సూర్యాపేట

తెలంగాణ, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం లోని పట్టణం

సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలానికి చెందిన పట్టణం|గ్రామం.[1]

సూర్యాపేట పట్టణం విహంగ వీక్షణ చిత్రం

ఈ పట్టణం భానుపురి అని కూడా పిలవబడింది.ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారింది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది.ఈ పట్టణం తెలంగాణ ముఖద్వారం అని కూడా చెప్పుకోవచ్చు.సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు ఉంది.ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యపేటలో నైజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.[2]

భాషలుసవరించు

 
సూర్యాపేట బస్ స్టాండ్

తెలుగు, కోయ భాషలు ఇక్కడ ప్రాంతీయ భాషలు.

తపాలా సౌకర్యంసవరించు

సూర్యాపేటకు స్పీడు పోష్టు సౌకర్యంతో కూడిన తపాలా కార్యాలయం ఉంది.

గ్రామ జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ పరిధిలోని జనాభా - మొత్తం 1,55,422 - సాంద్రత 40/km 2 (103.6/sq mi) - పురుషులు 77,072 - స్త్రీలు 98,359

ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నైజాము రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ". Cite web requires |website= (help)

ఇవి కూడా చూడండిసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సూర్యాపేట&oldid=2680138" నుండి వెలికితీశారు