ఉష
ఉష బాణాసురుని కూతురు.
ఉషా పరిణయం
మార్చుబాణాసురిని కూతురైన ఉష దేవి యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలో అసమాన్య ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషా దేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను ఆలింగనం చేసుకొంటాడు. ఆ విషయాన్ని చిత్రలేఖకు చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్తురవులు గీసి చూపుతుంది. అందులోని ఒక చిత్తరువు చూసి ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు అని ఉషా దేవి అడుగగా చిత్ర లేఖ రాకుమారిడి చిత్తురవు చూసి ఈ రాకుమారుడా శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధిని బృందావనం నుండి శోణపురానికి తెప్పించి ఉషా దేవి హంస తూలికా పాన్పు పై పడవేస్తుంది. ఆ రోజు నుండి ఉషానిరుద్ధులు ప్రణయ క్రీడలో మునిగితేలుతారు. ఒక రోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్ళి బాణాసురుడికి విన్నపిస్తారు. బాణాసురుడు అనిరుద్ధుడి మీదకు సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధుడు అందరిని నాశనం చేయడంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్ళి నాగపాశం విసురుతాడు, ఆ సమయంలో బాణాసురిడి రథం మీద జండా క్రింద పడుతుంది. ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడుతాడు. బృందావనంలో అనిరుద్ధుడు కనిపించక పోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాధక సూత్రదారి శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషాయాన్ని గ్రహిస్తాడు. యుద్ధంలో బాణాసురుడు ఓడిపోయి తన కూతురు ఉషను అనిరుద్ధునితో వివాహం జరిపిస్తాడు. వీరి కుమారుడు వజ్రుడు.
ఇవి కూడా చూడండి
మార్చు- ఉషాపరిణయం ఒక ప్రసిద్ధమైన సినిమా.