అరబ్బీ (అరబ్బీ : الْعَرَبيّة ) (అల్-అరబియ్య) లేదా (అరబ్బీవ్: عَرَبيْ ) అరబి / అరబీ / అరబ్బీ ) సామీ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది హీబ్రూ, అరమాయిక్ భాషలకు దగ్గరగా వుంటుంది. నవీన అరబ్బీ భాష 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా ఇస్లామీయ ప్రపంచంలో ఉపయోగించబడుచున్నది.

అరబ్బీ భాష
العربية 
అల్-అరబియ్య అరబ్బీ 'నస్ఖ్' లిపిలో వ్రాయబడినది:
 
ఉచ్ఛారణ: / అల్ అర బియ్ య /
మాట్లాడే దేశాలు: అల్జీరియా, బహ్రయిన్, ఈజిప్టు, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, లిబియా, మారిటానియా, మొరాకో, ఒమన్, పాలస్తీనా పాలస్తీనా ప్రాంతాలు, కతర్, సౌదీ అరేబియా, సూడాన్, సిరియా, ట్యునీషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పశ్చిమ సహారా, యెమన్, మెజారిటీగా; ఇస్లాం యొక్క సాహితీ భాష. 
ప్రాంతం: అరబ్ ప్రపంచం
మాట్లాడేవారి సంఖ్య: ప్రాదేశికంగా 186 , 422 మిలియన్ మంది మాట్లాడేవారున్నారు.[1] According to Ethnologue, 246 million including second language speakers, (1999 est). 
ర్యాంకు: 2 [2] to 6[3] (native speakers)
భాషా కుటుంబము:
 సామి
  పశ్చిమ సామి
   మధ్య సామి
    అరబ్బీ భాష 
వ్రాసే పద్ధతి: అరబ్బీ వర్ణమాల 
అధికారిక స్థాయి
అధికార భాష:
నియంత్రణ: ఈజిప్టు: కైరో లోని అరబ్బీ భాష అకాడెమి

సిరియా: డెమాస్కస్ లోని అరబ్ అకాడెమి (అత్యంత ప్రాచీనమైన)
ఇరాక్: ఇరాకీ సైన్స్ అకాడెమీ
సూడాన్: ఖార్టూమ్ లోని అరబ్బీ భాష అకాడెమి
మొరాకో: రబాత్ లోని అరబ్బీ భాష అకాడెమి (అత్యంత క్రియాశీలక)
జోర్డాన్: జోర్డాన్ అరబ్బీ అకాడెమి
లిబియా: Academy of the Arabic Language in Jamahiriya
ట్యునీషియా: en:Beit Al-Hikma Foundation
ఇజ్రాయెల్: అరబ్బీ భాషా అకాడెమీ. (నాన్-అరబ్ దేశంలో మొదటిది)[1]

భాషా సంజ్ఞలు
ISO 639-1: ar
ISO 639-2: ara
ISO 639-3: ara — Arabic (generic)
అరబ్బీ మాండలికాల ప్రత్యేక కోడులు చూడటానికి అరబ్బీ మండలికాలు అనే పేజికి వెళ్ళండి' 

అరబ్బీ భాష ప్రధానంగా 'అధికారిక భాష' గల ప్రాంతాలు (ఆకుపచ్చ రంగులో) , అనేక భాషలలో ఒక భాషగా 'అరబ్బీ భాష' గల ప్రాంతాలు (నీలం రంగులో)

నవీన అరబ్బీ సాంస్కృతిక అరబ్బీ నుండి ఉధ్బవించింది, సా.శ. 6వ శతాబ్దంనుండి పురాతన ఉత్తర అరేబియా ప్రాంతంలో సాంస్కృతిక భాషగా విరాజిల్లిన అరబ్బీ 7వ శతాబ్దంలో సాంస్కృతిక, మతపరమైన భాషగా నేటికినీ వాడుకలోయున్నది.

అరబ్బీ భాష అనేకమైన తన పదాలను ఇతరభాషలకు ప్రసాదించింది. ముఖ్యంగా లాటిన్, ఐరోపా భాషలకు. దీనికి ప్రతిఫలంగా ఎన్నోభాషలనుండి పదాలను పొందింది. ఉర్దూ భాషలో కూడా అరబ్బీ పదాలు మెండుగా కనిపిస్తాయి.

భారతదేశంలో అరబ్బీ భాష

మార్చు

భారతదేశంలో అరబ్బీ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువగా వున్ననూ, ఈ భాష చదవడం, కొద్దిగా అర్థం చేసుకునేవారి సంఖ్య బాగా కనిపిస్తుంది. "ఇబాద" ప్రార్థనల కొరకు ముహమ్మద్ ప్రవక్త వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే నమాజు, దుఆలు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక గ్రంథం అయినటువంటి ఖురాన్ ఈ భాషలోనే ఉన్నది కావున, ఖురాన్ పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ మాతృభాషగా గలవారున్నారని అంచనా. అంతేగాక, భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో అరబ్బీ భాష డిపార్ట్‌మెంట్లు గలవు. ఉదాహరణకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం.

పదజాల ఉదాహరణాలు

మార్చు

[4]

తెలుగు అరబ్బీ తెలుగు లిప్యాంతరీకరణ అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల
తెలుగు
ఇంగ్లీషు الإنكليزية అల్-ఇంగ్లీజియా /alingliːziːjah/
అవును نعم న'ఆమ్ /naʕam/
లేదు لا లా /laː/
స్వాగతం, నమస్తే أهلاً (గ్రాంధికం "సుస్వాగతం") or مرحبًا (వ్యవహారికం) అహ్‌లన్ లేదా మర్హబన్ /ahlan/ తా /marħaban/
Goodbye مع السلامة మా అల్-సలామ /maʕ assalaːmah/ (గ్రాంధికంగా 'శాంతి తో')
దయచేసి أرجوك అర్‌జుక్ /ʔardʒuːk/
ధన్యవాదాలు شكرًا షుక్రన్ /ʃukran/
మీకు స్వాగతం / దయచేయండి عفوًا అఫ్‌వన్ /ʕafwan/
మన్నించండి / క్షమించండి آسف ఆసిఫ్ /ʔaːsif/
మీ పేరేమిటి? ما إسمك మా ఇస్‌ముక్ /maː ismuka/
ఎంత? بكام؟ బికామ్? /bikam/
నాకర్థం కాలేదు لا أفهم లా అఫ్‌హామ్ /laː ʔafham/
నేను అరబ్బీ మాట్లాడలేను لا أتكلم العربية లా అతకల్లము అల్-అరబియా /ʔanaː laː ʔatakallam ulʕarabijja/
నాకు తెలియదు لا أعرف లా ఆరిఫ్ /laː ʔaʕarif/
నాకు ఆకలేస్తుంది أنا جائع అనా జాయినున్ /ʔanaː dʒaʔiʕun/
నారింజ برتقالي బుర్తుఖాలి /burtuqaːliː/
నలుపు أسود అస్వద్ /ʔaswadu/
ఒకటి واحد వాహిద్ /waːħid/
రెండు إثنان ఇత్నాన్ / ఇస్నాన్ /iθnaːn/
మూడు ثلاثة సలాస /θalaːθah/
నాలుగు أربعة అరబా /ʔarbaʕa/
ఐదు خمسة ఖంసా /xamsah/

వ్యాకరణం

మార్చు

నామవాచకం

మార్చు

అరబ్బీ భాషలో ప్రతి నామవాచకం పుల్లింగ, స్త్రీలింగాల్లో ఏదో ఒక లింగం కలిగి ఉంటుంది. జీవం ఉన్న ప్రాణుల గురించి మాట్లాడేటప్పుడు పుల్లింగం మగతనాన్ని సూచిస్తుది, స్త్రీలింగం ఆడతనాన్ని సూచిస్తుంది, కానీ వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు పదలింగానికీ నిజమైన లింగానికీ సంబంధం లేదు.

భగ్న బహువచనం

మార్చు

అరబ్బీ భాషలో చాలా నామవాచకాలకు "భగ్న బహువచనాలు" ఉంటాయి. అంటే ఇలాంటి పదాలకు బహువచనం సూచించడానికి చివరికి ఒక ప్రత్యయం చేర్చడానికి బదులు ఆ పదాల్లో అచ్చులు మార్చాలి. అరబ్బీ భాషలో షుమారు 50% నామవాచకాలకు భగ్న బహువచనం ఉంటుంది.

క్రియలు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

పాదపీఠికలు

మార్చు
  1. Three lists Archived 2011-09-27 at the Wayback Machine, Ethnologue, Encarta Archived 2008-07-24 at the Wayback Machine, "Languages Spoken by More Than 10 Million People". Microsoft ® Encarta ® 2006. Archived from the original on 2007-12-03. Retrieved 2007-02-18.
  2. "Languages Spoken by More Than 10 Million People". Microsoft ® Encarta ® 2006. Archived from the original on 2007-12-03. Retrieved 2007-02-18.
  3. "Most Widely Spoken Languages". Archived from the original on 2011-09-27. Retrieved 2008-03-10.
  4. {| class="wikitable" border="1" |Insert footnote text here |}

మూలాలు

మార్చు
  • Edward William Lane, Arabic English Lexicon, 1893, 2003 reprint: ISBN 81-206-0107-6, 3064 pages (online edition).
  • R. Traini, Vocabolario di arabo, I.P.O., Rome
  • Hans Wehr, Arabisches Wörterbuch für die Schriftsprache der Gegenwart: Arabisch-Deutsch, Harassowitz, 1952, 1985 reprint: ISBN 3-447-01998-0, 1452 pages; English translation: Dictionary of Modern Written Arabic, Harassowitz, 1961.
  • Thelwall, Robin (2003), "Handbook of the International Phonetic Association", Arabic, Cambridge, UK: Cambridge, ISBN 0-521-63751-1
  • Kees Versteegh, The Arabic Language, Edinburgh University Press (1997).
  • Mumisa, Michael, Introducing Arabic, Goodword Books (2003).
  • Haywood and Nahmad, A new Arabic grammar: London 1965, ISBN 0-85331-585-X
  • Laura Veccia Vaglieri, Grammatica teorico-pratica della lingua araba, I.P.O., Rome.
  • George Grigore, (2007). L'arabe parlé à Mardin. Monographie d'un parler arabe périphérique. Bucharest: Editura Universitatii din Bucuresti, ISBN 978-973-737-249-9 [2]
  • Watson, Janet (2002), The Phonology and Morphology of Arabic, New York: Oxford University Press

బయటి లింకులు

మార్చు