ఉమ్రాహ్
ఉమ్రాహ్ లేదా ఉమ్రా (అరబ్బీ: عمرة ) సంవత్సరకాలంలో ముస్లింలు ఎపుడైననూ మక్కా తీర్థయాత్రచేస్తే దానిని ఉమ్రా అంటారు. అరబ్బీ భాషలో ఉమ్రా అనగా పవిత్ర స్థల సందర్శన. షరియా ప్రకారం ఉమ్రా అనగా ఇహ్రాం ధరించి కాబా చుట్టూ తవాఫ్ చేయడం, అల్-సఫా, మర్వాహ్ మధ్య సయీ చేయడం. వేరేవిధంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న తీర్థయాత్ర, హజ్ అనునది పెద్ద తీర్థయాత్ర. ఇస్లామీయ సిధ్ధాంతాల ప్రకారం 'ఉమ్రా' అత్యవసరం కానప్పటికీ, పుణ్యకార్యమే.
ఉమ్రా సాంప్రదాయాలు
మార్చుఈ తీర్థయాత్ర (ఉమ్రా) చేయువానికి "ముతమిర్" అంటారు. హజ్ యాత్ర చేయువానికి "హాజీ" అంటారు. ఉమ్రా సాంప్రదాయం ఇబ్రాహీం ప్రవక్త, అతని భార్య 'హాజిరా' వారిది. ఈ సాంప్రదాయంవల్ల ముస్లిం సముదాయాలలో ప్రేమాభిమానాలు కలుగుతాయని నమ్మకం. సాంప్రదాయక నమ్మకాలు:
- కాబా చుట్టూ ఏడు సార్లు తవాఫ్ (ప్రదక్షిణలు ) గడియారపు ముల్లు వ్యతిరేక దిశలో చేయాలి. మూడు ప్రదక్షిణలు త్వరత్వరగానూ, మిగతా నాలుగు ప్రదక్షిణలు నెమ్మదిగానూ చేయాలి.[1]
- అల్-సఫా, మర్వాహ్ ల మధ్య "సయీ" అనగా సఫా మర్వా పర్వతాల మధ్య ఏడు సార్లు త్వరితగతిన రాకపోకలు చేయాలి. ఇబ్రాహీం ప్రవక్త పత్నియైన 'హాజిరా' సాంప్రదాయంగా దీన్ని ఆచరిస్తారు. 'హాజిరా' పై అల్లాహ్ జమ్ జమ్ బావిని ప్రకటించాడు.
- హల్ఖ్ లేదా 'తఖ్సీర్' చేయాలి, అర్థం తలనీలాలు విసర్జించాలి. హల్ఖ్ అనగా పూర్తిగా తలనీలాల విసర్జన (తల గుండు చేసుకోవడం), తఖ్సీర్ అనగా తలనీలాలు చిన్నవ చేసుకోవడం.
ఈ సంప్రదాయాలతో ఉమ్రాహ్ తీర్థయాత్ర ముగుస్తుంది. ఉమ్రాను సుమారు ఒక గంటలో పూర్తిచేసుకోవాలి. ముఖ్యమైన పర్వాలైన హజ్, రంజాన్ లలో ఉమ్రా చేయువారు ఎక్కువగా వస్తుంటారు.
ఉమ్రా రకాలు
మార్చుఉమ్రా రెండు రకాలు, అవి
- అల్-ఉమ్రతుల్-ముఫ్రదా అనగా కేవలం ఉమ్రా మాత్రమే చేయుట.
- ఉమ్రతుల్ తమ్మతు అనగా ఉమ్రా, హజ్ రెండూ కలిపి చేయుట. (ఉమ్రా మొదట చేసి తరువాత హజ్ చేస్తారు)
ఇవీ చూడండి
మార్చునోట్స్
మార్చు- ↑ Mohamed, Mamdouh N. (1996). Hajj to Umrah: From A to Z. Amana Publications. ISBN 0-915957-54-X.
మూలాలు
మార్చు- The Hajj According to the Five Schools of Islamic Fiqh (Part 1), by 'Allamah Muhammad Jawad Mughniyyah (translated from Arabic by Ali Quri Qara'i), al-Tawhid, Vol. II, No.4,