ఉగాండాలో హిందూమతం

19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దపు ప్రారంభంలో వలసవాద బ్రిటిష్ సామ్రాజ్యం తన తూర్పు ఆఫ్రికా కాలనీలకు భారతీయ కార్మికులను తీసుకువచ్చినప్పుడు ఉగాండాలోకి హిందూమతం ప్రవేశించింది. [1][2] ఉగాండాకు హిందూ వలసదారుల్లో కొంతమంది విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవారు. కానీ చాలా మంది పేదవారు. పంజాబ్, గుజరాత్‌లోని కరువు పీడిత ప్రాంతాల నుండి వచ్చినవారు. భూ పరివేష్ఠిత ఉగాండా, కెన్యా ల్లోని ప్రాంతాలను ఓడరేవు నగరమైన మొంబాసాతో కలుపుతూ వేస్తున్న కెన్యా-ఉగాండా రైల్వేలో పని చేయడం కోసం వాళ్ళను తీసుకువచ్చారు. [3] [4] 1972లో జనరల్ ఇడి అమీన్ వారిని బహిష్కరించి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో ఉగాండా నుండి హిందువుల అతిపెద్ద నిష్క్రమణ జరిగింది. [5] [4] [6]

శ్రీ సనాతన్ ధర్మ మండల దేవాలయం కంపాలా

ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడంతో పాటు, బ్రిటిష్ తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు కార్మికుల ప్రపంచవ్యాప్త తరలింపులో హిందువులు భాగమయ్యారు. బ్రిటీష్ ప్రభుత్వానికి సేవలు, రిటైల్ మార్కెట్ల లోను, పరిపాలనలో మద్దతును స్థాపించడంలోనూ సహాయపడే నిమిత్తం ఈ తరలింపులు జరిపింది. [7][8] [9] స్థానికంగా నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో లేకపోవడంతో బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను ఆహ్వానించారు. ఉగాండా-కెన్యాలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, భారతదేశం నుండి 32,000 మందిని తీసుకువచ్చారు. [10] ఈ ప్రాజెక్టుల సమయంలో కష్టమైన, భద్రత లేని పని పరిస్థితుల కారణంగా దాదాపు 2,500 మంది కార్మికులు మరణించారు. ప్రాజెక్టు ముగిసిన తర్వాత, దాదాపు 70% మంది కార్మికులు భారతదేశానికి తిరిగి వచ్చేయగా, దాదాపు 6,000 మంది అక్కడే రైల్వే, రిటైల్, పరిపాలన వంటి ఇతర బ్రిటిష్ కార్యకలాపాలలో మునిగిపోయారు. [10] [11] అలా మిగిలిపోయిన వారిలో హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు ఉన్నారు. ఈ జాతికి చెందిన వారిలో చాలా మంది ఆర్థికంగా విజయం సాధించారు. [12]

జనాభా వివరాలు

మార్చు

ARDA ప్రకారం, 2015లో ఉగాండాలో దాదాపు 3,55,497 (0.93%) మంది హిందువులు ఉన్నారు [13]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
197065,000—    
20153,55,497+446.9%
సంవత్సరం శాతం మార్పు
1970 0.69% -
2015 0.93% +0.24%

ఈదీ అమీన్ హిందువులను, ఇతర ఆసియన్లనూ బహిష్కరించడం

మార్చు
 
జనరల్ ఇదీ అమీన్ 1972లో హిందువులు, ఇతర ఆసియన్లందరినీ ఉగాండా నుండి బహిష్కరించాడు. ఇరవై సంవత్సరాల తర్వాత, ఉగాండా అప్పటి చట్టాన్ని రద్దు చేసింది.

వలసపాలన ముగిసిన తర్వాత, ఉగాండాతో సహా తూర్పు ఆఫ్రికాలోని హిందువులు (జైనులు, సిక్కులతో పాటు) వివక్షకు గురయ్యారు. ఇది తూర్పు ఆఫ్రికా లోని వివిధ ప్రభుత్వాల విధానాలలో భాగంగా జరిగింది. ఆఫ్రికనీకరణను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్థిక వ్యవస్థలోని వాణిజ్య, వృత్తిపరమైన రంగాలు స్వదేశీ ఆఫ్రికన్ల యాజమాన్యంలోనే ఉండాలని చట్టాలు, విధానాలను రూపొందించారు. [14] [15] ఆఫ్రికన్ నాయకులు ఆసియన్లు, యూరోపియన్లే లక్ష్యంగా చేసుకున్న ఈ కాలంలో జైనులు, సిక్కులు, యూదులు, ఇతర మత సమూహాలతో పాటు హిందువులు కూడా ప్రభావితమయ్యారు. [16] [17] [18]

ఉగాండాలో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా జనరల్ ఇడి అమీన్ అధికారంలోకి వచ్చినప్పుడు, అతను ఆసియా మతాల ప్రజలకు వ్యతిరేకంగా మతపరమైన, జాతి ప్రక్షాళన విధానాన్ని అనుసరించాడు. స్వయంగా ముస్లిమైన అమీన్, తనకు ఒక కల ఉందని ప్రకటించాడు. ఆ కలలో "ఆఫ్రికన్లతో కలిసిపోవడానికి ఇష్టపడని ఆసియన్లు, దోపిడీదారులు దేశాన్ని వీడి వెళ్ళవలసి ఉంటుందని అల్లా అతనికి చెప్పాడు". [19] [20] [21] 1972లో, అతను ఉగాండా నుండి ఇతర ఆసియన్లతో పాటు హిందువులను ఎంచుకుని, దేశం నుండి బహిష్కరించి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. [22] బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది రెండవ లేదా మూడవ తరం హిందువులు. వారిలో చాలా మందికి ఉగాండా బ్రిటిష్ పౌరసత్వాలు రెండూ ఉన్నాయి. అతను భారత మూలాలున్న హిందువులను ఇతర మతాల ప్రజలను బహిష్కరించిన ఇడీ అమీన్, బ్రిటిష్ లేదా ఫ్రెంచ్ మూలాలకు చెందిన క్రైస్తవులను బహిష్కరించలేదు. [22]

ంకాస్టర్ యూనివర్శిటీలో రిలిజియస్ అండ్ సెక్యులర్ స్టడీస్ ప్రొఫెసర్ కిమ్ నాట్ ప్రకారం, 1970లో ఉగాండాలో 65,000 మంది హిందువులు ఉన్నారు. వారందరినీ ఇడి అమీన్ బహిష్కరించాడు. [23] బహిష్కరించబడిన హిందువులు ఈ కాలంలో ఇతర దేశాలకు వలస వెళ్లారు. [24] [25] ముఖ్యంగా యునైటెడ్ కింగ్‌డమ్ (28,000 మంది శరణార్థులు [note 1]), భారతదేశం (15,000 మంది శరణార్థులు), కెనడా (8,000 మంది శరణార్థులు), యునైటెడ్ స్టేట్స్ (1,500 మంది శరణార్థు) లకు వెళ్ళగా ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలకు తక్కువ సంఖ్యలో వెళ్ళారు. [28] [26] ఈ బహిష్కరణలతో ఉగాండా "పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కళాకారు,లు పౌర సేవకులను" దేశం నుండి తొలగించిందని క్రిస్టోఫర్ సెనియోంజో పేర్కొన్నాడు. వారి ఆస్తులు ఇడి అమీన్‌కు మద్దతు ఇచ్చే పౌరులకు, ఉగాండా ఆర్మీ అధికారులకూ తిరిగి కేటాయించారు. [29] ఆ తరువాత వైద్యులు, బ్యాంకర్లు, నర్సులు, ఉపాధ్యాయులు వంటి నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను ఉగాండా ఎదుర్కొంది. ఇది ఆర్థిక సంక్షోభానికీ, సిమెంటు చక్కెర ఉత్పత్తితో సహా వ్యాపారాల పతనానికి దారితీసింది. ఉగాండాలో దీర్ఘకాలిక ఆర్థిక వినాశనానికి కారణమైంది. [30]

ఇదీ అమీన్ అనంతర పరిస్థితులు

మార్చు

ఉగాండా హిందువులు, ఇతర మతస్థులైన భారతీయులను ఇడి అమీన్ బహిష్కరణ చేసిన ఇరవై సంవత్సరాల తర్వాత ఉగాండా, ఆ చట్టాలను మార్చింది. [31] ప్రపంచ బ్యాంక్ సహకారంతో అందించబడిన ఈ కొత్త విధానం ప్రకారం, ఇడి అమీన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఖాళీ, ఉపయోగించని ఫ్యాక్టరీల వంటి ఆస్తులను ఆయా కుటుంబాలకు తిరిగి అప్పగిస్తారు - ఆ కుటుంబీకులు దేశానికి తిరిగి వచ్చి ఉపాధిని సృష్టించినట్లయితే. [32]

దాదాపు 2.7 కోట్ల ఉగాండా జనాభాలో హిందువులు చిన్నపాటి మైనారిటీ. అధికారిక జనగణనలో క్రైస్తవులు, ముస్లింలను విడివిడిగా లెక్కిస్తారు. అయితే హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, సాంప్రదాయ ఆఫ్రికన్ మతస్థులను "ఇతరులు"లో కలిపేస్తారు. ఉగాండాలో నివసిస్తున్న దక్షిణాసియా వాసుల్లో దాదాపు 65% మంది హిందువులు. [33] కంపాలాలో స్వామినారాయణ దేవాలయం ఉంది. [34]

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు
  1. These numbers are total, and include non-Hindus from Asia who were expelled, such as Sikhs.[26][27]

మూలాలు

మార్చు
  1. Sushil Mittal; Gene Thursby (2009). Studying Hinduism: Key Concepts and Methods. Routledge. pp. 87–88. ISBN 978-1-134-41829-9.
  2. Kim Knott (2016). Hinduism: A Very Short Introduction. Oxford University Press. pp. 91–92. ISBN 978-0-19-874554-9.
  3. Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. pp. 10–11. ISBN 978-0-8160-7564-5.
  4. 4.0 4.1 Malory Nye (2013). A Place for Our Gods: The Construction of an Edinburgh Hindu Temple Community. Routledge. pp. 48–50. ISBN 978-1-136-78504-7.
  5. Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. pp. 10–11. ISBN 978-0-8160-7564-5.
  6. David S. Fick (2002). Entrepreneurship in Africa: A Study of Successes. Greenwood Publishing. p. 199. ISBN 978-1-56720-536-7.
  7. Sushil Mittal; Gene Thursby (2009). Studying Hinduism: Key Concepts and Methods. Routledge. pp. 87–88. ISBN 978-1-134-41829-9.
  8. Kim Knott (2016). Hinduism: A Very Short Introduction. Oxford University Press. pp. 91–92. ISBN 978-0-19-874554-9.
  9. David Levinson; Karen Christensen (2003). Encyclopedia of Community: From the Village to the Virtual World. Sage Publications. p. 592. ISBN 978-0-7619-2598-9.
  10. 10.0 10.1 Wolmar, Christian (2009). Blood, Iron & Gold: How the Railways Transformed the World. London: Atlantic. pp. 182–183.
  11. Otte, T. G.; Neilson, Keith (2012). Railways and International Politics: Paths of Empire, 1848–1945. Military History and Policy. London: Routledge. pp. 8–9. ISBN 9780415651318.
  12. Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. pp. 10–11. ISBN 978-0-8160-7564-5.
  13. "Uganda, Religion And Social Profile". thearda.com. Archived from the original on 2021-08-26. Retrieved 2022-01-26.
  14. Steven Vertovec (2013). "Chapter 4". The Hindu Diaspora: Comparative Patterns. Taylor & Francis. pp. 87–89. ISBN 978-1-136-36712-0.
  15. Ndlovu-Gatsheni, Sabelo J.; Ndhlovu, Finex (2013). Nationalism and National Projects in Southern Africa: New Critical Reflections. Africa Institute of South Africa. pp. 62–74. ISBN 978-0-7983-0395-8.
  16. Ronald Aminzade (2013). Race, Nation, and Citizenship in Postcolonial Africa: The Case of Tanzania. Cambridge University Press. pp. 89–90. ISBN 978-1-107-43605-3.
  17. John E. Roemer; Woojin Lee; Karine van der Straeten (2007). Racism, Xenophobia, and Distribution: Multi-issue Politics in Advanced Democracies. Harvard University Press. pp. 147–148. ISBN 978-0-674-02495-3.
  18. Harold G. Coward; John R. Hinnells; Raymond Brady Williams (2012). The South Asian Religious Diaspora in Britain, Canada, and the United States. State University of New York Press. pp. 80–81. ISBN 978-0-7914-9302-1.
  19. M.G. Vassanji (2012). No New Land. McClelland & Stewart. p. 25. ISBN 978-1-55199-707-0.
  20. John S. Pobee (1976). Religion in a Pluralistic Society. BRILL Academic. pp. 40–41. ISBN 90-04-04556-2.
  21. E. Khiddu-Makubuya, Victoria Miriam Mwaka and P. Godfrey Okoth (1994). Uganda, thirty years of independence, 1962–1992. Makerere University Press. p. 243.
  22. 22.0 22.1 Jean-Marie Henckaerts (1995). Mass Expulsion in Modern International Law and Practice. Martinus Nijhoff Publishers. pp. 22–25. ISBN 90-411-0072-5.
  23. Kim Knott (2016). Hinduism: A Very Short Introduction. Oxford University Press. p. 114. ISBN 978-0-19-106271-1.
  24. Sushil Mittal; Gene Thursby (2009). Studying Hinduism: Key Concepts and Methods. Routledge. pp. 87–88. ISBN 978-1-134-41829-9.
  25. Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. pp. 10–11. ISBN 978-0-8160-7564-5.
  26. 26.0 26.1 P. Panayi; P. Virdee (2011). Refugees and the End of Empire: Imperial Collapse and Forced Migration in the Twentieth Century. Palgrave Macmillan. pp. 42–43. ISBN 978-0-230-30570-0.
  27. Pashaura Singh; Louis E. Fenech (2014). The Oxford Handbook of Sikh Studies. Oxford University Press. pp. 499–500. ISBN 978-0-19-100411-7.
  28. Malory Nye (2013). A Place for Our Gods: The Construction of an Edinburgh Hindu Temple Community. Routledge. pp. 48–50. ISBN 978-1-136-78504-7.
  29. Christopher Senyonjo (2016). In Defense of All God’s Children: The Life and Ministry of Bishop Christopher Senyonjo. Church Publishing. p. 42. ISBN 978-0-8192-3244-1.
  30. C. Davis (2013). Creating Postcolonial Literature: African Writers and British Publishers. Springer. p. 56. ISBN 978-1-137-32838-0.
  31. Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. pp. 10–11. ISBN 978-0-8160-7564-5.
  32. David S. Fick (2002). Entrepreneurship in Africa: A Study of Successes. Greenwood Publishing. p. 199. ISBN 978-1-56720-536-7.
  33. Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. pp. 10–11. ISBN 978-0-8160-7564-5.
  34. BAPS Shri Swaminarayan Mandir, BAPS Swaminarayan Sanstha, Africa