సుద్దాల అశోక్ తేజ
సుద్దాల అశోక్ తేజ (జననం గుర్రం అశోక్ తేజ; 1960 మే 16) తెలుగు సినిమా పాటల రచయిత, తెలుగు సాహిత్యకారుడు.[1] సుమారు 2000కి పైగా సినిమాల్లో 3000 పైచిలుకు పాటలు రాశాడు.[2][3] 2003లో వచ్చిన ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు 2014లో ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[4][5] స్వచ్ఛ్ భారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏకైక కవి.[6]
సుద్దాల అశోక్ తేజ | |
---|---|
జననం | గుర్రం అశోక్ తేజ 1960 మే 16 |
వృత్తి | సినిమా పాటల రచయిత కథా రచయిత, ఉపాధ్యాయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఠాగూర్ సినిమాలో నేను సైతం పాట |
జీవిత భాగస్వామి | నిర్మల |
పిల్లలు | జ్వాలా చైతన్య, అర్జున్ తేజ, & స్వప్న |
తల్లిదండ్రులు |
|
వెబ్సైటు | http://www.suddalaashokteja.in/ |
తొలి జీవితం
మార్చుఆయన 1960, మే 16 న యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టాడు.[7] ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పేరు, తర్వాత తరాలకు కూడా సుద్దాల గా మార్చుకున్నాడు. తల్లి జానకమ్మ. అశోక్ తేజ తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. ఇద్దరూ హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్నారు.[8] హనుమంతు 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. అశోక్ తేజకు ఇద్దరు సోదరులు (ప్రభాకర్ తేజ, సుధాకర్ తేజ) ఒక సోదరి (రచ్చ భారతి) ఉన్నారు.
సినిమారంగం
మార్చుఅశోక్ తేజ తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్, మేడిపల్లి, మెట్పల్లి గ్రామాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. చిన్నప్పటి నుంచి సాహిత్యం రాయడం మొదలుపెట్టాడు. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. 1996-1997 సంవత్సరాలలో ఒసేయ్ రాములమ్మా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.[9][10]
ఠాగూర్ (2003) చిత్రంలో నేను కూడా అనే పాటకు 2004 సంవత్సరంలో ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[11] ఇది మహాప్రస్థానంలోని శ్రీశ్రీ 'నేను సైతం' ఆధారంగా ఈ పాట రాయబడింది. అల్లూరి సీతారామరాజులోని “తెలుగు వీర లేవరా”కు శ్రీశ్రీ తర్వాత, “మాతృదేవోభవ”లోని “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే”కి వేటూరి తర్వాత ఈ పురస్కారం పొందిన మూడో రచయిత. అశోక్ తేజ 2017 వరకు 1250 సినిమాలకు 2200 పాటలు, 2500 ప్రైవేట్ పాటలు రాశాడు. ఫిదా (2017) లోని "వచ్చిండే, పిల్లా మెల్లామెల్లగా వచ్చిండే" పాటకు 2018లో తెలుగులో ఉత్తమ గీత రచయితగా సైమా అవార్డును గెలుచుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఅశోక్ తేజ నిర్మలను వివాహం చేసుకున్నాడు.[12] వారికి కుమార్తె (స్వప్న), కుమారులు (జ్వాలా చైతన్య, అర్జున్ తేజ) ఉన్నారు.[13]
రచనలు
మార్చుకవిత్వం
మార్చుప్రసిద్ధి చెందిన పాటలు
మార్చు- ఆలి నీకు దండమే, అర్దాంగి నీకు దండమే
- ఠాగూర్: నేను సైతం
- నేలమ్మ నేలమ్మ నేలమ్మా
- ఒకటే జననం ఒకటే మరణం - భద్రాచలం
- ఝుమ్మంది నాదం: ఏం సక్కగున్నావో నా సోట్టసేంపలోడా
- గోవిందుడు అందరి వాడేలే: నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ
- రజాకార్: అన్ని పాటలు
- ఆ ఐదుగురు: అన్ని పాటలు
- జై బోలో తెలంగాణ: నిజమేనా
- రోబో: ఇనుములో ఊ హృదయం మొలిచేనే, ఓ మర మనిషి
- దొంగల బండి: ఓరోరి మావయ్యో, నేలకు జారెనే చందమామ
- ఢీ అంటే ఢీ: అగ్నిగుండం
- హోమం: అవును మిస్టర్ నిన్నే, యే పగలే, పెదవికిదెం కసిరో, మగాళ్లు మీ మాటలో, కత్తి నాకు గుచ్చాడమ్మో, హోమం యుద్ధం
- ఆటడిస్తా: స్టైల్ స్టైల్
- నా మనసుకేమయింది: సఖుడే సఖుడే
- ఎవరినైనా ఎదురిస్తా: ఈ మధు బాల
- గౌతమ బుధ: వేడనే, ఏడ యెడలో
- మైసమ్మ ఐ.పి.ఎస్.: మైసమ్మ
- మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి: అసలే చలికాలం
- చందమామ: రేగుముల్లోలే
- వీడు మామూలోడు కాదు: కమలా పండు
- శంకర్‌దాదా జిందాబాద్: ఓ బాపు నువ్వే రావై
- హింసించే 23వ రాజు పులికేసి: మనిషికి యెందుకు
- టాస్: యెన్ చిలకో
- భూకైలాస్: బావ మురిపించన
- రాజు భాయ్: అన్ని పాటలు
- శివాజీ: వాజీ వాజీ, సహానా
- అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ: రారా అంటే, ఈ చలి గాలుల్లోనా
- మనసుతో: ఎప్పుడు చప్పుడు
- ఖుషి: హోలీ హోలీ
- కుబుసుం: నూనుగు మీసాల, నింగికెగిసినరా, నీలి మెగాహలలో, ఇంద్రుడు ఈటకల్లు
- ఖడ్గం: ఆహా అల్లరి
- కాశీ: ఏ మారుగేలరా ఓ రాఘవ, పున్నమి జాబిలి, పచ్చి వెన్న, మరుగేలరా ఓ రాఘవ, కొట్టు కొట్టు, అరెరే యేమైందో
- ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి: భామ నీతో
- గర్ల్ ఫ్రెండ్: నువ్వు యాడికెళ్తే
- మురారి: బంగారు కళ్ళా బుచ్చమ్మో, అలనాటి రామ చంద్రుడు
- ధనుష్: మల్లి మల్లి నీతో
- చార్మినార్: భజ్ దేఖ్
- ఛలో అసెంబ్లీ: ఆగడు
- నిన్ను చూడాలని: ముద్ద బంతి
- లీలామహల్ సెంటర్: సిరిమల్లె పువ్వల్లె, పరమపావన, గాలికి తెలియని, చిట్టి చిలకమ్మ, బాలమణెమ్మో
- మధుమాసం: ఓని మెరుపులు
- సుభాష్ చంద్రబోస్: సుభాష్ చంద్రబోస్, నేరేడు పళ్ళు
- శ్రీ శ్రీమతి సత్యభామ: తిట్టు, సత్య, మేరా
- శివాని: ఏమండి
- శివశంకర్: నేనేమి చేతను, కృష్ణ నువ్వు రాకు
- సర్దుకుపోదాం రండి: వగలాడి
- సాంబ: కితైక్తలు
- సకుటుంబ సపరివార సమేతం: వళ్ళంత తుళ్ళింత, పచ్చి వెన్న, మనసంతా మనసుపడి, లవ్ ఈజ్ ది ఫీలింగ్ ఆఫ్ లైఫ్, అంద చందాల
- దిల్: తమల పాకు నెమలి సోకు
- ఎన్కౌంటర్: యుద్ధం యుద్ధం, పల్లె తెల్లవారుతున్నాడా, ఊరు వాడ అక్కల్లారా
- జెండా: ఇస్ దేశ్
- జాబిలి: పద పద నీ, జాలీ జాలీ కాలేజ్, గంగా యమునా గోదారి, చిగురాకు ఎవరో
- నా ఊపిరి: ఒక పువ్వులా, ఓక మెరుపే
- సత్యం శివం సుందరం: అమ్మో అమ్మమ్మో
- పెళ్ళాం ఊరెళితే: ఓ మల్లెపువ్వురా
- రాయలసీమ రామన్న చౌదరి: ఏడురా లేడింకా, రామన్న రామన్న, బుచ్చిమల్లు బుచ్చిమల్లు
- చిన్నోడు: హే మానస, చిన్నారి
- రారాజు: బంగారు చిలక
- రానా: రంప చికు
- అంకుల్: అంకుల్ అంకుల్ లిటిల్ స్టా, గీతారై నే పాడనా
- విజయరామరాజు: ఎవరు నువ్వు, అడుగు అడుగున
- వీడే: అదిగదిగో వస్తున్నాడు
- స్టాలిన్: సూర్యుడే సెలవని
- రూమ్ మేట్స్: హయిరే హయిరే,
- అమ్మ చెప్పింది: మాటలతో స్వరాలే
- అస్త్రం: ఉండిపో నేస్తమా
- హనుమంతు: ఓ హనుమంతు, రామయ్య రామయ్య
- శ్రీ కృష్ణ: జగదేక వీరునిగా
- రణం: వారెవ్వ
- శ్రీరామదాసు: హైలెస్సా
- శ్రీ: హోలీ హోలీ
- ఫూల్స్: ఆకుచాటు పిందేలం
- పాండు: జాబిలిపైనా
- శీనుగాడు చిరంజీవి ఫ్యాన్: నిన్నేమో పాపరో
- చంద్రముఖి: చిలుక పద పద, అందాల ఆకాశమంత
- అయోధ్య: జిమ్ము చూడు, చోడో చోడో
- యాపిల్: రాఘవేంద్రుడు, పైలా పచ్చిసు పిల్ల, నువ్వా నువ్వా, మనీ మనీ, మా కాలనీలో
- బన్ని: మైలు మైలు, కనపడలేదా
- బాబీ: కళ్ళల్లో ద్రాక్షరసం
- విజయేంద్ర వర్మ: పాపరో
- విష్ణు: నీ పేరే తనపైన, రావోయి చందమామ
- యజ్ఞం: ఏం చేసావో, తొంగి తొంగి చూడమోకు చందమామ
- 6 టీన్స్: అన్ని పాటలు
- ఆప్తుడు: తూఫాన్ అయి నువ్వు రావాలి రా, పల్లె పల్లెకు ఉంటావు కాపాలా
- పొలిటికల్ రౌడీ: కళ్ళు తెరిచి చూసా, అరే పచ్చి పచ్చిగా
- భద్రాచలం: ఒకటే జననం ఒకటే మరణం
- పాండు రంగడు: మాతృదేవో భవా అన్నమాట
- చందమామ: రేగుముల్లోలే
- కంటె కూతుర్నే కను: ఒక జాబిలి, తెలుగుంటి తులసమ్మ, ఆడ కుతురా నీకు
- ఠాగూర్: నేను సైతం
- ఒకటో నంబర్ కుర్రాడు: నెమలి కన్నోడా
- ఒసేయ్ రాములమ్మ: 6 పాటలు
- నిన్నే పెళ్లాడుతా: నా మొగుడు రాంప్యారి
- ఫిదా: వచ్చిండే
- బేవర్స్: తల్లి తల్లి
- ఫలక్‌నుమా దాస్: పాయే పాయే
- పలాస 1978: కళావతి కళావతి
- రాధా కృష్ణ: నిర్మల బొమ్మ
- లవ్ స్టోరీ: సారంగ దరియా
- ఆర్ఆర్ఆర్: కొమురం భీముడో
- రిపబ్లిక్: జోర్ సే
- రౌడీ బాయ్స్: బృందావనం
- భారతీయుడు 2: సౌరా
సినిమాలు
మార్చు- పలాస 1978 (2020)[14][15]
- కుబుసం
- డేంజర్ లవ్ స్టోరీ (2019)
- భీమదేవరపల్లి బ్రాంచి (2023)
- డెడ్‌లైన్ (2023)
పుస్తకాలు, ప్రచురణలు
మార్చుతెలుగు
మార్చు- స్మృతి గీతం
- వెలుగు రాకలు నవల
- ఆకుపచ్చ చందమామ
- బతుకు పాటలు
- వీర తెలంగాణ యక్ష గానం
- నేలమ్మ నేలమ్మ
- నెమలికన్నోడ
- శ్రమ కావ్యం
- నా పాటలు
- నేను అడవిని మాట్లాడుతున్నాను
ఇంగ్లీష్
మార్చు- సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ ఆఫ్ టాయిల్ (సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం శ్రమ ఇతిహాసం)
- ఐ యామ్, ది ఫారెస్ట్, స్పీకింగ్ (నేను అడవిని మాట్లాడుతున్నాను)
హిందీ
మార్చు- ధరి మా
పురస్కారాలు
మార్చుజాతీయ పురస్కారం
మార్చు2003 సంవత్సరానికి (ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" పురస్కారం లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ పురస్కారం.
సైమా అవార్డులు
మార్చుసైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత
- 2017: "వచ్చిండే" (ఫిదా)
ఇతర అవార్డులు
మార్చు- మహాత్మా జ్యోతి ఫూలే అవార్డు
- గేయాలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
- తెలుగు అధికార భాషా పురస్కారం
- వంశీ అంతర్జాతీయ అవార్డులు
- ఆత్రేయ మనస్విని పురస్కారం
- సినీ గోయర్స్ హైదరాబాద్ అవార్డులు
- బిఎన్ రెడ్డి సాహితీ పురస్కారం
- భరతముని పురస్కారాలు
- ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవ పురస్కారం
- కొమరంభీం జాతీయ అవార్డు
- నాగభైరవ కోటేశ్వరరావు పురస్కారం
- గురజాడ విశిష్ట పురస్కారం
- సినారె సాహిత్య పురస్కారం[16]
- కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం (2009లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లాశాఖ)[17]
సుద్దాల ఫౌండేషన్
మార్చు2010 అక్టోబరు 13లో సుద్దాల ఫౌండేషన్ ను ప్రారంభించి తన తల్లిదండ్రుల పేరిట సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారంను ఏర్పాటుచేసి ప్రతి ఏటా సాహిత్యంలో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఇప్పటివరకు బి. నర్సింగరావు, గద్దర్, డా. తీజన్ బాయి, ప్రొ. ఎన్ గూగి వాథియాంగో, సిరిసిల్ల రాజేశ్వరి[18], గూడ అంజయ్య,[19] వంగపండు ప్రసాదరావు,[20][21] గోరటి వెంకన్న,[22][23] జయరాజు,[24][25] ఆర్. నారాయణమూర్తి, అందెశ్రీ[26] లకు ఈ పురస్కారం అందజేయబడింది.
బయటి మూలాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "60th Anniversary Of The Struggle Celebrated". Pd.cpim.org. 2006-07-23. Archived from the original on 19 June 2009. Retrieved 2016-12-01.
- ↑ "శ్రీశ్రీని ఆవాహన చేసుకున్నా!". eenadu.net. ఈనాడు. 26 April 2018. Archived from the original on 26 April 2018. Retrieved 26 April 2018.
- ↑ భావరాజు, పద్మిని. "సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి". acchamgatelugu.com. Archived from the original on 26 December 2016. Retrieved 19 December 2016.
- ↑ "Suddala Ashok Teja". thetelugufilmnagar.com. Telugu Film Nagar. Retrieved 19 December 2016.[permanent dead link]
- ↑ ఈనాడు. "ఈ పురస్కారం ప్రజలకు అంకితం". Archived from the original on 15 August 2017. Retrieved 15 August 2017.
- ↑ India Today (5 January 2015). "18 Telugu icons named ambassadors for Swachh Bharat" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ "Tollywood lyric writer Suddala Ashok Teja to undergo liver transplant". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2021-03-04.
- ↑ "శ్రీశ్రీని ఆవాహన చేసుకున్నా!". Eenadu. 2018-04-26. Archived from the original on 26 April 2018. Retrieved 2021-03-04.
- ↑ "Suddala Ashok Teja Interview by Telugu Cinema | సుద్దాల అశోక్ తేజ". Suddala.wordpress.com. 27 August 2004. Retrieved 2016-12-01.
- ↑ http://suddala.wordpress.com/2004/08/27/suddala-ashok-teja-interview-by-telugu-cinema
- ↑ "The Hindu : National : Newcomer bags award for feature film". Hinduonnet.com. 2004-08-15. Archived from the original on 22 May 2010. Retrieved 2016-12-01.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "Metro Plus Hyderabad / Personality : Aali neeku dandame". The Hindu. 2004-10-05. Archived from the original on 2005-11-22. Retrieved 2016-12-01.
- ↑ India Today (24 May 2020). "Telugu lyricist Suddala Ashok Teja undergoes liver transplant, son Arjun donates a part of the organ" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: పలాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
- ↑ టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi Education (8 October 2022). "Sinare Literary Award: సుద్దాల అశోక్‌తేజకు సినారె సాహితీ పురస్కారం". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (January 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
- ↑ Telangana Today (16 January 2021). "Inspiring tale of Sircilla poet included in Maha school curriculum" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ ఆంధ్రజ్యోతి. "13న ప్రజా కవి గూడ అంజయ్యకు సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం". Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ డైలీహంట్. "వంగపండుకు సుద్దాల హనుమంతు పురస్కారం". Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ మేడ్ ఇన్ తెలంగాణ. "వంగపండుకు సుద్దాల హన్మంతు పురస్కారం". madeintg.com. Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ టీన్యూస్ (14 October 2017). "గోరటి వెంకన్నకు సుద్దాల పురస్కారం". Retrieved 21 October 2017.[permanent dead link]
- ↑ నవతెలంగాణ (14 October 2017). "గోరటికి సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం". Retrieved 21 October 2017.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (6 October 2018). "జయరాజ్‌కు సుద్దాల-జానకమ్మ పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019.
- ↑ ఈనాడు, తెలంగాణ (15 October 2018). "ప్రజా చైతన్యం తెచ్చిన కవి సుద్దాల హనుమంతు". www.eenadu.net. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019.
- ↑ telugu, NT News (2022-10-16). "అందెశ్రీకి సుద్దాల హనుమంతు పురస్కారం ప్రదానం". Namasthe Telangana. Archived from the original on 2022-10-16. Retrieved 2022-10-16.