కొండ బిట్రగుంట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బోగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది బోగోలు మండలంలో తూర్పు వైపున బంగాళాఖాతం సరిహద్దులో ఉంది.

కొండ బిట్రగుంట
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొండ బిట్రగుంట is located in Andhra Pradesh
కొండ బిట్రగుంట
కొండ బిట్రగుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°47′56″N 79°59′10″E / 14.798750°N 79.986044°E / 14.798750; 79.986044
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం బోగోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524 101
ఎస్.టి.డి కోడ్ 08624

ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన పురాతన శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం కొండమీద ఉంది. సుమారు 850 సంవత్సరాల క్రితం, చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకుంటారు. దీనిని "బిలకూటక్షేత్రం" అంటారు. ఇక్కడ దేవుడు కొండ మీద వెలసి ఉంటాడు. కొండ మీద వేంకటేశ్వర స్వామి ఆలయము, లక్ష్మీ దేవి ఆలయము ఉంది. వేంకటేశ్వర స్వామి ఆలయము ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయము ఉంది. ఆ ప్రాంగణములోనే కృష్ణుని ఆలయము, నవగ్రహాలు ఉన్నాయి. నారదమహర్షి కొండబిట్రగుంట బిలంలో తపస్సు చేసి విముక్తి పొందిన ప్రాంతంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. నారదమహర్షి ఆలయము కొండకి కొంచెం క్రింద భాగాన ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసంలో, స్వామివారి తిరునాళ్ళు, ఏడు రోజులపాటు వైభవంగా జరుగును. ఫాల్గుణ పౌర్ణమిరోజున స్వామివారి కళ్యాణం, తరువాత రథోత్సవం నిర్వహించెదరు. దాదాపు 4 లక్షల మంది జనం, ఈ తిరునాళ్ళను సందర్శిస్తారు.

ఈ దేవాలయానికి సమీపంలో శ్రీ షిర్డి శేషసాయి బాబా మందిరము ఉంది. ఈ మందిర వ్యవస్థాపకులు కుట్టుబోయిన బ్రహ్మానందం. ఇక్కడ ప్రతి గురువారము భజనలు, పల్లకి సేవ జరుగుతుంది.ప్రతి ఆదివారము అన్నదానకార్యక్రమము జరుగుతున్నది.

ఈ గుడి ప్రక్కన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.

బిలకూటక్షేత్రంలో ఇకనుండి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు . కోరిన భక్తులు కనీసంగా రు.1116-00 చెల్లించి ఈ కార్య్క్రమంలో పాల్గొనవచ్చును. అన్నదానం జరిగిన రోజున గుడిలో దాత పేరుతో పూజలు నిర్వహించెదరు.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు