ఐరేని మురళీధర్‌ గౌడ్‌ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2022లో విడుదలైన డీజే టిల్లు సినిమాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]

ఐరేని మురళీధర్‌ గౌడ్‌
జననం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018 - ప్రస్తుతం
తల్లిదండ్రులురాజమణెమ్మ, గౌరయ్యగౌడ్‌

వ్యక్తిగత జీవితం

మార్చు

ఐరేని మురళీధర్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, రామాయంపేటలో జన్మించాడు.[2] ఆయన సిద్దిపేటలో తన విద్యాభాస్యం పూర్తి చేసి హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లోని ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 27 ఏళ్లు పని చేసి రిటైర్డ్ అయ్యాడు.

సినీ జీవితం

మార్చు

మురళీధర్‌ గౌడ్‌  ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి రిటైర్‌ అయ్యాక నటనపై ఆసక్తితో సినీ ప్రయత్నాలు మొదలుపెట్టి 2018లో 'రంగస్థలం' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి డీజే టిల్లు సినిమాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకొని బలగం, మేమ్ ఫేమస్‌, మ్యాడ్ , 'టిల్లు స్క్వేర్' వంటి హిట్ సినిమాలలో నటించాడు.[3]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2018 రంగస్థలం గుర్తింపు లేని పాత్ర
ఆటగాళ్లు
అంతరిక్షం 9000 KMPH
2019 మార్షల్
2021 స్కైలాబ్
2021 క్లైమాక్స్
2022 డీజే టిల్లు టిల్లు తండ్రి [4]
2023 మేమ్ ఫేమస్ సర్పంచ్ ఎల్లారెడ్డి
పరేషాన్
అన్‌స్టాపబుల్
సత్తిగాని రెండు ఎకరాలు
స్లమ్ డాగ్ హజ్బెండ్
సూర్యాపేట జంక్షన్
మ్యాడ్ గణేష్ తండ్రి [5]
భగవంత కేసరి జోగి
దాస్ కా ధమ్కీ సంజయ్ తండ్రి నటిస్తున్నాడు
మంగళవారం
బలగం నారాయణ
ఉపేంద్రగాడి అడ్డా
2024 బాబు
టిల్లు స్క్వేర్ టిల్లు తండ్రి
పద్మవ్యూహంలో చక్రధారి 840 రామకృష్ణ
డార్లింగ్
భవనమ్: హాంటెడ్ హౌస్
రామ్‌నగర్ బన్నీ బన్నీ తండ్రి
శ్రీరంగనీతులు
కళింగ
పుష్ప 2 నగల దుకాణం యజమాని
పారిజాత పర్వం
బాబు నెం.1 బుల్ షిట్ గయ్
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
2025 సంక్రాంతికి వస్తున్నాం

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2021 పిట్ట కథలు మాజీ ఎమ్మెల్యే రాముల సెగ్మెంట్
2022 ది అమెరికన్ డ్రీం
2024 బృంద పోస్టుమార్టం సర్జన్

అవార్డులు మరియు నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం మూ
2023 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటుడు - తెలుగు డీజే టిల్లు నామినేట్ చేయబడింది
2023 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు - తెలుగు డీజే టిల్లు నామినేట్ చేయబడింది

మూలాలు

మార్చు
  1. Sunita, Y. (2023-06-12). "From TV serials to Telugu cinema, actor Muralidhar Goud talks about his acting career". The South First (in ఇంగ్లీష్). Retrieved 2024-08-30.
  2. "Balagam Actor Muralidhar Goud About His Struggles - Sakshi". Sakshi. Retrieved 2024-10-18.
  3. "పదవీ విరమణ తర్వాత." (in ఇంగ్లీష్). Prajasakti. 19 November 2023. Archived from the original on 24 December 2024. Retrieved 24 December 2024.
  4. Cherukuri, Abhilasha (2024-03-30). "Movie Review 'Tillu Square'| Effectively leverages the strength of the original film". The New Indian Express (in ఇంగ్లీష్).
  5. Dundoo, Sangeetha Devi (2023-10-06). "'MAD' movie review: Sangeeth Shobhan and Vishnu Oi sparkle in director Kalyan Shankar's campus entertainer that packs in plenty of laughs within its wafer-thin storyline". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-18.

బయటి లింకులు

మార్చు