణయాన్ని అడ్డగించడాన్ని, అధికారాన్ని దుర్వినియోగ పరచడం వంటి వాటిని తప్పించడానికి 1974లో నిక్సన్ తిరిగి అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసాడు. రెండవ సారి పదవీ ప్రమాణం చేసిన అధ్యక్షులలో ఈయన ప్రథముడు. జిమ్మీ కార్టర్ నిర్వహణలో 1970 చివరలో దేశం ద్రవ్యోల్బణం, ఇరాన్ ఆశ్రితుల గండాలను ఎదుర్కొన్నది. 1980లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడిన సమయంలో అమెరికన్ రాజకీయలలో కారణంగా పన్ను విదింపులో, ముఖ్యమైన వాటికి ఖర్చు చేయడం వంటి విషయాలలో మార్పుల వచ్చాయి. ఆయన రెండవ సారి పదవి వహించిన కాలంలో ఇరాన్-కాంట్రా కుంభకోణం అలాగే సోవియట్ యూనియన్‍తో దౌత్య సంబంధాల వంటివి జరిగాయి. సోవియట్ కుప్ప కూలిన ఫలితంగా పరోక్ష యుద్ధం వెలుగులోకి వచ్చింది.
సమకాలీన శకంసవరించు
ఐక్య రాజ్య సమితి ఆమొదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్ (అరేబియన్ అఖాతం) అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్తరాష్ట్రాలు ప్రధానపాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్థిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు, అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనే అపవాదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు పదవిలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అధ్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడు అయ్యాడు.
2001, సెప్టెంబరు 11 న అల్ ఖైదా తీవ్రవాదులు న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం), వాషింగ్టన్, డి.సి. సమీపంలో ఉన్న పెంటగన్, డి.సి నరమేధంలో సుమారు 3000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి ఆఫ్ఘనిస్తాన్ మీద దండెత్తి తాలిబాన్ ప్రభుత్వాన్ని గద్దె దించి అల్ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. తాలిబాన్ తిరుగుబాటుదారులు గొరిల్లా యుద్ధం కొనసాగించారు. 2002లో బుష్ ప్రభుత్వం ఇరాక్ రాజ్యాంగ మార్పులను తీసుకురావచ్చిన వత్తిడి వివాదాలకు దారి తీసింది. 2003లో యు.ఎస్ నడిపించిన సైన్యాలు ఇరాక్ మీద దాడి చేసి సదాం హుస్సేనును తరిమి కొట్టింది. 2005 కేథరినా సుడిగాలి మెక్సికన్ అఖాతంలో కఠినమైన వినాశనాన్ని సృష్టించి న్యూ ఆర్లాండ్‍ను తీవ్రంగా నాశనం చేసి అమెరికన్ చరిత్రలో గుర్తించతగిన విషాదంగా మిగిలి పోయింది. 2008లో అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం మధ్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడైన బరాక్ ఒబామా అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. రెండు సంవత్సరాల అనంతరం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక విధానాల సంస్కరణ అమలులోకి వచ్చాయి. 2011 లో అమెరికన్ త్రిదళ సేన (నేవీ సీల్స్) పాకిస్థాన్ మీద దాడి చేసి అల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాదెన్ను హతమార్చింది. 2011 డిసెంబరు తేదీన మిగిలిన యు.ఎస్ దళాలను వెనుకకు మరలించడంతో ఇరాక్ యుద్ధం ముగింపుకు వచ్చింది.
భౌగోళికం , పర్యావరణంసవరించు
అమెరికా సంయుక్త రాష్ట్రాలు దాదాపు పశ్చిమార్ధగోళం మొత్తం విస్తరించి ఉన్నాయి. అలాస్కా తప్ప మిగతా అమెరికా భూభాగం పడమట పసిఫిక్ మహాసముద్రం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, ఆగ్నేయాన మెక్సికో అగాధం, ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాల నడుమ విస్థిరించి ఉంది. భౌగోళికంగా అలాస్కా అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోనూ పెద్దది. కెనడా దేశం ఈ రాష్ట్రాన్ని మిగతా అమెరికా భూభాగంనుండి విడదీస్తుంది. అలాస్కా అమెరికాకి నైరుతి దిశగా ఆవల ఉంది. దీనికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. భూవైశాల్యం పరంగా అమెరికా ప్రపంచంలో మూడవ పెద్ద దేశం (మొదటి రెండూ: రష్యా, కెనడా). పసిఫిక్ మహా సముద్రం లోని కొన్ని చిన్న చిన్న ద్వీప సముదాయాలు కూడా అమెరికా కిందకు వస్తాయి (ఉదా: ప్యూర్టో రికో, గువామ్)
అట్లాంటిక్ తీరప్రాంతం ఆకులు రాల్చే చెట్లతో నిండిన దట్టమైన అడవులు గల పైడ్ మాంట్ పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది. అపలచియాన్ పర్వతాలు తూర్పు తీరాన్ని ఘనమైన సరస్సులు, విస్తారమైన గడ్డిభూములతో నిండిన మధ్య పడమటి ప్రాంతం నుండి విడదీస్తుంది. మిసిసిపి-మిస్సోరి నది అమెరికా దేశానికి సరిగా మధ్యలో ఉత్తరం నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలోని నాలుగవ అతి పెద్ద నదీ పరీవాహక ప్రాంతం. రాకీ పర్వత శ్రేణులు ఉత్తర దక్షిణ దిశల్లో విస్తరించి ఉంటాయి. వీటికి తూర్పుగా ఉన్న సారవంతమైన స్టెప్పీ భూములు పడమటి వైపుకు వ్యాపించి ఉంటాయి. రాకీ పర్వతాలకు పడమటి దిశలో మొహావే ఎడారి ఉంటుంది. సియెరా నెవెడా పర్వత శ్రేణి రాకీ పర్వతాలకు సమాంతరంగా, పసిఫిక్ మహా సముద్రానికి సమీపంలో విస్తరించి ఉంటుంది.
అలాస్కాలోని మెకిన్లీ పర్వతం 20,320 అడుగుల/6,194 మీటర్ల ఎత్తుతో అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. అమెరికా అధీనంలో ఉన్న అనేక ద్వీపాల్లో అగ్ని పర్వతాలు అతి సాధారణం. హవాయి రాష్ట్రం మొత్తం అగ్ని పర్వతాలతో నిండిన చిన్న చిన్న దీవుల సముదాయం. ఎల్లో స్టోన్ జాతీయ పార్కు లోని మహాగ్నిపర్వతం ఉత్తర అమెరికా ఖండం అంతటికీ పెద్దదైన అగ్ని పర్వతం.
వాతావరణంసవరించు
అతి పెద్ద భూవైశాల్యం, వివిధ రకాల భౌగోళిక విశేషాల వల్ల అమెరికాలో ఎన్నో రకాల వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. చాలా ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. హవాయి, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అలాస్కాలో ధ్రువ వాతావరణం ఉంటుంది. నైరుతి వైపు ఎక్కువగా ఎడారి వాతావరణం, కాలిఫోర్నియా తీర ప్రాంతంలో మధ్యధరా ప్రాంతంలోలాంటి ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి. మెక్సికో అగాధ సమీప ప్రాంతాల్లో తుఫానులు, గాలివానల తాకిడి ఎక్కువ. మధ్య పడమటి భాగంలో ప్రచండమైన సుడిగాలులు తరచూ సంభవిస్తుంటాయి.
ప్రజాజీవన విశేషాలుసవరించు
- అమెరికాలో ప్రతి కుటుంబానికి సగటున ఒక కారు ఉంది.
- 7.75కోట్ల కుక్కల్ని పెంచుకుంటున్న కుటుంబాలు 39శాతం ఉన్నాయి.కోటిన్నర కుటుంబాలు వివిధ రకాల పక్షుల్ని; 9.36కోట్ల కుటుంబాలు పిల్లుల్ని; 1.33 కోట్ల కుటుంబాలు అశ్వజాతుల్ని పెంచుతున్నాయి.4500కోట్ల డాలర్ల మేర కుక్కల వ్యాపారం జరుగుతుంది.ఈ మొత్తం 114దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కన్నా ఎక్కువ.
- ప్రపంచ దేశాల రక్షణ వ్యయాల్లో అమెరికా వాటా 44శాతం
- 25 శాతం ఆఫ్రికన్ అమెరికన్లు నిరుపేదలు.ఇళ్లులేనివారి సంఖ్య 6.64లక్షలు.9.5శాతం నిరుద్యోగ రేటు ఉంది.
- 60శాతం అమెరికన్లు వాయు కాలుష్యంలో జీవిస్తున్నారు.
అమెరికా లో 10 పెద్ద నగరాలుసవరించు
రాష్ట్రాల జాబితాసవరించు
|
అంతర్జాతీయంగా ఉన్న స్థానంసవరించు
సంస్థ | నిజనిర్దారణ చేసి సేకరించిన సమాచారం | స్థానం |
---|---|---|
యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమం | మానవ అభివృద్ధి సూచిక [5] | 177లో 12 స్థానం[6] (1-వ స్థానం ఉత్తమం) |
ది ఎకనోమిస్ట్ | ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేదానికి సిధ్ధంగా ఉన్న దేశాలు | 70లో1 స్థానం[7] (1-వ స్థానం ఉత్తమం) |
ది ఎకనోమిస్ట్ | ప్రపంచ ఆర్థిక వ్యవస్థ | 48లో1 వ స్థానం[8] (1-వ స్థానం ఉత్తమం) |
ది ఎకనోమిస్ట్ | అధిక కొనుగోలు శక్తి | 70లో5 వ స్థానం[9] (1-వ స్థానం ఉత్తమం) |
ఎటి కీర్నరీ/విదేశీ వ్యవహారాల పత్రిక | [ అంతర్జాతీయకరణ సూచిక 2006] | లో స్థానం |
ఐ ఎం డి ఇంటర్నేషనల్ | ప్రపంచ దేశాల పోటీ సూచిక పుస్తకం | 10 లో స్థానం |
ది ఎకనోమిస్ట్ | ప్రపంచ మానవ జీవన ప్రమాణాల సూచిక | 48 లో 41 వ స్థానం[10] (1-స్థానం ఉత్తమం) |
యేల్ యూనివర్సిటి/కొలంబియా యూనివర్సిటి | వాతావరణ రక్షిత సూచిక, 2005 (pdf) | లో వ స్థానం |
ఎల్లలు లేని పాత్రికేయులు | పత్రికా స్వేచ్చ సూచిక 2006 | 169లో48 వ స్థానం[11] (1-వస్థానం ఉత్తమం) |
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ | దేశాలలో అవినీతి సూచిక - 2007 | 158లో17 స్థానం[12] (1-వ స్థానం ఉత్తమం) |
హేరిటేజి ఫౌండేషన్/ది వాల్ స్ట్రీట్ జర్నల్ | ఆర్థిక స్వేచ్చ సూచిక,2007 | 162లో-5 వ స్థానం[13] 1-వ స్థానం ఉత్తమం |
ది ఎకనోమిస్ట్ | ప్రపంచ శాంతి సూచిక[14] | 144 లో వ స్థానం 97 (1-వ స్థానం ఉత్తమం) |
విడుదల కొరకు నిధులు /ForeignPolicy.com | విఫల దేశాల సూచిక,2007 | 177 లో160 వ స్థానం[15] (1-వ స్థానం అద్వాన్నం)[16] |
ప్రధాన వ్యక్తులుసవరించు
డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలు,వనరులు,సమాచార సేకరణసవరించు
- ↑ "Population Finder: United States". U.S. Census Bureau. Archived from the original on 2020-02-12. Retrieved 2007-12-20.
- ↑ 2.0 2.1 "Report for Selected Countries and Subjects (30 advanced economies; 6 subjects)". World Economic Outlook Database. International Monetary Fund. October 2007. Retrieved 2008-02-05.
- ↑ DeNavas-Walt, Carmen; Bernadette D. Proctor; Jessica Smith (August 2007). "Income, Poverty, and Health Insurance Coverage in the United States: 2006" (PDF). U.S. Census Bureau. Retrieved 2008-02-05.
- ↑ "The Human Development Index—Going Beyond Income". Human Development Report 2007. United Nations Development Program. Archived from the original on 2009-01-27. Retrieved 2007-11-27.
- ↑ "Human Development Index". Retrieved 2008-07-10.
- ↑ "2007/2008 Human Development Index rankings". Retrieved 2008-07-10.
- ↑ "E-readiness ranking". Retrieved 2008-07-10.
- ↑ "Biggest economies". Retrieved 2008-07-10.
- ↑ "Highest purchasing power". Retrieved 2008-07-10.
- ↑ "Highest life expectancy". Retrieved 2008-07-10.
- ↑ "ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 2007". Archived from the original on 2007-10-17. Retrieved 2008-07-10.
- ↑ "Corruption Perceptions Index 2007". Archived from the original on 2008-05-12. Retrieved 2008-07-10.
- ↑ "Index of Economics freedom 2008". Archived from the original on 2008-02-13. Retrieved 2008-07-10.
- ↑ All information in the table of rankings from:
- Institute for Economics and Peace, Economist Intelligence Unit (2008). "Global Peace Index: 2008 Methodology, Results & Findings" (PDF). p. 58. Archived from the original (PDF) on 2008-09-11. Retrieved 2008-06-17.
- Institute for Economics and Peace, Economist Intelligence Unit (2007). "Global Peace Index: Methodology, Results & Findings" (PDF). p. 44. Archived from the original (PDF) on 2008-05-29. Retrieved 2008-06-17.
- ↑ "Failed States Index Scores 2007". Archived from the original on 2007-06-20. Retrieved 2008-07-10.
- ↑ larger number indicates sustainability
- ఇంగ్లీష్ వికీపీడియా నుండి : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
బయటి లింకులుసవరించు
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- ప్రభుత్వం
- అమెరికా అధికారిక పోర్టల్ అన్ని ప్రభుత్వ వెబ్ సైటుల వేదిక
- వైట్ హౌస్ అమెరికా దేశాధ్యక్షుడి అధికారిక వెబ్సైటు
- సెనేట్ అధికారిక వెబ్సైటు
- హౌస్ అఫ్ రేప్రజెంటేటీవ్స్ అధికారిక వెబ్సైటు
- సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయస్థానం అధికారిక వెబ్సైటు
- లైబ్రరీ అఫ్ కాంగ్రెస్ అధికారిక వెబ్సైటు
- గణాంకాలు
- ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ రెసౌర్సేస్ పోర్టల్
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు Archived 2018-12-25 at the Wayback Machine సి.ఐ.ఏ వరల్డ్ ఫాక్ట్ బుక్" ఎంట్రీ
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎన్సైక్లోపెడియా బ్రిటానికా ఎంట్రీ
- అమెరికా సెన్సుస్ హౌసింగ్ అండ్ ఎకనమిక్ స్టాటిస్టిక్స్ వైడ్ - రేంజింగ్ డేటా ఫ్రొం ది అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెన్సుస్ బ్యూరో
- స్టేట్ ఫాక్ట్ షీట్స్ పొపులేషన్, ఎంప్లాయ్మెంట్, ఆదాయం,, ఫాం డేటా ఫ్రమ్ ది అమెరికా ఎకనమిక్ రీసెర్చ్ సర్వీసు
- స్టేట్ ఎనర్జీ ప్రోఫైల్స్ ఎకనమిక్, ఎన్విరోన్మెంటల్, అండ్ ఎనర్జీ డేటా ఫర్ ఈచ్ స్టేట్
- 50 - అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎకనమిక్ రీసెర్చ్ సర్వీసు కాలేక్టేడ్ ఇంఫోర్మషనల్ లింక్స్ ఫర్ ఈచ్ స్టేట్
- చరిత్ర
- చారిత్రిక పత్రాలు జాతీయ కేంద్రం పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సేకరణ
- అమెరికా జాతీయ మొట్టోస్: చరిత్ర , రాజ్యాంగం Archived 2006-12-12 at Archive-It అనాలిసిస్ బై ది ఒంటారియో కన్సల్టన్తెస్ ఆన్ రిలీజియస్ టోలేరన్స్
- అమెరికా కలేక్టేడ్ లింక్స్ టు హిస్టోరికల్ డేటా
- దేశ పటాలు
- అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ పటం(అట్లాస్) అధికారిక పటం :డిపార్టుమెంటు అఫ్ ది ఇంటీరియర్ నుండి
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు శాటిలైట్ వ్యూ
- ఇతరాలు
- అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ Archived 2006-11-02 at the Wayback Machine పౌరసత్వం, వలస సేవల అధికారిక ప్రభుత్వ వెబ్ సైటు
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు ట్రావెల్ గయిడు అండ్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్