ఉమ్మెత్తల కేశవరావు

ఉమ్మెత్తల కేశవరావు (ఫిబ్రవరి 9, 1910 - 1992) తెలంగాణ విమోచనోద్యమం, గ్రంథాలయోధ్యమ నాయకుడు.

ఈయన 1910, ఫిబ్రవరి 9నల్గొండ జిల్లా పిల్లలమర్రి గ్రామంలో జన్మించారు. స్థానికంగా పిల్లలమర్రిలోనూ, ఆ తర్వాత సూర్యాపేటలోనూ విద్యాభ్యాసం చేసి హైదరాబాదులో న్యాయవొద్య అభ్యసించి 1932లో హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిజీవనం ఆవరంభించారు. గ్రంథాలయ ఉద్యమంతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ, హైదరాబాదు విమోచనోద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. 1947లో హైదరాబాదు రాజ్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జైలుశిక్షకు గురయ్యారు.[1] వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో పాల్గొని తెలంగాణ అంతటా పర్యటించారు.

1992 లో కేశవరావు మరణించారు.

మూలాలు

మార్చు
  1. భారత స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం కల్చరల్ సొసైటి ప్రచురణ