ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం

ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలో ఉన్న ఒక పక్షి సంరక్షణ కేంద్రం. ఇక్కడ రకరకాలైన కొంగలను గమనించవచ్చు. ఇక్కడికి సైబీరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలనుంచి పక్షులు వలస వచ్చి స్థానికంగా ఉండే చెరువులకు సమీపంలో చెట్లపైన గూళ్ళు కట్టుకుంటాయి.[2]

ఉప్పలపాడు పక్షి సంరక్ష
Spot-billed Pelican (Pelecanus philippensis) landing with nesting material at nest with chicks W2 IMG 2857.jpg
ప్రదేశంఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా[1]
సమీప నగరంపెదకాకాని మండలంగుంటూరు జిల్లా
విస్తీర్ణం370 kమీ2 (140 sq mi)
స్థాపితం1994
పాలకమండలిఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
ప్రపంచ వారసత్వ ప్రదేశంNo

ఎలా వెళ్లాలి:సవరించు

గుంటూరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే ఉప్పలాపాడు.ఇది పెదకాకాని మండలంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా తప్ప రైలు సౌకర్యం లేదు.విమానం ద్వారా రావాలనుకొనేవారు విజయవాడ దగ్గర గన్నవరం వరకు వచ్చి 52 కిలోమీటర్ల దూరం వేరే వాహణం పై ఉప్పలపాడూ పక్షుల సంరక్షణ కేంద్రానికి రావల్సిఉంటుంది.రైలు సౌకర్యమైతే గుంటూరు వరకూ ఉంది.అక్కడ నుండి 8 కిలోమీటర్లు .

చరిత్రసవరించు

ఇక్కడ 25 సంవత్సరాలకు పూర్వం పక్షి సంరక్షణ కేంద్రం ఈర్పడింది. 2002 లో ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం చెరువును అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం గ్రామ పర్యావరణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉంది. గుడ్లు పెట్టదానికి అనువైన వాతావరణం, ఆహారం లభించడం వలనే పక్షులు ఇక్కడకు వస్తున్నాయి. ఇక్కడకు చైన, నేపాల్, హిమాలయాల నుంచి ఫెలికాన్స్, నైజీరియా నుంచి పెయింటెడ్ స్టార్క్స్, శ్రీలంక, ఆఫ్రికా నుంచి ఓపెన్ బిల్ స్టార్క్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబిస్.ఇలా వివిధ దేశాల నుండి 32 రకాల పక్షులు ఆయా కాలాల్లో వలస వస్తున్నాయి.

శీతాకాలం మధ్యలో ఇక్కడకు వేల సంఖ్యలో వచ్చే రోజీ పాస్టర్స్ మిడతల దండును స్వాహా చేసి రైతులకు మేలు చేస్తున్నాయి. పర్యావేత్తల అంచనా ప్రకారం ఈ పక్షులన్నిటికి కాపాలాగా ఉండే మరో పక్షే డాక్టర్ స్నేక్. వేలాదిగా వస్తున్న పక్షుల కోసం గ్రామం లోని మంచినీటి చెరువును 10 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన వదిలివేసారు.చెరువు మధ్యనున్న తుమ్మచెట్లు, మట్టి దిబ్బలు పక్షులకు ఆవాసంగా మారాయి.

==వలస== జీవశాస్త్ర నిపుణుల లెక్క ప్రకారం వేల కిలోమీటర్ల ప్రయాణానికి ముందు ప్రాంత అంచనా కోసం కొన్ని పక్క్షులు ముందుగా పరిశీలించివెళ్ళిన తర్వాతే సమూహంగా రావడానికి ప్రయాణామవుతాయి. కొన్ని నెలలపాటు ఉండడానికి సిద్ధపడే ఇక్కడకు వస్తాయి, వచ్చి గుడ్లుపెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి ఎగరడం నేర్పాకే తిరిగి తమ ప్రాంతాలకు

==అనుకూల కాలం== అక్టోబరు నుండి మార్చి వరకూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ రకాల పక్షులు వస్తాయి.అక్టోబరు నెలలో సాధారణంగా ఉప్పలపాడులో సుమారు 15 వేల పక్షులు ఉంటాయి.[3]

ఒకప్పుడు ప్రతియేటా 12000 దాకా పక్షులు వచ్చి చేరేవి. కానీ ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా కేవలం 7000 పక్షులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇక్కడ చెట్లను కృత్రిమంగా పెంచడం, చెరువులు తవ్వించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.[4][5] ==మేలుకొలుపు:== నెల్లూరు నేలపట్టుకు ఒకప్పుడు వెళ్ళే పక్షులు, పస్చ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరి కొల్లేటి సరస్సుకు వెళ్ళే పక్షులు ఈ రోజు ఏ ఉప్పలపాడూకు రావడం మిగిలిన ప్రాంతాలలో అనుకూల, పర్యవరణ పరిఖ్శ్ఃఇతులు క్షీణించడమే కారణం.ఈ ఉప్పలపాడూలో ఉన్న చెరువులు, చెట్లు, పక్షులకు కావల్సిన ఆహారం దొరకటంతో పక్షులు ఆసక్తి చూపిస్తున్నాయి.

బయటి లింకులుసవరించు

"RAM ROBERT RAHIM DETECTIVE PRODUCTIONS (Regd. No: 384/2017"

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలుసవరించు

  1. "ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్". Check date values in: |accessdate= (help); Missing or empty |url= (help); |access-date= requires |url= (help)
  2. "Uppalapadu Bird sanctuary". Online edition of The Hindu. Chennai, India. 20 జులై 2005. Retrieved 1 ఆగస్టు 2007.
  3. "విదేశీ పక్షులొచ్చె.. సందడి తెచ్చె". sakshi. Archived from the original on 3 డిసెంబర్ 2019. Retrieved 3 డిసెంబర్ 2019.
  4. "Preparing for the Winged visitors". Online edition of The Hindu. Chennai, India. 11 జులై 2007. Retrieved 1 ఆగస్టు 2007.
  5. "Siberian birds attract visitors". Online edition of The Hindu. Chennai, India. 29 డిసెంబర్ 2006. Retrieved 1 ఆగస్టు 2007.