ఉదల్గురి
ఉదల్గురి, అస్సాం రాష్ట్రంలోని ఉదల్గురి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.
ఉదల్గురి | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°44′43″N 92°05′46″E / 26.7452°N 92.0962°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | ఉదల్గురి |
Government | |
• Body | ఉదల్గురి పురపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 4.69 కి.మీ2 (1.81 చ. మై) |
Elevation | 180 మీ (590 అ.) |
జనాభా (2011) | |
• Total | 15,279 |
భాషలు | |
• అధికారిక | బోడో భాష |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 784509 |
టెలిఫోన్ కోడ్ | 03711 XXXXXX |
Vehicle registration | ఏఎస్-27 |
పద వివరణ
మార్చుఉదల్గురి అనే పేరు 'ఓడాల్ చెట్టు' నుండి వచ్చిందని కొందరు, ఉద్దలక్ ముని అనే రుషి ఇక్కడ ఉన్నందున ఈ ప్రాంతానికి ఉదలగురి అనే పేరు వచ్చిందని మరికొందరి చరిత్రకారుల అభిప్రాయం. 'ఓర్డ్లా+ గుంద్రీ' (ఓర్డలగుంద్రి > ఓర్డలగుండి > ఒడాల్గురి > ఉదలగురి) అనే రెండు బోడో భాష పదాల నుండి వచ్చిందని మరికొందరి నమ్మకం. బోడో ప్రజలు ఇప్పటికీ దీనిని ఓదల్‌గురి అని పిలుస్తారు. బోడో భాషలో 'ఓర్డ్లా' అంటే విశాలమైనదని, 'గుంద్రీ' అంటే పొడి వస్తువని అర్థం.[1]
భౌగోళికం
మార్చుఉదల్గురి పట్టణం 26°44′43″N 92°05′46″E / 26.7452°N 92.0962°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్ర మట్టానికి 180 మీటర్ల (590 అడుగుల) ఎత్తులో ఉంది. పట్టణ విస్తీర్ణం 4.69 చ.కి.మీ. (1.81 చ.మై.) ఉంది.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉదల్గురి పట్టణంలో 15,279 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 52% మంది, స్త్రీలు 48% మంది ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 74% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీ అక్షరాస్యత 67%గా ఉంది. పట్టణ జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[1]
రాజకీయాలు
మార్చుఉదల్గురి పట్టణం, మంగల్‌దాయి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోఉంది.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "District Profile | Udalguri District | Government Of Assam, India". udalguri.assam.gov.in. Archived from the original on 2021-04-23. Retrieved 2020-12-24.
- ↑ Falling Rain Genomics, Inc – Odalguri
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-12-24.