రామభజన

(ఊరు వాడ రామభజనలు నుండి దారిమార్పు చెందింది)

భజనలు, రామ భజనలు

మార్చు
 
చిరుతల భజన చేస్తున్న కళా కారులు

ఒక నాడు పల్లె ప్రజలను భక్తితో ఆనంద పారవశ్యంలో ముంచిన ;భజనలు, ఆంధ్ర ప్రజా జీవితంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించు కున్నాయి. భజించటం, కీర్తించటం, స్తుతించటం వేదకాలం నాటి నుంచి ఈ నాటికి వరకూ పరి పాటై పోయింది.

ఎన్నో భజనలు, ఎందరో భక్తులు.

మార్చు

కష్ట దశలో నున్న మానవులు భగవంతుని స్తోత్రం చేస్తారు. కొందరు వ్వక్తి గతంగా భజన చేస్తే మరికొందరు సమిష్టిగా చేస్తారు. కొందరు భగవంతుని స్తుతిస్తూ పాడతారు. మరి కొందరు ఆడతారు. ఇంకా కొందరు కూటంగా చేరి భజనలు చేస్తారు. భజనలను భక్తి పారవశ్యంతో చేస్తారు, అందరూ సమిష్టిగా పాడుతారు. లయబద్ధంగా తాళాలను మ్రోగిస్తారు. మరికొందరు చెక్క భజనలు చేస్తారు. కొందరు ఒక బృందంగా చేరి కోలాటాలు వేస్తారు. మరి కొందరు కూర్చునే హరిభజనలు చేస్తారు. ఇంకా కొందరు జయదేవుని అష్ట పదులను పురంధరదాసు కీర్తనలను, తుంగతుర్తి కృష్ణదాసు కీర్తనలనూ, నారాయణ తీర్తుల తరంగాలనూ, అన్నమాచార్య గేయాలను చిరుతల తోనూ చెక్కలతోనూ, తాళాలతోనూ, తంబురాలు పుచ్చుకునీ కాళ్ళకు గజ్జెలు కట్టుకునీ పారవశ్యంతో భజనలు చేస్తారు.

 
చేతిలో చిరుతలు ధరించిన భజన కళా కారుడు
ఉదాహరణలు

హరిలో రంగ హరి, హరిలో రంగ హరి కృష్ణమ్మా, గోపాల బాల కృష్ణమ్మా

భజ గోవిందా, గోపాల బాల కృష్ణమ్మా కాళ్ళకు జగ్గెలు కట్టి వేళ్ళకుంగ్రాలు పెట్టి పిల్లంగోరు చేతికి ....ఇచ్చి... ఫింఛము పట్టెద కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మ ||

అంటూ విందులు వేసి తన్మయు లౌతారు. ఎంతెందుకు

పది కొంపలు లేని పల్లెనైనను రామ జనజ మందిర ముడు వరలు గాత రామ నామము భవస్తామ భంజనదివ్య తారక నామమి దరు గాత

భజనల కోలాయలం

మార్చు

పల్లె ప్రజలు వారి వారి వ్వవసాయపు పనులు చూసు కుంటూ, విరామ సమయాల్లో యువకులు, వృద్ధులు భజనలు చేస్తూ వుంటారు. శక్తి వంతులైన యువకులు నృత్యంతో కూడిన శావ మూళ్ళ భజనలు అంటే తాళాల భజనలు, చెక్క భజనలు చేస్తే వృద్ధులు కూర్చుని చేతాళలతోనూ, చిరుతల తోనూ హరిభజనలు, పండరి భజనలు చేస్తారు. మరికొందరు కోలాటపు చిరుతలతో కోలాట నృత్యాలు భక్తి భావంతో చేస్తారు. శ్రీరామ నవమికి, దసరా పండగకు, భజన బృందంలో వున్న వారందరూ వివిధ పాత్రలు విభజించు కుని భజన పద్దితిలోనే నాటకాలను ప్రదర్శిస్తారు. మధ్య మధ్య పద్యాలతో, పాటలతో, సామెతలతో సున్నితమైన హాస్యంతో తెల్ల వార్లూ గ్రామస్థుల్ని ఆనంద పరుస్తారు. కొన్ని బృందాలలో అందరూ ఒకే విధమైన రంగు పంచలు కట్టి, అలాగే నడుంకు కట్టులు కట్టి వలయాకారంగా తిరుగుతూ, ఎదురుగూ గెంతుతూ భజనలు చేస్తూ వుంటే చూపరుల తన్మయులౌతారు.

సుందరమైన అందాల భజనలు

మార్చు

అందరూ కలిసి చేసే భజనలు ఎంతో సుందరంగా వుంటాయి. భజన బృందాల నృత్యం ఎంతో కష్టమైనది. వ్యాయామ ప్రదర్శన లాంటిది. అవేశపరమైనది. మూర్తీ భవించిన భక్తి తన్మయత్వంతో కూడినది. ప్రతి బృందంలోను ఇరవై ముప్పై మంది వరకూ సమ సంఖ్యలోనే వుంటారు. అందరూ లయ తప్పకుండా ఒకే శ్రుతిలో తన్మయులై పాట పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో నృత్యం చేస్తూ వుంటే ప్రేక్షకులందరూ ఆనంద పరవశులై పోతారు.

అలాగే భక్తి భావంతో కొంత మంది ఉపవాస విధానాలతో రాత్రి తెల్లవార్లూ జాగారం చేస్తూ తరంగ నృత్యాలు చేస్తారు. ముఖ్యంగా రామదాసు కీర్తనలూ, -ఎడ్ల రామదాసు కీర్తనలూ, తూము నరసింహదాసు, అల్లూరి వెంకటాద్రి స్వామి, విష్టల ప్రకాశరావు, ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన గేయ కర్తల పాటల్ని భజన పరులంతా ఆలపించే వారు. ఈ భజన బృందాలు ఒక్కొక్క గ్రామంలో పోటీలు పడి రెండు బృందాలుగా ఒకరిని మించి మరొకరు గ్రామ పెద్ద బజాలులో ఉధృతంగా భజనలు చేస్తారు.

భజనల్లో భక్తి:

మార్చు

భజ పాటల్లో, భగవంతుణ్ణి ప్రార్థించటం, వేడుకోవటం, కష్టాలు చెప్పు కోవటం, కృతజ్ఞతాభావం ప్రకటించడం, స్తుతించటం, శ్లాఘించటం, వర్ణించటం, భక్తి ఆవేశంలో రామదాసులా తిట్టటం ........ కోర్కెలు నెరవేరిన భక్తులు ఆయా భజన పాటల్ని, సులభమైన శైలిలో, అందరికీ అర్థమయ్యే భాషలో వినిపిస్తూవుండీ, పండితులూ, పామరులూ, అందరూ ఆ భజనలకు హాజరై ఆంనందించి, తద్వారా ముక్తి మార్గాన్ని వెతుక్కుంటారు.

కొంత మంది వార్ధక్య దశలో, జీవితం మీద విరక్తి భావంతో, భగవంతుని పాద సన్నిధిని చేరు కోవాలనె తాపత్రయంతో,వ్వక్తి గతంగా, తులసీ దాసులా, త్యాగరాజులా, పురంధర దాసులా భక్త తుకారాంలా, భక్త జయదేవుడుగా, నామ దేవుడుగా, మీరా బాయి, సక్కుబాయి, ఆండాళ్ళు, రామ కృష్ణ పరమ హంసలా ఒక రేమిటి...... అందరూ తన్మయత్వ గీతాలాలాపించి పల్లె ప్రజలను తన్మయుల్ని చేసి, వారిలో అంతరాత్మ ప్రభోధం కలిగించారు.

ఉదాహరణకు ఒక పాట

మార్చు

ముఖ్యంగా అన్ని భజల పాటల్లోనూ తెలుగు నాట రామునికి సంబంధించిన పాటల్నే ఎక్కువగా పాడుతారు. అందుకు కారణం శ్రీరాముడు తమ స్వంత దైవమనీ భావిసారు. శ్రీరాముని మీద ముఖ్యంగా భద్రాది రామదాసు వ్రాసినవీ, పాడినవీ ఎన్నో ఉన్నాయి.

అదిగో భద్రాద్రి

తరాళ రాగం, ఆదితాళం.

ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండి|| ముదముతొ సీతరామ ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి యుండెడి ..............||ఇదిగో|| చారు వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై యుండెడి.................................||ఇదిగో|| అనుపమానమై అతి సుందరమై దనరు చక్రముగ ధగ ధగ మెరిసెడి............. .....||ఇదిగో|| కలియుగమందున నిల వైకుంఠము నలరుచున్నది, నయముగ మ్రొక్కెడి................||ఇదిగో|| శ్రీ కరముగను రామ దాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువని వాసము,,...............||ఇదిగో||

"https://te.wikipedia.org/w/index.php?title=రామభజన&oldid=2990897" నుండి వెలికితీశారు