===ఉల్లి కుటుంబము===

ఉల్లి మొక్కలను పెక్కు చోట్ల సేద్యము చేస్తున్నారు.

ఉల్లికాడ కట్టలు

ప్రకాండము లసునము. భూమిలోపల నుండును. పలుచగా నుండును. ఉల్లి పాయల అడుగున గరుకుగరుకుగా నుండునదే ప్రకాండము. కొన్ని ఆకులు మార్పు చెంది ఉల్లి పాయలైనవి.

ఆకులు అలఘు పత్రములు. సన్నముగాను పొడుగు గాను నుండును. వాని అడుగు భాగము భూమిలో నున్న భాగము, దళసరిగాను, తెల్లగా నుండును. ఆకులు గొట్టముల వలె నొకదాని నొకటి చుట్టుకొని యుండును. సమాచలము సమరేఖ పత్రము. ఉల్లి మొక్క పుష్పించి కాయలు గాచుటకు ఆహార పదార్థమును పాయలలో నిలివ చేసికొనును.

==పుష్ప మంజరి==
. గుత్తి వృంతము ఆకుల మధ్య నుండి వచ్చును.
==పుష్పనిచోళము==
సంయుక్తము. 6 తమ్మెలు. తెలుపు రంగు. వాసన గలదు. నీచము.
==కింజల్కములు==
6 పొట్టిగా నుండును. పుప్పొడి తిత్తులు 2 గదులు.
==అండ కోశము==
. అండాశయము. ఉచ్చము. మూడు గదులు. గింజలు చిన్నవి. కీలము పొట్టిగా నుండును. కీలాగ్రమున మూడు తమ్మెలు.
ఉల్లిపాయలు
శత మూలము

శతమూలము మొక్క హిందూ దేశమునంతటను పెరుగు చున్నది. ముల్లంగి వంటి దుపలుగా మారును.

==ప్రకాండము==
సన్నముగాను, నున్నగాను వుండును. దారువు గలదు. వాడి యగు ముండ్లొక్కొక చోటనొక్కటి గలదు. ముళ్ళ వలె మారియున్నవి. ఆకుల వలె పచ్చాగా నున్నవి. కొమ్మలు పత్రములు లేవు గాన కొమ్మలే వెడల్పై ఆకుల వ్యాపారములు చేయు చున్నవి.
==పుష్ప మంజరి==
. గెల చేటికలు గలవు. పలుచగను హృదయాకరముగను నున్నవి. ఒక్కొక దాని వద్ద నొక్కొక పుష్పము గలదు. పుష్పములు చిన్నవి. తెలుపు రంగు.
అండకోశము
. అండాశయము ఉచ్చము. 3 గదులు. ఒక్కొక్క దాని యందు నాలుగేసి అండములున్నవి. మధ్యస్తంబ సంయోగము.
కీలము పొట్టి
కీలాగ్రము మూడు తమ్మెలు. ఫలము కండ కాయ. రెండు గదులు. పెరుగవు. గింజలు నల్లగా నుండును.
విషమ కాడ నార

పరకాండము. భూమిలోపల చిటికిన వ్రేలు లావున గాడవలె నుండును. ఆకులు మాత్రము పైకి వచ్చును.

ఆకులు ఒక్కొక చోట నుండి 4 మొదలు 8 వరకు గుత్తివలె వచ్చును. వెలుపలి ఆకులు చిన్నవి. మధ్య నుండునవి సుమారు మూ అడుగుల వరకు పెరుగును. గొట్టము వలె గుండ్రముగా నుండును. వాని మీద తెల్లని చారలు గలవు.

పుష్ప మంజరి
ఆకుల మధ్య నుండి కంకి యొకటి రెండంగుళముల వరకు పెరుగు చున్నది. దానిని దట్టమగు నాకు 4, 5 గప్పుచున్నవి. కంకి మీద నొక చోట 4 మొదలు 6 వరకు పుష్పములున్నవి. పువ్వులు పెద్దవి.

పుష్పనిచోళము: సంయుక్తము. గరాటి వలె నుండును. 6 తమ్మెలు గలవు. తమ్మెలు సన్నముగా నుండును. నీచము.

కింజల్కములు
6. గొట్టము అడుగు భాగముతో గలిసి యున్నవి. పుప్పొడి తిత్తులు సన్నముగ సమరోళాకారముగను ఉన్నాయి. వీని రెండు గదులు పై నిడివిగా నుండును.
అండ కోశము
అండాశయ ముచ్చము. 8 గదులు అండముల మధ్యస్తంభ యోగము.

కీలము: కింజల్కములు అంత పొడుగు గానుండును. ఫలము కండ కాయ.

ఈ కుటుంబపు మొక్కలు విస్తారము శీతల దేసములందు పెరుగు చున్నవి. వీనిలో నన్నియు చిన్న మొక్కలే కాని రెండు మూడు చెట్లు కూడా ఉన్నాయి. ఏక దళ బీజపు మొక్కలలో నిట్టి చెట్లుండుట మిక్కిలి అరుదు. ఈ కుటుంబపు మొక్కలలో చాల వానికి ప్రకాండము భూమిలోపల నుండును. ఆకులు ఒంటరి చేరిక, సమాంచలము. సమ రేఖ పత్రములు. పుష్ప భాగములు వలయమునకు మూడో, ఆరో యుండును. అండ కోశము ఉచ్చము ఉల్లి పాయల వాడుక ఇప్పుడెక్కువైనది గనుక వాని పంటయు నెక్కువైనది. మనదేశమునందెల్లయెడలను పైరగు చున్నవి కాని హింధూ స్థానములో ఎక్కువ అచ్చటి పాయలు మిగుల పెద్దవి. నీరుల్లి పాయలలో తెల్లనివి ఎర్రనివి అని రెండు రకములు గలవు. ఎర్రని వాని కంటే తెల్లనివి శ్రేష్ఠమందురు.

పైరు చేయుటకు మళ్ళు గట్టి ఉల్లి పాయల ముక్కలను నామళ్ళలో పాతుదురు. గింజలు చల్లినను మొక్కలు మొలచును గాని గింజలు నిలువ యున్న యడల బురుగు పట్టును. మరియునొక్కొక్కప్పుడు మొక్క మొలవక పూర్వమే కుళ్ళి పోవును. కనుక ఉల్లిపాయల ముక్కలనే నాటెదరు. ఉల్లి మొక్క కాయలు గాచు కొరకు ఆహార పదార్థము పాయలలో నిలువ చేసి యుంచు కొనునూ. కాయలు కాసిన పిదప ద్రవ్వితిమా పాయలన్నియు హరించి యుండును. ఉల్లి పాయ లేడాదికి రెండు పంటలు పండును గాని యా చోటనే రెండవ మాటు ఉల్లి పాయలను గాక మరియొ పైరు చల్లిన మంచిది.

వెల్లుల్లి పాయలు చిన్నవి. అవి తెల్లగనే యుండును. వానికి వాసన మెండు. ఉల్లి పాయలు దేహమునకు మంచివి. అలసి యున్నప్పుడు వెల్లుల్లి పాయలను దినినచో సేద దీర్చునందురు. చెవి పోటునకును, చెవుడునకును మంచిది. పాయలను నొక్కి రసము తీసి సామానులను తోముటకు ఉపయోగింతురు.

విషమ కాడ నార మొక్కలు మంచి నేలలందు నీరుసమృద్ధిగా నున్న యెడల మిక్కిలి ఏపుగా పెరుగును. దాని ఆకులప్పుడు నాలుగడుగులు పొడువుండును. వింటి నారికై పూర్వమీ మొక్కలను విస్తారము పెంచెడి వారు గాని బాణముల ప్రయోగమిప్పుడు పూర్తిగా పోయెను గాన నీ మొక్కలను పెంచుటయు మాని వేసిరి. దీని నార మిక్కిలి గట్టిగా నుండును. అయినను ఎందు చేతనో దీని నంతగా వాడుట లేదు. దీని నార తీయుటయు సులస్భమే. ఆకులను కోసి నున్నని బల్లమీద నుండి ఒక చివర నొక్కి పట్టి కర్రతో దాని పొడుగున రాచెదరు. ఇట్లు చేయిటచే మెత్తని పదార్థమంతయు నార నుండి విడిపోవును. ఆకులను నీళ్ళలో జీకి పొవరకును నాన వేసినను నార వచ్చును గాని అదంత మంచి పద్ధతి కాదు.

శతమూలము
వేళ్ళు ముల్లంగి దుంపల వలె నుండును. ఆహార పదార్థస్మీ మొక్క వేళ్ళయందు నిలువ చేసికొనును. ఈ వేళ్ళు తినుటకు బాగుండవు కాని ఔషధములలో పని వచ్చును.

కల్బంద మట్టలు ఆకులే. నిలువ చేసికొనిన ఆహార పదార్థ మాకుల యందుండును. ఈ మొక్కల కంత వీరవసరము లేదు. కల్బంద మట్టల రసముతో కొన్ని ఔషధములు చేసెదరు. దానిని కాల్చి కట్తిన యెడల కొన్ని పుండ్లు తగ్గును.

ఘృత కుమారి మొక్క పువ్వులందముగా నుండుటచే తోటలయందు పెంచు చున్నారు.

కొండ గరుప తీగ కొమ్మల మీద ముండ్లు గలవు. ఆకుల తొడిమల కిరుపక్కల నులి తీగలు గలవు. వీని సాయమున తీగ పైకి బ్రాకును.

మూలము

మార్చు

https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:VrukshaSastramu.djvu/455&action=edit[permanent dead link]