ఉమయల్పురం కె.నారాయణస్వామి

ఉమయల్పురం కె.నారాయణస్వామి (1929–1997) ఒక కర్ణాటక సంగీత శాస్త్రీయ వాద్యకారుడు.

ఉమయల్పురం కె.నారాయణస్వామి
వ్యక్తిగత సమాచారం
జననం(1929-05-14)1929 మే 14
కుంభకోణం, తంజావూరు జిల్లా, తమిళనాడు
మరణం1997 ఆగస్టు 3(1997-08-03) (వయసు 68)
చెన్నై
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాద్యకళాకారుడు
వాయిద్యాలుఘటం

విశేషాలు మార్చు

ఇతడు 1929, మే 14వ తేదీన కుంభకోణంలో జన్మించాడు.[1] ఇతడు తన తండ్రి ఉమయల్పురం కోదండరామ అయ్యర్ వద్ద ఘటవాదనం నేర్చుకున్నాడు. ఇతడు ఘటవాద్యంతో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎస్.రాజం, చిట్టిబాబు, మణి కృష్ణస్వామి గురువాయూర్ దొరై వంటి సంగీతవిద్వాంసులకు సహకారం అందించాడు.[2] 1994లో ఇతడు అమెరికా పర్యటించి అనేక విశ్వవిద్యాలయాలలో కర్ణాటక సంగీతంపై ఉపన్యాసాలు చేశాడు. ఇతడు ఆకాశవాణిలో నిలయ విద్వాంసునిగా పనిచేసి 1989లో పదవీవిరమణ చేశాడు. ఇతడు 1997, ఆగష్టు 3వ తేదీన చెన్నైలో మరణించాడు.

అవార్డులు మార్చు

ఇతడిని అనేక సంగీత సభలు, సంస్థలు సత్కరించాయి. 1995లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతనికి కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. అదే యేడు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక సంగీతం వాద్యపరికరాలు - ఘటం విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది.

మూలాలు మార్చు

  1. web master. "Umayalpuram K. Narayanaswamy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 14 ఆగస్టు 2020. Retrieved 8 March 2021.
  2. Umayalpuram Narayanaswamy dead