ఉత్సవమూర్తి

(ఉత్సవ విగ్రహాలు నుండి దారిమార్పు చెందింది)

ఉత్సవమూర్తిని సంస్కృతంలో ఉత్సవార్ అంటారు. ప్రధానంగా హిందూ మతానికి సంబంధించిన ఉత్సవాలలో ఉపయోగించే దేవతా విగ్రహాలను ఉత్సవమూర్తులు లేక ఉత్సవ విగ్రహాలు అంటారు. పండుగల సమయంలో, తిరునాళ్ల సమయంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేస్తారు. ఉత్సవ విగ్రహాలను ముఖ్యంగా లోహంతో తయారు చేస్తారు.[1] భక్తులు దేవాలయంలోని మూలవిరాట్‍ను పూజించినట్లే ఉత్సవమూర్తులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

నాచియార్ దేవాలయంలో దేవుని ఉత్సవ విగ్రహం రాతితో తయారు చేయబడింది.

ఈ ఉత్సవ మూర్తిని ఇది సాధారణంగా ఆలయ గర్భగుడిలో ప్రధాన విగ్రహానికి దగ్గరగా ఉంచుతారు. మూలవిరాట్టుతో సంబంధసూత్రం అనే బంగారు దారం ద్వారా అనుసంధానిస్తారు. ఈ ఉత్సర మూర్తిని గర్భగుడి వెలుపల అర్థ మండపం లేదా సుకనాసి అనే ప్రత్యేక మందిరంలో కూడా ఉంచుతారు.[2]

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Baldev Raj, C. Rajagopalan, C. V. Sundaram. Where gods come alive: a monograph on the bronze icons of South India.
  2. "Utsavamurti - Hindupedia, the Hindu Encyclopedia". www.hindupedia.com. Retrieved 2021-04-06.