ఉఖ్రుల్

మణిపూర్ లోని జిల్లా

మణిపూర్ 9 రాష్ట్రజిల్లాలలో ఉఖ్రుల్ జిల్లా ఒకటి. జిల్లావైశాల్యం 84 చ.కి.మీ. ఈ జిల్లా రాష్ట్రరాజధాని ఇంఫాల్కు ఈశాన్యంలో ఉంది.

Ukhrul district

Hunphun district
district
Location of ఉఖ్రుల్ in Manipur
Location of ఉఖ్రుల్ in Manipur
Country India
StateManipur
HeadquartersUkhrul
జనాభా
(2011)[1]
 • మొత్తం1,83,115
Languages
 • OfficialTangkhul Naga (Naga)
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)

చరిత్రసవరించు

మణిపూర్ రాష్ట్రంలోని ఈస్ట్ జిల్లాలో బ్రిటిష్ ప్రభుత్వ పలనా కాలంలో 1919 ఉప-విభాగంగా ఉన్న ఉఖ్రుల్ ప్రాంతాన్ని 1969 నుండి భారతప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది

తంగ్‌ఖుల్స్సవరించు

భాషాపరంగా తంగ్‌కుల ప్రజలు అతిపెద్ద సినో-టిబెటన్ కుటుంబానికి చెందునవారు. సినో-టిబెటన్ కుటుంబంలో సినో- టిబెటన్ కూడా ఒక ఉపవిభాగం. తంగ్‌కుల ప్రజల పూర్వీకం చైనా, టిబెట్ దేశాలకు ఆగ్నేయంలో ఉందని అంచనా. తంగ్‌కుల ప్రజలు ఆరంభంలో హుయాంగ్ హియో, యంగ్‌త్జె నదుల మద్య నివసించేవారు. ఇది చైనా లోని జింజీయాంగ్ భూభాగంలో ఉంది. మిగిలిన ఎడారి ప్రదేశాలలో నివసించే ప్రజలలాగే వీరుకూడా కష్టతరమైన జీవనసరళిని గడపవలసి వచ్చింది. ఈ పరిస్తుతులు ప్రజలను ఇతర ప్రదేశాలకు వలస పోయేలా చేసింది. ఇక్కడి నుండి తూర్పు, ఆగ్నేయ ప్రదేశాలకు తరలి వెళ్ళిన ప్రజలు చైనీయులుగానే గుర్తించబడ్డారు. దక్షిణ దిశగా తరలి వెళ్ళిన ప్రజలు టిబెటో- బర్మన్ గిరిజనతెగలుగా గుర్తించబడ్డారు. వీరిలో తంగ్‌కుల, ఇతర నగా ఉపవిభాగాలకు చెందిన వారు ఉన్నారు. క్రీ.పూ 10,000-800 వరకూ సాగిన ఈ వలసలు ప్రస్తుత చారిత్రక కాలం వరకు కొనసాగాయి. ఎస్.కె చటర్జీ క్రీ.పూ 2,000 నాటి విషయాలను క్రీడీకరించారు. సినో-టిబెటన్ మాట్లాడే వారు మరింతగా దక్షిణ - పడమటి దిశగా తరలి వెళ్ళి భారతదేశంలో ప్రవేశించారు. డబల్యూ.ఐ సింగ్ వ్రాసిన " మణిపూర్ చరిత్ర " (ది హిస్టరీ ఆఫ్ మణిపూరు) అనుసరించి తంగ్‌కులా ప్రజలు మయన్మార్ శాంషాక్ (తుయాంగ్‌దత్) ప్రాంతంలో స్థిరపడ్డారని పేర్కొన్నాడు. వారు చైనాలోని యక్ఖా గిరిజన తెగలకు చెందినవారని అభిప్రాయపడ్డారు. తంగ్‌కులా ప్రజలను ముందుగా మణిపురి రాజవశానికి చెందిన పొయిరైటన్ రాజు గుర్తుంచాడు.

తంగ్‌ఖుల్స్ స్థానికతసవరించు

తంగ్‌ఖుల్ నాగాలతో మయన్మార్ మార్గంలో ఇతర నాగాలు మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చేరారు. వీరిలో కొంతమంది మయన్మార్ దేశంలో స్థిరపడ్డారు. ఎలాగైతేనే భారతదేశాలోకి ఈ వలసలు కొన్ని సంవత్సరాల కాలం నిరంతరంగా కొనసాగింది. నాగాలు భారతదేశంలోకి ఒకరి తరువాత ఒకరు అలలుగా వచ్చిచేరారు. తంగ్‌ఖుల్ ప్రజలు తమతో మావోలు, పౌమీలు, మారాలు, తంగల్ తెగలను తీసుకువచ్చారు. అయినప్పటికీ వారంతా సేనాపతి జిల్లాలోని మఖెల్ గ్రామాలలో స్థిరపడ్డారు. నాగాలు మఖేల్ గ్రామంలో ఉన్న మెగాలిత్ ప్రజలను అక్కడి నుండి తరిమివేసారు. తంగ్‌ఖుల్ ప్రజలు తమపూర్వీకులు సముద్రతీరానికి చెందినవారని భావిస్తుంటారు. కాంసన్, హూయిసన్ వంటి ఆభరణాలలో సముద్రపు గవ్వలు చోటుచేసుకుంటాయి.

తంగ్‌ఖుల్స్ పూర్వీకంసవరించు

క్రీ.శ 2 వ శతాబ్దంలో తంఖుల్ ప్రజలు మయన్మార్ లోని సాంషక్ ( తుంయంగ్దత్) లో నివసించేవారు. గ్రీక్ జ్యోతిష్కుడు, భౌగోళికుడు అయిన ప్టోల్మి " జియోగ్రఫీ ఆఫ్ ఫర్దర్ ఇండియా "లో (క్రీ.శ 140) తంగ్‌ఖుల్ ప్రజలు (నంగలాగ్) ట్రిగ్లిప్టన్ (తుయాంగ్దత్) పేర్కొన్నాడు. క్రీ.శ కో- లో- ఫెంగ్, ఆయన తరువాత వచ్చిన వారసుడు 9వ శతాబ్దంలో చేసిన దండయాత్రల తరువాత తంగ్‌ఖుల్ ప్రజలను షాన్ ప్రజలచేత ఆప్రాంతం నుండి మయన్మార్ దేశంలోని నైరుతీ ప్రాంతాలకు తరలివెళ్ళారు.

తంగ్‌ఖుల్స్ స్వీయపాలనసవరించు

తంగ్‌ఖుల్ ప్రజలు ఇతర నాగా ప్రజలతో చైనా నుండి మయన్మార్కు చేరి తరువాత అక్కడి నుండి ప్రస్తుత ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ పయనంలో వారు మంచుతీకప్పబడిన ప్రాంతాలను, పర్వతప్రాంతాలను, వన్యమృగాలను, కృరమైన గిరిజన తెగలను ఎదుర్కొన్నారు. చైనాను విడిచి నాగాలు మాయన్మార్ తరువాత భారతదేశంలో ప్రవేశించి ఇక్కడే స్థిరపడం ఒక ధైర్యసాహసాలతో నిండిన వీరోచిత పోరాటమని భావించవచ్చు. తరువాత తంగ్‌ఖుల్ గ్రామం గ్రీక్ నగరంలాగా ఒక చిన్న స్వతంత్ర రాజ్యంలాగా ప్రకాశించింది. ప్రతి గ్రామం పెద్దల సమావేశాలు, సంప్రదాయాల స్వతంత్ర రాజ్యాంగంగా మారింది. తంగ్‌ఖుల్ గ్రామాలలో ఉప్పు తప్ప మిగిలిన అన్ని అవసరాలతో స్వయంసమృద్దిగా ఉండేవి. స్వయం పాలనా, ఎన్నిక చేయబడిన ప్రతినిధులు గ్రామపెద్దల సాయంతో పాలనా వ్యవహారాలను నిర్వహించడం కొనసాగింది. ప్రతినిధికి న్యాయనిర్ణయం, పాలనాధికారం వంటి బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించేవారు. అయినప్పటికీ జాతీయంగా బృహత్తర రాజ్యం లేకపోవడం వలన తంగ్‌ఖుల్ నాగాలు శక్తివంతమైన మెయిటీ రాజును ఎదుర్కొనడంలో విఫలులైయ్యారు.

తంగ్‌ఖుల్స్ పూర్వీకులుసవరించు

తరువాతి కాలంలో తంగ్‌ఖుల్ చరిత్ర నమోదు చేయబడనప్పటికీ 13వ శతాబ్దం నుండి సంస్కృతి, వ్యాపారం, లోయలోని ఇతర ప్రజలతో ఉన్న సంబంధాల కారణంగా తిరిగి వెలుగులోకి వచ్చారు. 13వ శతాబ్దంలో పాలించిన మెయిటీ సామ్రాజ్యానికి చెందిన తవంతబా (క్రీ.శ. 1195-1231) కాలంలో తంగ్‌ఖుల్ ప్రజల గురించిన ప్రస్తావన లభించింది. చారిత్రకాధారాలు పలు గిరిజన జాతుల మద్య నిరంతర దాడులు వంటి సంఘటనలు జరిగినట్లు తెలియజేస్తున్నాయి. తవంతబా చింగ్షాంగ్ తంగ్‌ఖుల గ్రామం మీద దండెత్తి దానిని ఓడించి దానిని కాల్చివేసాడు.

తంగ్‌ఖుల్స్ సంబంధాలుసవరించు

తంగ్‌ఖుల్ ప్రజలు, మెయిటీ రాజుల మద్య సదా రాజకీయ తోడ్పాటు, వ్యాపార సంబంధాలు ఉంటూ వచ్చాయి. నాగా సంప్రదాయాలు- సంస్కృతిలో కొన్నివిషయాలు నాగాల మీద మైదానం, పర్వతాలతో వారికున్న అనుబంధం కనిపిస్తుంది. ఏనుగు వస్త్రం, జంతుసంబంధిత డిజైన్లు కలిగిన వస్త్రాలను ధరించే అలవాటు మణిపూర్ రాష్ట్ర నాగాలలో ఉంది. 17వ శతాబ్దంలో మణిపూర్ పాలకుడు తన రాజకీయ నాగా సహచరులకు ఇటువంటి వస్త్రాలను బహూకరించారు. తంగ్‌ఖుల షాల్ చంగ్‌ఖొం (కరయోపి) మణిపూర్ రాష్ట్రంలో చక్కని గుర్తిపు పొందింది.

పంహెయిబసవరించు

శక్తివంతమైన మెయిటీ రాజు పాలనలో ఈ ప్రాంతం అధికశక్తియుతంగా ఉండేది. గరీబ్ నవాజ్ (1709-1748) తంగ్‌ఖుల్ మద్యప్రాంతాన్ని మణిపూర్ రాజ్యంలో చేరడానికి కారకుడయ్యాడు. 1716లో రాజు సైన్యాలు తంగ్‌ఖుల్ గ్రామమైన హండంగ్ గ్రామం మీద దాడిచేది 60 మంది వీరులను బంధీచేసాడు. 1733 లో రాజు ఉఖ్రుల్ మీదకు సైన్యాలను పంపి విజయం సాధించాడు. 2 మెయిటీ గ్రామాల అపజయంతో తంగ్‌ఖుల్ ప్రజలకు పర్వప్రాంతాల మీద ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసింది. రాజా గరీబ్ నవాజ్ నింజెక్ శిలాఫలకాలు ఈ ప్రాంతాన్ని " కుల్లక్పా ఓక్రుల్ " అని పేర్కొంటున్నాయి. తంగ్‌ఖుల్ రాజ్యానికి ఉఖ్రుల్ ప్రధాన కేంద్రంగా ఉండేది. ఉఖ్రుల్ లోని సోంసాయీ వద్ద ప్రతిసంవత్సరం నిర్వహించే సంతను " లెహ్ ఖంగ్ఫ " అంటారు.క్రీ.శ 1733 లో మెయిటీ రాజుల పతనం తరువాత తంగ్‌ఖుల్ రాజ్యం అంతమైంది.

భాగ్యచంద్రసవరించు

తరువాత ఈ పర్వప్రాంతం మీద భాగ్యచంద్ర (1759-1762, 1763-1798) ఆధిపత్యం కొనసాగింది. 1779 లో భాగ్యచంద్ర లాంగ్‌తబాల్ వద్ద కొత్త రాజధానిని నిర్మించాడు. అది ఇంఫాల్ నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. తరువాత 17 సంవత్సరాల కాలం లాంగ్‌తబాల్ రాజధాని నగరంగా కొనసాగింది. ఆయన పలు తంగ్‌ఖుల్, కబుయి నాగాలను రాజధాని చుట్టూ కందకం త్రవ్వడానికి నియమించాడు. తంగ్‌ఖుల్ ప్రయినిధులు, హండంగ్ ఖుల్లక్ప, ఉఖ్రుల్ ప్రజలు రాజుతో స్నేహసంబంధాలు కలిగి ఉన్నారు.

మెడియావాల్ కాలంసవరించు

మద్యయుగంలో తంగ్‌ఖుల్, మెయిటీ రాజుల సంబంధాలు యుద్ధాలు, విజయాలతో ఆగిపోలేదు. వారిరువురు పరద్పరం వ్యాపార, వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నారు. లోయలో తంగ్‌ఖుల్ ప్రజలు పత్తిని సరఫరా చేసారు. వీరు తమ వస్తువులను అమ్మడానికి ఇంఫాల్ లోని " సనకెయితిల్ " వద్దకు వెళ్ళేవారు. కగెంబా పాలనా కాలంలో (1597-1652) లో మొదటిసారిగా వెలువరించిన తంగ్‌ఖుల్ ప్రజలు కంచుతో చేసిన " సెల్" అనే నాణ్యాలను వాడుకున్నారు.

బ్రిటిష్ ఆధిపత్యంసవరించు

1834 జనవరి 9న బ్రిటిష్ ప్రభుత్వం, మయన్మార్ మద్య సరిహద్దులను నిర్ణయిస్తూ నిఘితీ (చింద్విన్) నదీతీరంలో ఒప్పందం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఉఖ్రుల్ ప్రాంతం కూడా తీవ్రంగా బాధించబడింది. 1950లో ఉఖ్రుల్, ఇంఫాల్ రహదారి ధ్వంసం అయినట్లు ఙానపీఠ్ అవార్డ్ గ్రహీత వ్రాతలలో ప్రస్తావించబడింది. ఉఖ్రుల్ పర్వతప్రాంతాలలో యుద్ధానికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తాయి. ప్రజలహృదయాలలో కూడా యుద్ధం ఏరోరిచిన గాయాలు సజీవంగా ఉన్నాయి.[2] ఉత్తర సరిహద్దు పర్వతపాదాల వద్ద మొదలై మొదటి పత్వతశ్రేణుల వైపు సాగుతుంది, తూర్పు సరిహద్దు చార్టర్, నాంగ్బీ, నాంఘర్, మునీపూరీ, లూహూప్పా, బర్మాలోని లాగ్వెంసంగ్ వరకు ఉంది. అవగాహన లేకుండా సరిహద్దును నిర్ణయించినందు వలన సోమరాహ్ పర్వతాలలో ఉన్న పలు తంగ్‌ఖుల్ గ్రామాలు బర్మాలో చేర్చబడ్డాయి. భారతదేశానికి, బర్మాకు స్వతంత్రం వచ్చాక తంగ్‌ఖుల్ గ్రామాలు రెండు దృశాల ఆధీనంలోకి వచ్చాయి.

భౌగోళికంసవరించు

ఉఖ్రుల్ పట్టణం ఉఖ్రుల్ జిల్లాకు కేంద్రంగా ఉండడమేగాక తంగ్‌కుల నాగాలకు చెందిన మొత్తం సంస్థలు ఉఖ్రుల్‌లోనే ఉన్నాయి. ఈ జిల్లాలో దాదాపు 75,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులకు సిహై ఫంగ్రెయి మరొక ప్రఖ్యాత కేంద్రంగా ఉంది.

విభాగాలుసవరించు

ఉఖ్రుల్ జిల్లా 5 ఉపవిభాగాలుగా విభజించబడింది. ఈ విభాగాలు తిరిగి 5 డెవెలెప్మెంటు బ్లాకులుగా విభజించబడ్డాయి. అదనంగా ఈ నిర్వహణా కేంద్రాలకు 4 సబ్- డెఫ్యూటీ కలెక్టర్లు నియమించబడ్డారు.[3]

ప్రయాణవసతులుసవరించు

జిల్లా కేంద్రం ఉఖ్రుల్ జాతీయరహదారి 150 ద్వారా రాష్ట్రరాజధాని ఇంఫాల్తో అనుసంధానించబడి ఉంది. ఈ రహదారి జిల్లాను కోహిమా జిల్లాతో అనుసంధానించబడి ఉంది. ఈ జిల్లాలో మణిపూర్ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన హిల్ స్టేషను ఉంది. జాతీయ రహదారితో ఉఖ్రుల్ - కంజాంగ్, ఉఖ్రుల్-ఫుంగ్యార్ రోడ్ వంటి ప్రధాన రహదార్లు ఉన్నాయి. తంపక్-ంగషన్ (మహాదేవ్) - ఫ్యుత్సిరో రోడ్డు జిల్లా పశ్చిమ భుభాగాన్ని జిల్లాకేంద్రంతో అనుసంధానిస్తున్నారు.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 183,115, [4]
ఇది దాదాపు సాయో టోం & ప్రింసీ దేశ జనసంఖ్యకు సమానం [5]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 593వ స్థానంలో ఉంది [4]
1చ.కి.మీ జనసాంద్రత 40.[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 30.07%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి 948:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 81.87%.[4]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

తంగ్‌ఖుల్ సంస్కృతిసవరించు

ఉఖ్రుల్ జిల్లాలో అత్యధికంగా నివసిస్తున్న ప్రజలు తంగ్‌ఖుల్. స్థానిక గిరిజనుల పురాణ కథనాలను అనుసరించి మెయిటీ కుటుంబంలో కొత్తగా శిశువు జనించిన ప్రతిసారి తమకుటుంబాన్ని అభివృద్ధిచేసినందుకు కుటుంబ పెద్దలు దేవునికి కృతఙతలు తెలుపుతారు. గిరిజనుల పురాణ కథనాలు మెయిటీ, తంగ్‌ఖుల్ గిరిజనతెగల మద్య ఉండే సాంస్కృతిక సంబంధాలను బలపరుస్తున్నాయి. ఈ జిల్లా నుండి అభివృద్ధి సరిగా జరగనప్పటికకీ ఈ జిల్లాలో జనించిన పలువురు ప్రబల వ్యక్తులు రాష్ట్ర కీర్తి గడించారు. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఈ జిల్లా ఇద్దరికి (యంగ్‌మాసో షైజా, రిషంగ్ కెయిషింగ్) జన్మనిచ్చింది. ఈశాన్య భూభాగం మొదటి అంబాసిడర్ " శ్రీ బాబ్ ఖాతింగ్ "కు ఈ జిల్లా జన్మ ఇచ్చింది. ఈశాన్య భూభాగం మొదటి వైస్ చాంసలర్, " సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఝార్ఖండ్ " వైస్ చాంసలర్ " ప్రొఫెసర్ డార్లండ్ ఖాతింగ్ " ఈ జిల్లాలోనే జన్మించాడు. రాష్ట్ర మొదట్ ఐ.ఏ.ఎస్, ఐ.ఎఫ్.ఎస్ అధికారులు (క్రిస్టియన్‌సన్ చిబ్బర్, ప్రిమ్‌రోస్ ఆర్. శర్మా ) కూడా ఈ జిల్లాకు చెందినవారే. రాష్ట్ర హిల్ జిల్లా అధికారి వచ్చిన ఐ.ఏ.ఎస్ అధికారి " అమెయిసింగ్ లుయిఖాం ", మొదటి గిరిజన లేడీ డాక్టర్ అయిన డాక్టర్ పాం షైజా, మొదటి గిరిజన ఇంజనీర్ " శ్రీ సిరాఫుయి మారినో " ఈ జిల్లాలో జనించిన వారే. అత్యున్నత సంస్కృతి కలిగిన తంగ్‌కుల్ స్వస్థలం ఉఖ్రుల్ జిల్లానే. తంగ్‌కుల్ అనే పేరును వారికి పొరుగున నివసిస్తున్న ప్రజలు మెటీలు ఇచ్చారు. ఉత్తర భూభాగంలో నివసిస్తున్న తంగ్‌కుల్ ప్రజలను లుహుపాలు అని కూడా పిలుస్తారు. నాగా అనే పేరును మయన్మార్ ప్రజలచేత ఇవ్వబడింది. నాగా అంటే మయన్మార్ భాషలో కుట్టిన చెవికమ్మలు అని అర్ధం. తంగ్‌కుల్ గిరిజన ప్రజలను చేర్చిన నాగాలలో చెవి కుట్టి కమ్మలు ధరించడం ఆచారంగా ఉంది.

సంస్కృతిసవరించు

పర్యాటక ఆకర్షణలుసవరించు

ఉఖ్రుల్ జిల్లాలో షిరుయి లిలీ వంటి ప్రకృతి సౌందర్య ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఖంగ్రుయి మాంగ్సర్ గుహలు కూడా ఒకటి. ఈ గుహలు భరతదేశంలో ఉన్న అతిపురాతనమైన గుహలలో ఒకటని భావిస్తున్నారు. జిల్లాకేంద్రం ఉఖ్రుల్ పట్టణం కూడా డంకన్ పార్కు, జపానీ మడుగు, పట్టణ దక్షిణ భూభాగంలో ఉన్న ఎల్షడై పార్క్, విహారప్రదేశం మెజెస్టిక్ ఫంగ్రెయి వంటి ప్రకృతి అందాలకు నిలయమే. జిల్లాలో ఖయంగ్ వంటి ప్రఖ్యాత జలపాతం, ఇతర పలు జలపాతాలకు ఈ జిల్లా నిలయం. మణిపూర్ రాష్ట్ర పర్యాటక కేంద్రాలలో ఈ జిల్లా ఒకటి. ఆదరపూర్వక సేవలకు ఉత్సవాలకు ఈ జిల్లా ప్రఖ్యాతి చెందింది. వివిధ గ్రామాలు, పట్టణాలలో మాసానికి ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. తంగ్‌కుల ప్రజల ప్రఖ్యాత ఉత్సవాలలో లుయిర (విత్తనాలు చల్లే పండుగ, మంగ్‌ఖాప్ (విశ్రాంతి విందు), తిషం (వీడ్కోల్ విందు), తరెయో ఉత్సవం (పంట కోతక పండుగ) వంటి ఉత్సవాలు ప్రధానమైనవి. ఇత్సవాల సమయంలో నోరూరించే తంగ్‌ఖుల్ వంటలకు లాంగ్పి గ్రామం ప్రసిద్ధి. రింగ్యి గ్రామం లుయిరా ఉత్సవం సమయంలో గ్రామంలో సంప్రదాయ నృత్యాలు ( బ్రైడల్ నృత్యం, కన్యల పెరేడ్ నృత్యం, పండుగ నృత్యం నరియు యుద్ధ నృత్యం), గితాలాపన జరుగుతుంటాయి. ఈ ఉత్సవసమయంలో జరిగే యుద్ధనృత్యం చాలా ఖ్యాతిని పొందింది.రొంగ్యి గ్రామం తంగ్‌కుల్ చిత్రనిర్మాణం, సంగీతం, నాటకాలకు ప్రసిద్ధి.

వృక్షజాలం, జంతుజాలంసవరించు

ఉఖ్రుల్ జిల్లా షిరుయి లిల్లీలకు (" లిలియుం మాక్లినీస్ " సీలి) ప్రసిద్ధి. ఈ పూలు సహజంగా షిరుయి కషాంగ్ శిఖరం మీద కనిపిస్తాయి. ఇది జిల్లకేద్రానికి తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.అలాగే మాంగ్సర్ గుహ పట్టణానికి 16 కి.మీ దూరంలో ఉంది.

విద్యసవరించు

ఆరంభకాలంలో ఈ ప్రాంతంలో విద్యావకాశాలు అరుదుగా లభించేది. ప్రస్తుతం ఈశాన్య భుభాగంలోని పలుజాతులకు చెందిన గిరిజనతెగలకు చెందిన ప్రజలకు ఉఖ్రుల్ జిల్లాలో విద్యావకాశాలు లభిస్తున్నాయి. 1896లో ఇక్కడ మిషనరీకి చెందిన రెవ్ విలియం పెట్టింగ్రూ మొదటి పాఠశాలను ఆరంభించారు. తరువాత పలు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించబడ్డాయి. తరువాత జిల్లా నుండి పలురంగాలకు చెందిన పలువురు ప్రఙాశాలులను, వృత్తి ఉద్యోగస్తులు వెలువడ్డారు. ప్రఖ్యాత " డిల్లీ యూనివర్శిటీ "లో పనిచేసిన ప్రొఫెసర్ .హోరం స్వస్థలం ఈ జిల్లానే. ప్రస్తుతం జిల్లాలో 90% అక్షరాస్యత ఉంది. ఉఖ్ర్రుల్ జిల్లా విద్యావకాశాలలో మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని ఇంఫాల్ తరువాత స్థానంలో ఉంది. పట్టణంలో గుర్తింపు పొందిన పాఠశాలలలో సవియో స్కూల్, బ్లెస్సో మాంటెస్సరీ స్కూల్, హోలీ స్పిరిట్ స్కూల్, పత్కై అకాడమీ, జూనియర్స్ అకాడమీ, సెంటినెల్ కాలేజ్, సెయింట్ జాన్ స్కూల్, లిటిల్ ఎంజిల్స్ స్కూల్, పెటిగ్ర్యూ కాలేజ్, కేంద్రియ విద్యాలయా, జవహర్లాల్ నవోదయ విద్యాలయా ముఖ్యమైనవి. అందువలన తంగ్‌కులాలు అధికంగా విద్యావంతులైన సమూహంగా ఎదిగారు. అంతేకాక క్రమంగా వారు తమ సంప్రదాయబద్ధమైన జీవితానికి దూరమయ్యారు. ప్రస్తుతం పలు గ్రామాలు సంప్రదాయబద్ధమైన జీవితానికి అద్దంపడుతున్నాయి. 1936లో తంగ్‌కుల్ విద్యార్ధుల సమావేశంలో " తంగ్‌కుల నాగా లాంగ్ " పేరిట అంగ్‌కుల నాగాలకే ప్రత్యేకమైన న్యావిధానాలలు ప్రవేశపెట్టారు. ఈ న్యాయనిర్ణయ పరిధిలోకి నాగాగిరిజన తెగలనేకం చేర్చబడ్డాయి. ప్రస్తుతం ఈ సమూహంలో తలెత్తుతున్న సంస్కృతి సంబంధిత, ఇతర వివాదాలను తంగ్‌కుల నాగా లాంగ్ కోర్టులు పరిష్కరిస్తున్నాయి.

మూలాలుసవరించు

  1. "Ukhrul District". OurVillageIndia.com.
  2. Janavahini(preface):Birendra Kumar Bhattacharya:sahitya akademy press:1983
  3. "Administrative Setup". Ukhrul District of Manipur.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Sao Tome and Principe 179,506 July 2011 est. line feed character in |quote= at position 22 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉఖ్రుల్&oldid=2860982" నుండి వెలికితీశారు