పాటి రాజం
పాటి రాజం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి[1], మంత్రిగా పనిచేశాడు.[2]
పాటి రాజం | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1978 - 1983 1983 - 1985 1989 - 1994 | |||
ముందు | ఉప్పరి సాంబయ్య | ||
---|---|---|---|
తరువాత | సుద్దాల దేవయ్య | ||
నియోజకవర్గం | నేరెళ్ల నియోజకవర్గం | ||
నీటిపారుదల, ఉన్నత విద్యాశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1991 - 1994 | |||
తరువాత | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1940 తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
రాజకీయ జీవితం
మార్చుపాటి రాజం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1978లో నేరెళ్ల నియోజకవర్గం నుండి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొట్టె భూపతిపై 13651 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబీలి ఎన్నికయ్యాడు. ఆయన 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి గొట్టె భూపతిపై 4218 ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలిచి, 1985లో జనతా పార్టీ అభ్యర్థి ఉప్పరి సాంబయ్య చేతిలో 3686 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
పాటి రాజం 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి జనతాదళ్ అభ్యర్థి ఉప్పరి సాంబయ్యపై 18718 ఓట్ల మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రవర్గంలో నీటిపారుదల, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.[3]
మూలాలు
మార్చు- ↑ Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Eenadu. "ఇద్దరికి అమాత్యయోగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.