.భజన (Bhajan) భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక సేవల రూపాలలో ఒకటి.పదిమందీ కలుసుకునే వేదిక. దేవాలయములలో, ఇతర ప్రార్థనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన మీరా బాయి భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి.సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది.పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు.పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది.దిగుళ్లు దూరమవుతాయి.మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.

భజనలు - రకాలు సవరించు

భజనల్లో పలు రకాలు ఉన్నాయి. ఇవి ఒక్కో ప్రాంతాలలో ఒక్కోవిధంగా నడుస్తుంటాయి.

  • సాధారణ భజనలు

సాధారణంగా భజనలు దేవాలయాలలో చేస్తుంటారు.

  • సాంస్కృతిక భజనలు

ఈ రకపు భజనలు కొంత ఖర్చు, శ్రమలతో కూడుకొన్నవి. ధనవంతులు, రాజులు, సంస్థానాదీశులు ఇటువంటి వాటిని ప్రోత్సహించేవారు. ఇవి పాటలు పాడటంలో ప్రావీణ్యమున్నవారు, సంగీత వాయిద్యాల సహకారంతో నిర్వహించు కార్యక్రమాలు. ఇవి వినేందుకు వీనుల విందుగా శ్రావ్యంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా కొంత శిక్షణ, సాధన అవసరం.

 
చిరుతల బజన
  • గృహములలో భజనలు

ఇవి ప్రత్యేక సందర్భాలలో, విశేషాలను అనుసరించి నిర్వహిస్తుంటారు. వీటికి ఉదాహరణలు- అయ్యప్ప భజనలు, గృహప్రవేశ సమయంలో నిర్వహించు భజనలు,

  • నగర సంకీర్తనలు

తెల్లవారు ఝామున కొందరు భక్తులు సమూహంగా ఊరిలో సంచరిస్తూ చేస్తూ నిర్వహించే భజనలను నగర సంకీర్తనం అంటారు.

హిందూ భజనలు సవరించు

  1. రామచక్రి భజన

క్రిష్టియన్ భజనలు సవరించు

ముస్లిము భజనలు సవరించు

భజన పాటలు సవరించు

హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

మూలాలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=భజన&oldid=3420946" నుండి వెలికితీశారు