ఉక్కు సత్యాగ్రహం
ఉక్కు సత్యాగ్రహం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఆధారంగా తీసిన తెలుగు సినిమా. జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పి.సత్యారెడ్డి దర్శకత్వం వహించి నిర్మించాడు. గద్దర్, పి.సత్యారెడ్డి, పల్సర్‌బైక్ ఝాన్సీ, కరణం ధర్మశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 2024, నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇది గద్దర్ నటించిన చివరి సినిమా.[1][2][3]
ఉక్కు సత్యాగ్రహం | |
---|---|
పాటలు | గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ |
దర్శకత్వం | పి.సత్యారెడ్డి |
రచన | పి.సత్యారెడ్డి |
నిర్మాత | పి.సత్యారెడ్డి |
తారాగణం | గద్దర్ పి.సత్యారెడ్డి పల్సర్‌బైక్ ఝాన్సీ కరణం ధర్మశ్రీ |
కూర్పు | మేనగ శ్రీను |
సంగీతం | శ్రీకోటి |
నిర్మాణ సంస్థ | జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 29 నవంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతుంటాయి, ప్రైవేటీకరణ ఆపేందుకు నాయకులు, ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో సత్యారెడ్డి ఉద్యమం కోసం వచ్చి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తారు. ఈ ఉద్యమాన్ని ఆపడానికి పోలీసాఫీసర్ (పల్సర్‌బైక్ ఝాన్సీ) వస్తుంది. కానీ ఉద్యమం గురించి సత్యారెడ్డి ద్వారా తెలుసుకున్న ఆమె వీళ్లకు సపోర్ట్ చేయడంతో కొంతమంది నాయకులు ఆమెను కిడ్నాప్ చేసి, ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తుంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు అడ్డగిస్తున్నారు? ప్రైవేటీకరణ చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ఈ సినిమాలో గద్దర్ పాత్ర ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.[4][5]
నటీనటులు
మార్చు- గద్దర్[6]
- పి.సత్యారెడ్డి
- పల్సర్‌బైక్ ఝాన్సీ
- కరణం ధర్మశ్రీ
- ఎం.వి.వి.సత్యనారాయణ
- ప్రసన్నకుమార్
- వెన్నెల
మూలాలు
మార్చు- ↑ NT News (27 November 2024). "ఉక్కు ఉద్యమ చిత్రం". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ News18 తెలుగు (26 November 2024). "'ఉక్కు సత్యాగ్రహం' రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే..?". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (27 November 2024). "గద్దర్ నటించిన చివరి చిత్రం ఈనెల 29న రిలీజ్ ఫిక్స్". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Zee News Telugu (29 November 2024). "గద్దర్ చివరి చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం' చిత్రం ఎలా ఉంది.. ప్రేక్షకులను మెప్పించిందా..!". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Sakshi (29 November 2024). "'ఉక్కు సత్యాగ్రహం' మూవీ రివ్యూ". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ The Hindu (29 November 2023). "Gaddar's last movie, 'Ukku Satyagraham', to hit screen in five languages in mid-December" (in Indian English). Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.