ఉస్తికాయలు
కూరగాయల వర్గంలో ఉస్తికాయలు కూడా చేరుతాయి. వీటిని కొన్ని ప్రాంతాలలోనే తింటారు. దీని మొక్క సుమారు ఐదారు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండము, ఆకులు అచ్చం వంకాయ మొక్కకు వున్నట్టే వుంటాయి. దీని కాయలు చిన్న గోలీకాయలంత వుండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. దీనిని ప్రత్యేకంగా పెంచరు గాని అక్కడక్కడా తనంతట తానే పొలం గట్లుమీద పెరుగుతుంది.
Turkey Berry | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | S. torvum
|
Binomial name | |
Solanum torvum Sw.
| |
Synonyms | |
Solanum ferrugineum Jacq.
|
దీని కాయల నిండా గింజలే వుంటాయి. ఇవి చిరు చేదుగా వుంటాయి. ఈ కాయలను పగలగొట్టి గింజలు తీసి వేసి నీళ్లలో వేసి బాగా కడుగుతారు. ఆ తర్వాత కూరగా చేసుకుంటారు. ఈ కాయల పేరున కొన్ని వూర్ల పేర్లు, ప్రాంతాల పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఉస్తికాయలపెంట/ ఉస్తికాయల పల్లె/ ఉస్తికాయల మిట్ట
మూలాలు
మార్చు- ↑ "Name - Solanum torvum Sw. synonyms". Tropicos. Saint Louis, Missouri: Missouri Botanical Garden. Retrieved February 19, 2010.