ఉప్పరి సాంబయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కరీంనగర్ జిల్లా, నేరెళ్ల నియోజకవర్గం (ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం) నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

ఉప్పరి సాంబయ్య

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం నేరెళ్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 సెప్టెంబర్ 1937
కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 2 ఏప్రిల్ 2021
కశ్మీర్‌గడ్డ, కరీంనగర్‌
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ పార్టీ
సంతానం ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు
నివాసం కశ్మీర్‌గడ్డ, కరీంనగర్‌

రాజకీయ జీవితం

మార్చు

ఉప్పరి సాంబయ్య 1985లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్‌ నుంచి నేరెళ్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాటి రాజాం పై 3686 ఓట్లు మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1989లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్‌ పార్టీ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాటి రాజాం చేతిలో 18718 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఉప్పరి సాంబయ్య అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వహించాడు.

ఉప్పరి సాంబయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2 ఏప్రిల్ 2021న కరీంనగర్‌ పట్టణం కశ్మీర్‌గడ్డలోని ఆయన స్వగృహలో మరణించారు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Mana Telangana (9 November 2018). "సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గులాబీ హాట్రిక్". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
  2. Sakshi (3 April 2021). "నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే సాంబయ్య కన్నుమూత". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
  3. Aakeru News (2 April 2021). "Former Nerella legislator Uppari Sambaiah passes away | AAKERU NEWS". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
  4. Namasthe Telangana (2 April 2021). "నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య కన్నుమూత". Namasthe Telangana. Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.