ఉడుము

ఉడుము (వారనస్ కొమోడోయెన్సిస్) ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి జాతి

ఉడుము (వారనస్ కొమోడోయెన్సిస్[2]) ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి జాతి.[3] ఇవి ఇండోనేషియాలోని కొమోడో, రింగా, ఫ్లోర్స్, గిలి మోటాంగ్, పాడర్ దీవులలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఉడుము
ఇండోనేషియాలోని ఉడుము
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
అనిమాలియా
Phylum:
చోర్డాటా
Class:
రెప్టిలియా
Order:
స్క్వామాటా
Family:
వరనిడే
Genus:
వారనస్
Species:
వి. కోమోడోయెన్సిస్
Binomial name
'వారనస్ కొమోడియెన్సిస్'
పీటర్ ఓవెన్స్, 1912[1]
ఉడుము పరివర్తన
ఇండోనేషియా జారీ చేసిన 50 రూపాయల నాణెంపై ఉడుము బొమ్మ

వివరణ సవరించు

పెద్ద ఉడుము గరిష్టంగా 3 మీటర్లు (10 అడుగులు) వరకు పెరుగుతుంది, సుమారు 70 కిలోగ్రాముల (150 పౌండ్లు) బరువు ఉంటుంది. మగ ఉడుము 79 నుండి 91 కిలోల బరువు, పొడవు 2.59 మీ (8.5 అడుగులు), ఆడ ఉడుము 68 నుండి 73 కిలోల బరువు, 7.5 మీ (7.5 అడుగులు) పొడవు ఉంటుంది. వీటికి 60 ముతక దంతాలు ఉంటాయి. వీటి జీవితకాలం సుమారు 30 సంవత్సరాలు.[4]ఉడుము దాని భారీ శరీర పరిమాణం, శక్తివంతమైన కాళ్ళకు ప్రసిద్ధి చెందింది. ఉడుము చాలా జాతులు వాటి పాదాలలో బలమైన పంజాలను కలిగి ఉంటాయి. ఇవి చెట్లు కూడా ఎక్కుతాయి. ఉడుము తోక దాని శరీర పరిమాణం కంటే రెండు రెట్లు ఎక్కువ.

ఇవి పొడవైన నాలుకను కలిగి ఉంటాయి, అది రెండుగా విభజించబడి ఉంటుంది, దీనికి మొత్తం 29 వెన్నుపూసలు ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన చెవి రంధ్రాలను కలిగి ఉంటాయి. పగటిపూట వేటాడే చురుకైన మాంసాహారులలో ఉడుము ఒకటి.

ఆహారం సవరించు

ఇవి గుడ్లు, చిన్న సరీసృపాలు, చేపలు, పక్షులు, కీటకాలు, చిన్న క్షీరదాలను తింటాయి, కొన్ని అవి నివసించే ప్రదేశాన్ని బట్టి పండ్లు, వృక్షాలను కూడా తింటాయి.

పరిరక్షణ సవరించు

మానవ కార్యకలాపాల కారణంగా ఉడుములు అడవిలో తగ్గిపోతున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఉడుమును అంతరించిపోతున్న జాతిగా పరిగణించింది. వీటిని కాపాడాడనికి ఇండోనేషియా ప్రభుత్వం కొమోడో నేషనల్ పార్క్ ఏర్పాటు చేసింది. ప్రపంచంలోని 31 ఉడుము జాతులలో, నాలుగు భారతదేశానికి చెందినవి ఉన్నాయి. అవి: బెంగాల్ ఉడుము, ఎరుపు ఉడుము, ఎడారి ఉడుము, పసుపు ఉడుము. ఈ నాలుగు కూడా అంతరించిపోయే, ప్రమాదంలో ఉన్న జాతులు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ I కింద ఇవి రక్షించబడుతున్నాయి, అంటే ఎవరైనా వాటిని ట్రాప్ చేసినా లేదా చంపినా పట్టుబడితే రూ. 25,000 జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.[5]

మూలాలు సవరించు

  1. Ouwens, P.A. (1912). "On a large Varanus species from the island of Komodo". Bull. Jard. Bot. Buit. 2 (6): 1–3.
  2. "ITIS - Report: Varanus komodoensis". www.itis.gov. Retrieved 2023-06-05.
  3. "Monitor Lizard". VEDANTU. Retrieved 2023-06-05.
  4. "Komodo dragon | Venom, Size, Bite, & Facts | Britannica". www.britannica.com. Retrieved 2023-06-05.
  5. "Udumu Sastram In Telugu: ఉడుము శాస్త్రం గురించి వివరణ తెలుగులో - VoiceOfAndhra - తెలుగు Latest News | Online Telugu News". 2022-07-27. Retrieved 2023-06-05.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉడుము&oldid=3912927" నుండి వెలికితీశారు