ఉపేంద్రగాడి అడ్డా
ఉపేంద్రగాడి అడ్డా 2023లో విడుదలకానున్న తెలుగు సినిమా. ఎస్‌ఎస్‌ఎల్‌ఎస్ క్రియేషన్ బ్యానర్‌పై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన ఈ సినిమాకు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించాడు. కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ, ఐరేని మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 27న, ట్రైలర్‌ను అక్టోబర్ 29న విడుదల చేసి[1] సినిమాను డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు.[2]
ఉపేంద్రగాడి అడ్డా | |
---|---|
దర్శకత్వం | ఆర్యన్ సుభాన్ ఎస్.కె. |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రవీందర్‌సన్ |
కూర్పు | మేనగా శ్రీనివాస్ రావు |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 1 డిసెంబర్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుబంజారాహిల్స్ బస్తీకి చెందిన యువకుడు ఉపేంద్ర కుటుంబ భాద్యతలు పట్టించుకోకుండా జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతడి స్నేహితుడి సలహా మేరకు కోటీశ్వరుడి కూతురుని చూసి ప్రేమించి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనేది అనుకుంటాడు. ఓ రౌడీ షీటర్ దగ్గర అధిక వడ్డీకి అప్పు చేసి పబ్బులు చుట్టూ తిరుగుతూ సావిత్రిని ప్రేమిస్తాడు. ఆమెకు తాను కోటీశ్వరుడిని అబద్ధం చెబుతూ ఆ అబద్ధాన్ని నిజం చేయటానికి అప్పులు చేస్తాడు. డబ్బుకోసమే ప్రేమించాలనుకున్న సావిత్రని నిజంగానే ప్రేమిస్తాడు ఉపేంద్ర దీంతో తనకు అసలు నిజం చెప్పాలనుకుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయికి నిజం చెప్పేశాడా? ఈ క్రమంలో అమ్మాయల ముఠా సావిత్రిని కిడ్నాప్ చేస్తారు. ఆ ముఠా చేతిలో చిక్కుకున్న అతడి ప్రియురాల్ని ఎలా కాపాడుకున్నాడు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- కంచర్ల ఉపేంద్ర[3]
- సావిత్రి కృష్ణ
- ఐరేని మురళీధర్ గౌడ్
- సంధ్య జనక్
- కిరీటి దామరాజు
సాంకేతిక నిపుణులు
మార్చు- సహ నిర్మాతలు: కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత
- సంగీతం: రాము అద్దంకి
- సినిమాటోగ్రాఫర్: రవీందర్‌సన్
- మాటలు: శ్రీనివాస్ తేజ
మూలాలు
మార్చు- ↑ Namaste Telangana (29 October 2023). "ఉపేంద్ర అందించే సందేశం". Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ V6 Velugu (21 November 2023). "డిసెంబర్ 1న ఉపేంద్రగాడు వస్తున్నాడు". Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (29 November 2023). "నాకంటూ ఓ శైలి ఏర్పరచుకుంటాను". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.