ఉత్ప్రేరకాలు
రసాయన చర్యలో పాల్గొనకుండ చర్యా వేగాన్ని పెంచే పదార్థాలను ఉత్ప్రేరకాలు (catalysts) అంటారు. జీవరసాయన శాస్త్రంలో ఉత్ప్రేరకాలని అజములు (enzymes) అంటారు.[1]

సాధారణంగా ఉత్ప్రేరక సమక్షంలో రసాయన చర్యలు వేగంగా జరుగుతాయి. ఎందుకనగా అవి తక్కువ క్రియాశీల శక్తి ని కలిగి ఉంటాయి. ఉత్ప్రేరక సమక్షంలో సాధారణంగా రసాయన చర్య వేగం పెరుగుతుంది.
ఉదాహరణకు ఆమ్లజనిని తయారు చేయునపుడు సాధారణంగా పొటాషియం పర్మాంగనేట్(సినాల రంగు) ను వేడి చేయుట ద్వారా తయారు చేస్తారు. ఈ చర్య జరగడానికి కొంత వ్యవధి పడుతుంది. ఈ చర్యా వేగాన్ని పెంచుటకు చర్య జరిగేటప్పుడు క్రియా జనకాలు అయిన పొటాషియం పర్మాంగనెటుకు మాంగనీస్ డై ఆక్సైడ్ కలిపి వేడి చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల చర్యా వేగం పెరిగి ఆమ్లజని వెంటనే తయారవుతుంది. ఈ చర్యలో మాంగనీస్ డై ఆక్సైడ్ రసాయన చర్యలో పాల్గొనదు. కాని చర్యా వేగాన్ని పెంచుతుంది.
నిత్య జీవితం లో అనువర్తనాలు సవరించు
- అసంతృప్త నూనె లను సంతృప్త క్రొవ్వులుగా మార్చు విధానంలో - అనగా, నూనెలని ఉదజనీకరణం చేయునపుడు, ఉత్రేరకంగా నికెల్ ను వాడతారు.
మూలాలు సవరించు
- ↑ 7 things you may not know about catalysis Louise Lerner, Argonne National Laboratory (2011)